Karthika Deepam 2 Serial July 10th: కార్తీకదీపం 2 సీరియల్: దీపని వెతికి కనిపెట్టేసిన కార్తీక్.. ఆ వ్యక్తిని పట్టుకొని చితక్కొట్టిన దీప!
Karthika Deepam 2 Serial Episode కార్తీక్ దీపని వెతుకుతూ వెళ్లడం జ్యోత్స్న కార్తీక్‌ని ఫాలో అవ్వడంతో అది గమనించిన కార్తీక్ జ్యోత్స్నని వెళ్లిపోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య మాటలు విన్న దీప శౌర్యకి తండ్రి కార్తీకే అని తెలిసిపోయినట్లుందని అనుకుంటుంది. దీప బయట బట్టలు ఆరేస్తుంటే ఓ వ్యక్తి దీపని వడ్డీ బాబు ఇంటికి కొత్తగా ఓకామె వచ్చిందన్నారు ఈమెనా ఈమెకు భర్త లేడుంట కదా ఆ లోటు నేను తీర్చుతానని దీపని తగులుకుందామని అనుకుంటాడు. దీప గురించి కాంచన, దశరథ్, సుమిత్రలు మాట్లాడుకుంటారు. సుమిత్ర దీప గురించి చాలా బాధ పడుతుంది. కాంచన సుమిత్రను ఓదార్చుతుంది. ఇక దశరథ్ కాంచనకు కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి గురించి అడుగుతాడు.
కాంచన: అన్నయ్య మీ బావ నా మీద సీరియస్ అయ్యారు. బావకి ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టించు అన్నారు.
సుమిత్ర: అన్నయ్యే ఆ మాట అన్నప్పుడు ఇక ఆలస్యం ఎందుకండి. మామయ్యతో మాట్లాడి తొందర్లోనే ముహూర్తాలు పెట్టి నిశ్చితార్థం పెట్టించేద్దాం.
కార్తీక్ దీప కోసం రోడ్ల మీద తిరుగుతూ వెతుకుతుంటాడు. మరో వైపు జ్యోత్స్న, పారిజాతం కూడా తిరుగుతూ వెతుకుతుంటారు. కార్తీక్ కారు చూసిన జ్యోత్స్న గ్రానీకి చెప్తే కార్తీక్ కారుని ఫాలో అవ్వమని పారిజాతం చెప్తుంది. కార్తీక్ అద్దంలో జ్యోత్స్న కారు చూసి జ్యోత్స్న తనని ఎందుకు ఫాలో అవుతుందని అనుకుంటాడు. ఓ చోట కారు ఆపుతాడు.
జ్యోత్స్న: బావ మనల్ని చూసేశాడు గ్రానీ.
పారిజాతం: చూడని అయితే ఏంటి.
కార్తీక్: నాతో ఏమైనా పని ఉందా.
జ్యోత్స్న: లేదు.
పారిజాతం: నువ్వెక్కడికి వెళ్తున్నావ్ మనవడా.
కార్తీక్: దీపని వెతుకుతున్నా.
జ్యోత్స్న: మేం కూడా.
కార్తీక్: అయితే నా వెనక ఎందుకు.
పారిజాతం: నిన్ను ఫాలో అయితే దీప దొరుకుతుందని.
కార్తీక్: పారు.
పారిజాతం: అదే మనవడా నువ్వు తెలివిగా వెతుకున్నావ్ కదా అందుకే.
జ్యోత్స్న: నేను నీతో వస్తాను బావ. కలిసే వెతుకుదాం.
కార్తీక్: మన కార్లలాగే మన దారులు కూడా వేరు అవి ఎప్పటికీ దొరకవు. ఇప్పటి వరకు వెంటపడింది చాలు ఇక ఆగిపో జ్యోత్స్న నన్ను ముందుకు పోనీ.
జ్యోత్స్న: బావ డబల్ మీనింగ్ మాట్లాడుతున్నాడేంటి గ్రానీ. ఏదో తేడా కొడుతుంది. బావ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు.
దీప షాప్ దగ్గరకు వెళ్తుంది. ఇంతకు ముందు దీపని చూసి లైన్‌లో పెట్టాలి అనుకున్న వ్యక్తిదే ఆ షాపు. దీపని ఆ వ్యక్తి పులిహోర కలపాలి అంటాడు. ఆ వ్యక్తి దీపతో తేడాగా మాట్లాడుతుంటే దీప వాడి చెంప పగల గొడుతుంది. క్లాస్ పీకుతుంది. భయపెడుతుంది. దీంతో ఆ వ్యక్తి దీప జోలికి వెళ్లకూడదు అనుకుంటాడు. పారిజాతం ఇంట్లో అందరూ కార్తీక్, జ్యోత్స్నల నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటారు. పారిజాతం దీప కూడా నిశ్చితార్థానికి ఉండాలని పాజిటివ్‌గా మాట్లాడితే అందరూ షాక్ అయిపోతారు. సుమిత్ర ఎమోషనల్ అయి ఏడుస్తుంది. జ్యోత్స్న సుమిత్రని ఓదార్చుతుంది. శివనారాయణ దీప గురించి పారిజాతం పాజిటివ్‌గా మాట్లాడటం గురించి ప్రశ్నిస్తాడు. కార్తీక్ దీపని చూస్తాడు. ఫాలో అయి పరుగులు పెడతాడు. దీప కార్తీక్‌ని సీరియస్‌గా చూస్తుంది. దీప కార్తీక్‌ని తనని వదిలేయ్ మని అందరికీ నన్ను దూరం చేశారని తిడుతుంది. కార్తీక్ తన ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.