Karthika Deepam 2 Serial Today April 10th: కార్తీకదీపం 2 సీరియల్: దీపని మీరే బలిపశువుని చేశారు.. తల్లి మీద కార్తీక్ సీరియస్.. జ్యోని ఇక ఎవరూ కాపాడలేరు?
Karthika Deepam 2 Serial Today Episode దీప జ్యోత్స్నతో నిజం చెప్పించాలని జ్యో ఇంటికి బయల్దేరడం.. కార్తీక్‌కి విషయం తెలిసి తల్లిమీద సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న, గౌతమ్‌ల పెళ్లి ఆపమని కాంచన తండ్రిని బతిమాలుతుంది. పెళ్లి ఆగదు ముహూర్తాలు పెట్టుకుంటున్నాం.. అది కూడా ఇక్కడ కాదు ఫారిన్‌లో అని అంటారు. కాంచన నాన్న నాన్న పెళ్లి ఆపేయ్ నాన్న అనడంతో పెద్దాయన నీ కాళ్లు పట్టుకుంటాను వదిలేయమ్మా అంటారు.
శివన్నారాయణ: మరేం చేయను అమ్మ ఈ ఇంట్లో శుభకార్యం అంటే చాలు మీకు నచ్చదు. నీ కొడుకు కాపురం బాగానే ఉంది కదా. మరి నీ అన్న కూతురు ఏం పాపం చేసింది ఎందుకు దాన్ని ఇలా వేధించుకు చంపుతున్నారు.
కాంచన: నా మాట విను నాన్న ప్లీజ్ నాన్న.
శివన్నారాయణ: ఇది పెళ్లి ఇళ్లా చావు ఇళ్లా ఎందుకు ఆ ఏడుపు. ఏ జన్మలో చేసిన పాపమో కూతురి రూపంలో వెంటాడుతుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆగదు. ఎవరు అపమన్నా ఆపే ప్రయత్నం చేసినా నేను ఉపేక్షించను. నీకు ఈ ఇంటికి ఏం సంబంధం లేదు. ఈ ఇంటి శుభకార్యానికి నీకు ఇక ఆహ్వానం ఉండవు. ఈ అడుగులు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. సుమిత్ర వీళ్లని ఇక జీవితంలో ఈ ఇంటి గడప తొక్కొద్దని చెప్పు.
కాంచన: వదిన నువ్వ అయినా చెప్పు వదినా గౌతమ్ మంచోడు కాదు.
సుమిత్ర: నువ్వు ఇక వెళ్లొచ్చు వదినా. నా కూతురికి పెళ్లి జరుగుతుందని దీపకి నా మాటగా చెప్పండి.
పారు: జ్యోత్స్నికి జరిగింది చెప్పాలా వద్దా. ఎందుకైనా మంచిది చెప్పేద్దాం దాని ఏర్పాట్లు చేసుకుంటుంది..
ఇదంతా జ్యోత్స్న కుట్రే..
శ్రీధర్ కావేరి కోసం మొత్తం వెతికి ఇంటికి వస్తాడు. కావేరికి ఎక్కడికి వెళ్లావని అంటే కావేరి ఏం చెప్పదు. శ్రీధర్ దీని వెనక ఏదో కుట్ర ఉంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఇక కాంచన దీపతో ఈ పెళ్లి ఆగదు అని ముహూర్తాలు పెట్టుకున్నారు వచ్చే వారం పెళ్లి అది కూడా ఇండియాలో జరగదు అని అంటుంది. కాంచన దీపతో నా మేనకోడలు దాని జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా నీ జీవితం కూడా నాశనం చేయాలి అనుకుంటుంది. అందుకే ఈ పెళ్లికి రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరికీ ఇబ్బంది రాకుండా రెండు కుటుంబాలు నష్టపోకుండా చూడమని అంటుంది. జ్యోత్స్నతోనే నిజం చెప్పిస్తే పెళ్లి ఆగుతుంది. నా మీద నింద పోతుందని దీప అనుకుంటుంది.
ఈ పెళ్లి జరగనివ్వదు.. నువ్వు అనుకున్నది జరగనివ్వదు
శాంతి కోసం పంపింతే వినలేదు ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్తున్నా అని తండ్రి ఫొటోకి దండం పెట్టి దీప వెళ్తుంది. జ్యోత్స్నకు పారు అంతా చెప్తుంది. దీపకు అంతా తెలిసిపోయిందని పారు అంటే దీపకు తెలిసే అవకాశం లేదని అంటుంది. నువ్వే చెప్పేసుంటావ్ అంటే లేదని పారు అంటుంది. దీప ఈ పెళ్లి జరగనివ్వదు.. నువ్వు అనుకున్నది జరగనివ్వదు అని పారు చెప్తుంది. జ్యోత్స్న అరుస్తుంది. దాని దగ్గర ఏదో ఆధారం ఉంది నిన్ను బయట పెడుతుందని జాగ్రత్తలు చెప్తుంది. దీపతో కాస్త జాగ్రత్తగా ఉండవే అని చెప్పి వెళ్లిపోతుంది.
ఆపవే నాటకాల పెళ్లి కూతురా..
దీపకు నా గురించి నిజం తెలిసే ఉంటే ఆధారాలతో రావాలి కదా ఒకవేళ దీప వస్తుంటే రాకుండా ఆపాలి అనుకుంటుంది. అసలు దీప దగ్గర ఏ ఆధారం ఉందో తెలుసుకోవాలని అంటుంది. వెంటనే దీపకి కాల్ చేస్తుంది పది నిమిషాలు ఆగు వస్తున్నా అని అంటుంది. ఇంటికి వస్తున్నావా అని జ్యో అడిగితే వస్తున్నా ఆగు అని చెప్తుంది. దీప సత్తిపండు గురించి మాట్లాడితే దీపకు నిజం తెలిసిపోయిందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆపవే నాటకాల పెళ్లి కూతురా నాకు నిజాలు అన్నీ నాకు తెలిసిపోయావని అంటుంది. జ్యోత్స్న రావొద్దని దీపని అంటే నేను వచ్చేలోపు మీ తాత కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పు అంటుంది.
దీపని ఎలా ఆపాలి...
జ్యోత్స్న అరుస్తూ దీప తన ప్లాన్ నాశనం చేస్తుందని ఎలా అయినా దీపని ఆపాలి అని అనుకుంటుంది. ఇక కార్తీక్ ఇంటికి వెళ్లి దీపని పిలుస్తాడు. అనసూయ, తల్లితో మీరేం చేస్తారో నాకు తెలీదు నా తరఫున దీపకు వార్నింగ్ ఇవ్వాల్సిందే అంటాడు. ఈ మధ్య దీపలో మార్పు కనిపిస్తుందని కంగారు పడుతుంది.. సడెన్‌గా పని ఉందని వెళ్లిపోతుందని అంటాడు. దీపని పిలుస్తాడు. దీప ఇంట్లో లేదని కాశి వాళ్ల ఇంటకి వెళ్లిందని కాంచన చెప్తుంది. స్వప్నకి కాల్ చేస్తాను అని కార్తీక్ అంటాడు. కాంచన వద్దని అంటుంది. ఇద్దరూ దీప ఎక్కడికి వెళ్లిందో తెలీదు అనేస్తారు.
కార్తీక్ సీరియస్..
దీప ఎక్కడికి వెళ్లిందో మీకు తెలుసా.. అని సీరియస్‌గా అడుగుతాడు. అనసూయ తెలీదు అంటుంది. ఏదో నిజం దాస్తున్నారు ఏం జరిగింది అని అడుగుతాడు. జ్యోత్స్న కోసం దీప చెప్పినవన్నీ నిజాలేరా గౌతమ్‌ని జ్యోత్స్ననే కాపాడిందని కాంచన చెప్తుంది. కాంచన నిజం మొత్తం కార్తీక్‌కి చెప్తుంది. కార్తీక్ షాక్ అయిపోతాడు. మీరే దీపని బలి పశువు చేస్తున్నారు అని తిడతాడు. నీ మేనకోడలి చంప పగలగొట్టాలని అంటాడు. అందరూ నోటికొచ్చినట్లు వాగారు కదా వాళ్లకి చెప్పాలి కదా అంటాడు. తనకు నిజం చెప్పలేదని అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















