Karthika Deepam 2 Serial October 21st: కార్తీకదీపం 2 సీరియల్: నేను నీ భర్తని శౌర్య మన కూతురు ఇదే ఫిక్స్.. దీప మెడలో తాళిని జ్యో తెంపేస్తుందా!
Karthika Deepam 2 Serial Episode దీప శివనారాయణ ఇంటికి వెళ్లడం పెళ్లి ఇష్టం లేకుండా అయిందని చెప్పడంతో తాళి తీసేయ్ మని జ్యోత్స్న చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode తాళి నా మెడలో ఎందుకు కట్టారని దీప కార్తీక్‌ని ప్రశ్నిస్తుంది. నీ కూతురి కోసం తాళి కట్టానని కార్తీక్ చెప్తాడు. చిన్న పిల్ల తెలీక అంటే ఆ మాటని ఎలా నిజం చేస్తారని అడుగుతుంది. నువ్వు నేను తప్ప దానికి ఎవరూ లేరని నువ్వు నా నుంచి తీసుకెళ్లిపోతున్నావ్ అని భయంతో నువ్వు నాన్నగా ఉంటావా అని అడిగిందని చెప్తుంది. ఏం చేయాలో అర్థం కాని నాకు నీ మాటల్లో సమాధానం దొరికిందని నువ్వు ఏ అధికారంతో నా కూతుర్ని ఆపుతున్నావు కదా అని అడిగావు కదా అందుకే పెళ్లి చేసుకున్నానని చెప్తాడు.
దీప: మీ మాటలకు చేతలకు నా జీవితం ఏం అయిపోతుందని అనుకోరా. ఇప్పుడు అందరికీ నేను నా ముఖం ఎలా చూపించాలి. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి. చెప్పండి.
కార్తీక్: అన్నింటికి ఒకటే సమాధానం అది నీ మెడలో వేలాడుతుంది.
దీప: ఇది పసుపు తాడు కాదు బాబు నా మెడకి ఉరితాడు. మీ ఇష్టానికి మీరు ఆవేశంతో నా మెడలో వేసిన పలుపుతాడు. సమాజం దీన్ని గౌరవించదు.
కార్తీక్: నువ్వు పాపని బలవంతంగా తీసుకుపోతున్నావ్ దానికి ఏమైనా అయితే.
దీప: అవుతుంది.
కార్తీక్: చచ్చిపోతుంది దీప.
దీప: ఏమంటున్నారు బాబు.
కార్తీక్: నిజం చెప్పకుండా అది నర్శింహకు బయపడుతుంది. ఆ భయంతో చచ్చిపోతుంది. అది నాన్నని అడిగింది అందుకే ఇచ్చాను.
దీప: అంటే ఈ తాళి నా మెడలో పడితే మీరు నాకు ఏమవుతారు తెలుసా
కార్తీక్: తెలుసు దీప నేను శౌర్యకి తండ్రి అవ్వడానికి ఇంతకు మించి మార్గం లేదు. ఇప్పుడు మనల్ని అక్రమ సంబంధం అనరు ఎవరైనా అలా అంటే పళ్లు రాలగొట్టడానికి ఈ తాళి ఉంది. అయినా నేను నీ మెడలో తాళి కట్టింది శౌర్య కోసం నీకు భర్తగా ఉండటానికి కాదు. నేను శౌర్యకి నాన్ననే కానీ నీ అంతట నువ్వు నాకు భర్తగా అనుకునే వరకు నీ శ్రేయాభిలాషినే. దీప దీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెడితే.. ఒక చిన్న దీపం ఆరిపోతేనే నువ్వు చూడలేకపోతే చిన్న పిల్ల దీప నేను ఎలా ఊరుకుంటా. నువ్వు అవునన్న కాదు అన్నా ఇక శౌర్య మన బిడ్డ. ఇది మాత్రం మారదు.
దీప: మనసులో ఇది మారదు అని నాకు అర్థమవుతుంది. ఇది జ్యోత్స్నకు పడాల్సిన తాళి. దీనికి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలి.
కార్తీక్ ఇంట్లో అనసూయ టీ పెడుతుంది. దీప దగ్గరకు తీసుకెళ్తే అక్కడ దీప ఉండదు. అనసూయ, శౌర్య దీప కోసం వెతుకుతారు. ఇంతలో కాంచన, కార్తీక్ బయటకు వచ్చి అమ్మ కనిపించడం లేదని అంటారు. దీప ఊరు వెళ్లిపోయి ఉంటుందని శౌర్య ఏడుస్తుంది. ఎక్కడికీ వెళ్లడని కార్తీక్ చెప్తాడు. ఇక దీప నడుచుకుంటూ జ్యోత్స్న ఇంటికి వస్తుంది. పారిజాతం జ్యోత్స్నకు ఏం న్యాయం చేస్తారు. నమ్మించి మోసం చేసిన దీపకి ఏం శిక్ష వేస్తారు అంటే దీపని ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను అని శివనారాయణ అంటాడు. ఇంతలో దీపని చూసి అందరూ షాక్ అవుతారు.
పారిజాతం: గమ్మం తొక్కనివ్వను అన్నారు ఇప్పుడు సరాసరి లోపలికే వచ్చేసింది. ధైర్యంగా మీ ముందే నిలబడింది చూడండి. మీరు మాట్లాడుతారా నన్ను మాట్లామంటారా. నేను పద్ధతి లేని ఆడవాళ్లని చూశాను. బరితెగించిన ఆడదాన్ని చూశాను కానీ మరీ ఇంత బరితెగించినదాన్ని నిన్నే చూస్తున్నానే నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా. ఈ ఇంటి ఆడపిల్ల మెడలో పడాల్సిన తాళి నీ మెడలో పడేలా చేసుకున్నావ్ నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా. అసలు నా మనవడితో తాళి ఎలా కట్టించుకున్నావ్. దాన్ని ముందు వేసుకొని ఎలా మా ముందుకు వచ్చావ్.
శివనారాయణ: ప్రతీ ఒక్కరు తప్పు చేయడం తప్పు సమర్దించుకోవడం. నా మనవరాలు మొదటి నుంచి చెప్తూనే ఉంది ఈ దీప అవకాశావాది ఏదో ఒక రోజు బుద్ధి చూపిస్తుందని అది నువ్వు ఈ రోజు నిజం చేశావు.
దీప: తాతయ్య గారు
శివనారాయణ: ఎవరే నీకు తాతయ్య.
దీప: కార్తీక్ బాబు నాకు తాళి కట్టారు కానీ నాకు ఇష్టం లేదు
జ్యోత్స్న: అయితే దాన్ని తెంపి పడేయ్. ఇష్టం లేనప్పుడు ఇది నీ మెడలో ఉన్నా అర్థం లేదు ఇప్పుడే తెంపేయ్. నువ్వు తెంపుతావా నన్ను తెంపమంటావా.
మరోవైపు కార్తీక్ దీప జ్యోత్స్న ఇంటికి వెళ్లుంటుందని తెలుసుకొని వెళ్తాడు. ఇంట్లో నుంచి వెళ్లి నువ్వు పెళ్లి చేసుకున్నావ్ నా అదృష్టానికి ఎంత దరిద్రం పట్టింది అంటే నీ మెడలో పడిన తాళి నేను తీసుకొచ్చా అని అంటుంది జ్యోత్స్న. కన్నకూతుర్ని పెట్టి మరి దీపని సపోర్ట్ చేశావు కదా ఇప్పుడు అడగవా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర మీద ఎటాక్.. బిజినెస్‌లో ఓడించడానికి రంగంలోకి దిగిన సరయు!