అన్వేషించండి

Karthika Deepam 2 Serial: ఐపీఎల్ టైమ్‌లో అలాంటి మెసేజ్‌లు - అలా ప్రవర్తిస్తే కొడతానంటూ వంటలక్క వార్నింగ్

Premi Vishwanath: ‘కార్తీక దీపం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్రేమి విశ్వనాధ్. ఒక ఇంటర్వ్యూలో సీరియల్ గురించి, అందులోని తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Premi Vishwanath Karthika Deepam 2: ‘కార్తీక దీపం’లో దీపగా, వంటలక్కగా ఎన్నో ఏళ్లు బుల్లితెర ప్రేక్షకులను అలరించారు ప్రేమి విశ్వనాథ్. ముందుగా తన మాతృభాష మలయాళంలో ‘కరుత ముతు’ అనే సీరియల్‌తో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రేమి.. అదే సీరియల్‌ను తెలుగులో ‘కార్తీక దీపం’గా రీమేక్ చేయడంతో తెలుగు బుల్లితెరపైకి అడుగుపెట్టారు. ఇక ఈ సీరియల్ ముగిసిపోవడంతో చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అందుకే వారికోసమే ‘కార్తీక దీపం’ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రేమి విశ్వనాథ్ ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రొఫెషనల్ లైఫ్‌తో పర్సనల్ లైఫ్ గురించి ఆమె మాట్లాడారు.

గ్లిసరిన్ ఉపయోగించలేదు..

‘కార్తీక దీపం’ వల్ల తను అందుకున్న బెస్ట్ ప్రశంస ఏంటనే ప్రశ్నకు ప్రేమి స్పందిస్తూ.. ఆ పాత్రకు తన ఫేస్ సెట్ అయ్యిందని చాలామంది చెప్పారని అన్నారు ప్రేమి విశ్వనాథ్. అంతే కాకుండా ఇన్నేళ్లుగా ఇన్ని ఎపిసోడ్స్‌లో తాను ఒక్కసారి కూడా గ్లిసరిన్ ఉపయోగించలేదని చెప్పి షాకిచ్చారు. ఆ క్యారెక్టర్‌లో తను అంత లీనమయిపోయాను కాబట్టే అలా కన్నీళ్లు వచ్చేస్తున్నాయని అన్నారు. నిజ జీవితంలో మాత్రం తను చాలా పవర్‌ఫుల్ ఉమెన్ అని, ఏం జరిగినా చూసుకుంటామనే మనస్థత్వం తనది అని చెప్పుకొచ్చారు. రోడ్‌లో, షాపింగ్ మాల్‌లో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇప్పటికీ కొడతానని తెలిపారు. తెలియకుండా టచ్ చేశానని అంటారు కానీ వారంతా కావాలనే చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గెలిచి చూపించాలి..

‘కార్తీక దీపం’కు దక్కిన పాపులారిటీపై ప్రేమి విశ్వనాథ్ స్పందించారు. ఐపీఎల్ సీజన్స్‌లో సీరియల్ టైమింగ్‌ను మార్చమని చాలామంది రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్‌లు పెట్టేవారని చెప్తూ నవ్వుకున్నారు. అయితే సీరియల్‌లో తన పాత్రలాగానే నిజ జీవితంలో కష్టాలు పడే ఎంతోమంది ఆడవారికి తనదైన శైలిలో సలహా ఇచ్చారు. ‘‘ప్రతీ ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎప్పుడూ సంతోషం మాత్రమే ఉండదు. ఎవరికైనా కష్టాలు వస్తాయి. వాటన్నింటి నుండి బయటపడడమే పాఠంలాంటిది. ప్రతీ స్టేజ్ ఒక పాఠమే. నేర్చుకుంటూ వెళ్లిపోవడమే. గెలిచి చూపించాలి’’ అంటూ దీపలాంటి కష్టాలు ఎదుర్కుంటున్న మహిళలకు ధైర్యం చెప్పారు ప్రేమి విశ్వనాథ్.

అత్త లేదు..

సీరియల్ నటిగానే ఆన్ స్క్రీన్ పాత్ర వరకు మాత్రమే ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రేక్షకులకు తెలుసు. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియదు. తను సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కూడా కాదు. ఇక మొదటిసారి ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి, వైవాహిక జీవితం గురించి మాట్లాడారు ప్రేమి విశ్వనాథ్. తనకు అత్త లేదని, మరణించిందని బయటపెట్టారు. అత్త లేదు కాబట్టే పోటీ ఎలా ఉంటుందో, ప్రేమ ఎలా ఉంటుందో తెలియదని అన్నారు. కానీ తనను చాలా మిస్ అవుతున్నానని వాపోయారు. ఇక చాలా నెలల తర్వాత ‘కార్తీక దీపం’ సీక్వెల్‌తో వంటక్కగా ప్రేమి విశ్వనాథ్‌ను చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: టీవీల్లో సందడి చేయనున్న 'గుంటూరు కారం' - ఆ స్పెషల్ డేకి టెలికాస్ట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget