అన్వేషించండి

Karthika Deepam 2 Serial October 18th: కార్తీకదీపం 2 సీరియల్: వంటలక్కకు రెండో పెళ్లి.. దీప మెడలో తాళి కట్టేసిన కార్తీక్‌.. గుండె పగిలేలా ఏడుస్తూ తలబాదుకుంటున్న జ్యోత్స్న..!  

Karthika Deepam 2 Serial Episode కార్తీక్ దీపని పెళ్లి చేసుకోవడం చూసిన జ్యోత్స్న నా జీవితం అన్యాయం అయిపోయిందని కుమిలి కుమిలి ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య దగ్గరకు కార్తీక్ దీపను వెళ్లనివ్వడు. నేను ఎవరి మాట వినను ఎవరి మాటకో కట్టుబడి ఉండనని ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా నా కూతుర్ని తీసుకెళ్లిపోతానని దీప పాప దగ్గరకు వెళ్తుంది. దానికి కార్తీక్ దీపతో నర్శింహలా ప్రవర్తించకు పాప పరిస్థితి అర్థం చేసుకో అని అంటాడు. ఏం చెప్పినా వినను అని కార్తీక్ అంటాడు. ఇంతలో శౌర్య బయటకు వస్తుంది.

దీప పాపని తీసుకొని వెళ్తుంటే కార్తీక్ అడ్డుకుంటాడు. ఇక శౌర్య కూడా ఊరు వెళ్లొద్దని అంటుంది. నాకు కార్తీక్ కావాలని అంటుంది. నేను రాను అని మొండికేస్తుంది. నాకు నువ్వు కార్తీక్ ఇద్దరూ కావాలని ఇద్దరి చేతులు పట్టుకుంటుంది. కార్తీక్‌ బాబు మనతో ఎందుకు ఉంటారు. వాళ్ల ఊరు వేరు మన ఊరు వేరు అంటుంది. దీప పాపని తీసుకొని వెళ్తుంటే నేను రాను అని శౌర్య ఏడుస్తుంది. నేను మిమల్ని వెళ్లనివ్వనని కార్తీక్ అంటాడు. ఇక దీపతో నాకు నాన్నగా కార్తీక్ కావాలని దీపతో చెప్తుంది. దీప షాక్ అయిపోతుంది. 

దీప: నోర్ముయ్‌ చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు. నీకు నాన్న లేడు రాడు. నీకు అమ్మ అయినా నాన్న అయినా అన్నీ నేనే రా.
కార్తీక్: ఆగు దీప. శౌర్యని నువ్వు బలవంతంగా తీసుకెళ్లడానికి వీళ్లేదు. శౌర్యని నువ్వు తీసుకెళ్తాను అంటే నేను ఒప్పుకోను.
దీప: నా కూతురి మీద మీ పెత్తనం ఏంటి బాబు.

దీప ఎంతలా తీసుకెళ్లడానికి ప్రయత్నించినా కార్తీక్ పాపని ఇవ్వడు. ఇలా చేయడం దౌర్జన్యం అని దీప అంటుంది. ఏడుస్తుంది. నా కూతుర్ని నా నుంచి దూరం చేయడానికి మీరు ఎవరు మీకు ఏ హక్కు ఉంది అని అడుగుతుంది. మీ కళ్లు ముందే ఇంత జరుగుతుంటే ఏం అడగరేమమ్మా అని కాంచనను అంటుంది. నాతో వస్తాను అని చెప్పమని శౌర్యని అడిగితే కార్తీక్ వస్తేనే నేను వస్తానని శౌర్య అంటుంది. ఈ మనిషికి ఏం అధికారం ఉందని నన్ను శాషిస్తున్నాడని అంటుంది. దాంతో కార్తీక్ నిన్ను శాషించాలి అంటే అధికారం కావాలా అంటూ దేవుడి గుడిలో తాళి దగ్గరకు వెళ్తాడు. మరోవైపు జ్యోత్స్న కూడా వస్తుంది. తాత ఒప్పుకున్నాడని బావకి ముద్దు పెట్టి మరీ చెప్పాలి అనుకుంటుంది. జ్యోత్స్న ఇంట్లోకి అడుగుపెట్టిన టైంకి కార్తీక్ దీప మెడలో తాళి కట్టేస్తాడు. జ్యోత్స్న షాక్ అయిపోయి ఏడుస్తుంది. బిత్తరపోతుంది. శౌర్య నా కూతురు నా కూతురు ఎక్కడికి రాదు నాతోనే ఉంటుందని అంటుంది. ఇక శౌర్య మా అమ్మని మా నాన్న పెళ్లి చేసుకున్నాడని అంటుంది. జ్యోత్స్నతో మా అమ్మకి మా నాన్నకి పెళ్లి అయిపోయింది అంటుంది. జోత్స్న అసలు షాక్ నుంచే తేరుకోదు. 

మరోవైపు అందరూ జ్యోత్స్న తీపి కబురు గురించి ఆలోచిస్తుంది. నవ్వుతూ ఉంటారు. సుమిత్రని హారతి రెడీ చేయమని పారిజాతం చెప్తుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇంతలో జ్యోత్స్న తన మీద తనకే స్ఫృహ లేనట్లు ఇంటికి వస్తుంది. అందరూ జ్యోత్స్న పరిస్థితికి షాక్ అయిపోతారు. ఏమైంది అని అడిగినా జ్యోత్స్న ఏం చెప్పకుండా వెళ్తుంది. అందరూ ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఇక జ్యోత్స్న వెళ్తూ వెళ్తూ మెట్ల మీద కుప్పుకూలి పోయి ఏడుస్తుంది. నాకు అన్యాయం జరిగిపోయిందని ఏడుస్తుంది. మీరంతా కలిసి నాకు అన్యాయం చేశారని ఏడుస్తుంది. మనకోసం అక్కడ ఎదురు చూసినోళ్లు ఎవరూ లేరు అని బావ పెళ్లి  చేసుకున్నాడని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. బావ దీప మెడలో తాళి కట్టాడని చెప్పి ఏడుస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. బావ నాకు అన్యాయం చేశాడని తల కొట్టుకొని ఏడుస్తుంది. 

దీప, కార్తీక్, కాంచన చెరో వైపు కూర్చొని ఉంటారు. ఇంతలో అనసూయ వస్తుంది. ఇక అనసూయ నర్శింహని అరెస్ట్ చేయించానని చెప్తుంది. ఇక శౌర్య అనసూయతో కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. అనసూయ షాక్ అయిపోయి దీప మెడలో తాళి చూస్తుంది. నీ కన్నీళ్లు దేవుడు తుడిచేశాడే దీప అని సంతోషపడుతుంది. కాంచన కూడా హ్యాపీగా ఫీలవుతుంది. అనసూయ కార్తీక్ దగ్గరకు వెళ్లి నా మేనకోడలికి ఐయిదోతనం ఇస్తానన్నారు మీ కాళ్లు కడగటం తప్ప నాకు వేరు దారి లేదు అంటుంది.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, రూపల పెళ్లి తంతు వీడియో తీసిన దీపక్‌కు గట్టి షాక్.. తిరిగి బ్లాక్ మెయిల్ చేసిన రాజు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Srikakulam: ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Embed widget