అన్వేషించండి

Karthika Deepam 2 September 10th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ బతకడం కష్టమంటోన్న డాక్టర్లు.. దీప వల్లే తన కొడుకుకీ పరిస్థితి అని అరిచిన శ్రీధర్!

Karthika Deepam 2 Serial Episode దీప, నర్శింహల గొడవల వల్లే కార్తీక్‌కి ఈ పరిస్థితి అని శ్రీధర్ దీపని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్‌కి నర్శింహ పొడిచేయడంతో దీప కార్తీక్‌ని తీసుకొని హాస్పిటల్‌కి వస్తుంది. అందరూ హాస్పిటల్‌కి చేరుకుంటారు. కార్తీక్ పరిస్థితి విషమంగా ఉందని రక్తం ఎక్కించాలి అంటే సేమ్ గ్రూప్ అయిన జ్యోత్స్న మందు తాగడంతో రక్తం ఇవ్వకూడదని గతవారమే తన ఫ్రెండ్‌కి ఇచ్చానని అంటుంది. ఇక దీప కార్తీక్‌కి రక్తం ఇస్తుంది.. కాంచన వెక్కి వెక్కి ఏడుస్తుంది. రెండు రోజుల్లో పెళ్లి కొడుకుగా చూడాల్సిన వాడిని ఆ దుర్మార్గుడు ఇలా చేస్తాడు అనుకోలేదని ఏడుస్తుంది. పారిజాతం జ్యోత్స్నని తీసుకొని పక్కకు వస్తుంది.

పారిజాతం: నిజం చెప్పు నీ ఫ్రెండ్‌కి బ్లడ్ ఇచ్చాను అని చెప్పడం అబద్ధం కదా.
జ్యోత్స్న: అవును. 
పారిజాతం: ఎందుకు అబద్ధం చెప్పావు. 
జ్యోత్స్న: నేను పార్టీలో తాగాను గ్రానీ..
పారిజాతం: జ్యోత్స్న చెంప పగలగొట్టి.. నీ అంత నష్ట జాతకురాల్ని దరిద్రపుగొట్టుదాన్ని నేనే ఎక్కడా చూడలేదు.
జ్యోత్స్న: గ్రానీ
పారిజాతం: మీ బావ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వు అని నాకు తెలుసే
జ్యోత్స్న: నర్శింహ దీపని చంపేలా రెచ్చగొట్టింది నేను అని గ్రానీకి తెలిసిపోయిందా ఏంటి. నేను వాడిని రెచ్చ గొట్టకపోయి ఉంటే దీపని చంపాలి అనుకునేవాడు కాదు. అప్పుడు బావకి ఈ కత్తిపోటు తగిలేది కాదు.
పారిజాతం: మీ బావ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వే. ఇంట్లో ఉన్న వాడిని బ్యాచిలర్ పార్టీ అని పిలవకపోయి ఉంటే బయటకు వచ్చేవాడు కదా దీపని కలిసే వాడు కాదు ఆ నర్శింహ పొడిచే వాడు కాదు. వాడు ఇంట్లోనే ఉండి ఉంటే దీప చచ్చేది. ఇప్పుడు చూడు మనకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో రెండు రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా జరగదు. ఆగిపోయినట్లే. నువ్వు అసలైన వారసురాలు కాదని నీకు తెలుసు అసలైన వారసురాలు బతికి ఉంది అని మన ఇద్దరికీ తెలుసు.. ఇప్పుడు కార్తీక్‌ని పెళ్లి చేసుకొంటే ఆస్తి, బావ రెండూ నీవి అయ్యేవి కదా. కొన్ని సార్లు నువ్వు నీకు వచ్చిన బంగారు అవకాశాల్ని కూడా పక్కవాళ్లకి తీసుకెళ్లి ఇస్తున్నావ్. కార్తీక్‌కి నువ్వు బ్లడ్ ఇచ్చుంటే సింపథీ ఉండేది కదా. ఇప్పుడు దీప బ్లడ్ ఇచ్చి అది దేవత అయింది.
జ్యోత్స్న: తప్పు చేసిన దాన్ని  వదిలేసి నన్ను అంటున్నావ్ ఏంటి. ఇదే మాట అక్కడంటే కొడతారు. 
పారిజాతం: పోయి ముఖం కడుక్కొనిరా నువ్వు తాగావని నీ ముఖం చూస్తే అర్థమవుతుంది. 

శౌర్య తన బట్టలు అన్నీ ఓ దగ్గర పెట్టి అనసూయతో అమ్మ బట్టలు కొంటానని చెప్పిందని లేని కలర్ బట్టలు కొనుక్కుంటానని అంటుంది. అనసూయ శౌర్యకి అన్నీ తల్లి పోలికలే వచ్చాయని దీప చదువుకొని ఉంటే మంచి కలెక్టర్ అయ్యేదని అనసూయ అనుకుంటుంది. తన వల్లే దీప చదువుకోకుండా అయిపోయిందని అనసూయ అనుకుంటుంది. 

కాంచన: సమయానికి నా కొడుకుకి రక్తం ఇచ్చావ్ థ్యాంక్స్ దీప.
శ్రీధర్: దీపకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావ్ కాంచన. కోర్టుకి ఎక్కించి కొడుకు పరువు తీసింది. కత్తితో పొడిచి ప్రాణం తీసిందనా. ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంత వరకు డాక్టర్లు ఏం చెప్పని పరిస్థితి నా కొడుకుకి ఎందుకు ఈ గతి పట్టాలి. వాడు ఏమైనా పాపం చేశాడు అంటే అది దీపకు సాయం చేయడమే. వద్దని ఎంత చెప్పినా దీప కోసం తండ్రి మీద గొడవ పడ్డాడు కానీ నా మాట వినలేదు. ఈ మొగుడు పెళ్లాలు కొట్టుకొని చావడం కాదు వాళ్ల మధ్య వీడిని చంపుతున్నారు. 
సుమిత్ర: దీప విషయంలో ఆ నర్శింహ ఎంత తప్పుగా ప్రవర్తించాడో మనకు తెలుసు కదా అన్నయ్య.
శ్రీధర్: ఎవరమ్మా దీప. ఎవరమ్మా నర్శింహ ఏంటమ్మా వీళ్లకి మనకి సంబంధం. దీప ఏమైనా నీ కూతురా లేక నా మేనకోడలా. ఏ సంబంధం ఉందని ఈ మనిషి కోసం నా కొడుకు చావాలి. 
పారిజాతం: మనసులో నువ్వు సూపర్ అల్లుడు నేను తగులుకుందాం అనుకున్నా నువ్వు తగులుకున్నావ్ ఉతికి ఆరేయ్.
శ్రీధర్: కాంచన నీకు గుర్తుందా నర్శింహ మన ఇంటికి వచ్చి నీకు ఒక్కడే కొడుకు కదా జాగ్రత్తమ్మ అని చెప్పాడు. వాడు  మన కొడుకుని చంపేస్తా అన్నాడు అది ఈ రోజు నిజం చేశాడు. దీనంతటికి కారణం ఎవరు దీప కాదా. 
సుమిత్ర: దీప మాత్రం ఏం చేయగలదు అన్నయ్య.
శ్రీధర్: నువ్వు ఇంత అమాయకంగా అడుగుతావేంటి అమ్మ. ఏం చేయగలదు అని అడుగుతావేంటి నువ్వు నా దగ్గరకు రావొద్దు అని చెప్పలేదా. నా గొడవలు నేను పడతా మీకు ఎందుకు అని కార్తీక్‌తో అంటే వాడు వెళ్లేవాడా. అరే ఏమైనా చిన్నది జరిగితే చాలు కూతురితో ఫోన్ చేయించడం నా కొడుకుని రమ్మని చెప్పడం.. ఈవిడ గారు ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో నా కొడుకు రెస్టారెంట్ సంగతి మర్చిపోయి అవుట్ హౌస్ దగ్గర ఆఫీస్ మొదలు పెట్టాడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే చాలు ఉంటే అవుట్ హౌస్ దగ్గర, లేదంటే హోటల్ దగ్గర కాకపోతే స్కూల్ దగ్గర ఉంటాడు. అంతలా ఏం పని ఉంటుందో నాకు అయితే అర్థం కాదు. సరే పెళ్లి చేస్తే ఈ గొడవలు ఉండవని అనుకుంటే దాన్ని చెడగొట్టారు. అంటే ఆ రోజు అక్కడ దీప లేకపోయి ఉంటే నిశ్చితార్థం బ్రహ్మాండంగా జరిగింది. కోర్టులో ఎంత పరువు తీయాలో అంత తీశారు. ఈ గొడవలు ఇక్కడితో ఆగిపోయవి అనుకుంటే ఇళ్లు గొడవ వచ్చింది. ఆ చేతకాని వెదవ పెళ్లాన్ని ఏం చేయలేక నా కొడుకుని చంపాలని చూశాడు. వాడిని ఊరికే వదలను. ఆల్రెడీ వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.. 
సుమిత్ర: కార్తీక్ కాపాడకపోయి ఉంటే దీప చనిపోయేది కదా అన్నయ్య.
శ్రీధర్: నాకు నా కొడుకు ముఖ్యం మిగతా వారి సంగతి నాకు అనవసరం. 

ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కోమాలోకి వెళ్లిపోవచ్చని అంటాడు. కోమాలోకి వెళ్తే మనిషి మనకు దగ్గరని అంటాడు. కాంచన, జ్యోత్స్న ఏడుస్తారు. దీపతో శ్రీధర్ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా కార్తీక్‌కి ఏమైనా అయితే మిమల్ని ఎవర్నీ వదలను అని అంటుంది. ఇక సుమిత్ర దీపని వెళ్లిపోమని చెప్తుంది. దీపను వెళ్లనని చెప్తుంది. శ్రీధర్ కోపంతో రగిలిపోతాడు. దాంతో సుమిత్ర దీపని వెళ్లిపోమని చెప్తుంది. దీప ఇంటికి వెళ్లి జరిగింది అనసూయతో చెప్తుంది. అనసూయ షాక్ అయిపోతుంది. శౌర్య ఆ మాటలు విని ఏడుస్తుంది. దీపని ఏమైందని అడుగుతుంది. శౌర్య తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లమని అంటుంది. శౌర్యని హాస్పిటల్‌కి తీసుకెళ్లొద్దని అనసూయ చెప్తుంది. దీప మాత్రం పాపని తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: పంచకమణిని తాకినందుకు తిలోత్తమ చేతి గాయం మాయం.. సుమన కన్నింగ్ ప్లాన్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget