అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 6th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ గదిలో విహారి.. అదే టైంలో ఎంట్రీ ఇచ్చిన యమున.. కొడుకుని చూస్తుందా!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారిని చంపడానికి అంబిక సుభాష్‌తో కలిసి కారు బ్రేకులు తీయించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారిని ఇంటికి తీసుకొచ్చి చారుకేశవ బాగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. నీరు తీసుకురండి అది తెండి ఇది తీసుకురండి అని అందరికీ చెప్పి హడావుడి చేస్తాడు. అల్లుడికి సైట్‌లో యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. అందరూ కంగారు పడతారు. ఏం కాలేదు అని విహారి చెప్తాడు. దానికి చారుకేశవ అది చిన్న యాక్సిడెంట్ కాదని ప్రాణం పోయేదని చారుకేశవ అంటాడు. నేనే అల్లుడి అని పిలిచి కాపాడానని అంటాడు. 

విహారి: నువ్వు లక్ష్మీని ఫైల్ ఇవ్వడానికి పంపించావు తనే నా ప్రాణాలు కాపాడింది.
యమున: లక్ష్మీ నీ ప్రాణం కాపాడిందా.
విహారి: అవును అమ్మ లక్ష్మీ సమయానికి రాకపోయి ఉంటే ఈ సమయానికి మామయ్య చెప్పినట్లు పరిస్థితి తారుమారు అయ్యుండేది.
వసుధ: మరి మేరేంటి అండి మీరు లేకపోతే విహారికి ఇబ్బంది అయ్యుండేది అన్నట్లు చెప్తున్నారు. 
చారుకేశవ: వసుధ నేను గట్టిగా అల్లుడు అని అరిచాను కాబట్టి లక్ష్మీ కాపాడింది. 
యమున: లక్ష్మీ చాలా థ్యాంక్స్ అమ్మా. విహారి ప్రాణం కాపాడినందుకు మళ్లీ నా కొడుకుని నేను ఇలా చూసినందుకు ఇళ్లంతా కన్నీరు మున్నీరు అయి ఏడ్చే పరిస్థితి రాకుండా ఆపినందుకు.
లక్ష్మీ: దీనికే థ్యాంక్స్ ఎందుకమ్మా.
యమున: నన్ను కాపాడావ్ మామయ్యకి పునర్జమ్మ ఇచ్చావ్. ఇప్పుడు విహారిని కాపాడావు. నీకు చాలా రుణపడిపోయాం లక్ష్మీ.
చారుకేశవ: నాకు రావాల్సిన క్రెడిట్ అంతా అది కొట్టేసింది. ఈ లక్ష్మీని ఎంత త్వరగా ఇంటి నుంచి పంపేయాలి అని నేను చూస్తుంటే ఆ లక్ష్మీ మాత్రం అందరి దగ్గర మార్కులు కొట్టేసింది.

లక్ష్మీ తల్లిదండ్రులు ఇచ్చిన తినుబండారాల బ్యాగ్ తీసుకొని విహారి లక్ష్మీ గదికి వస్తాడు. తలుపు వేస్తాడు. ఇక్కడ మిమల్ని ఎవరైనా చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయి వెళ్లిపోండి అని లక్ష్మీ చెప్తుంది. అవన్నీ నేను చూసుకుంటా నువ్వు సైలెంట్‌గా ఉండు అని విహారి చెప్తాడు. ఇక కనకం కోసం తన తండ్రి ఇచ్చిన అమ్మవారి విగ్రహం లక్ష్మీకి చూపిస్తాడు. అది చూసి లక్ష్మీ తీసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. 

విహారి: మీ నాన్న గారు నీ కోసం పంపించారు. అమెరికాలో ఉన్న నా కూతురికి ఈ విగ్రహం ఇష్టమని ఇది చూస్తే సంతోషపడుతుందని ఇచ్చారు.
లక్ష్మీ: నాకు ఏది ఇష్టమో ఏం ఇస్తే సంతోషపడతానో మా అమ్మానాన్నలకు బాగా తెలుసు. ఈ విగ్రహం నాకు చాలా ఇష్టం. ఇది నాతో ఉంటే నేను అమ్మవారే నాతో ఉన్నట్లు అనుకుంటారు అందుకే ఇది పంపారు అనుకుంటా.
విహారి: మీ నాన్న లాంటి గొప్ప తండ్రి నేను చూడలేదు కనక మహాలక్ష్మీ. నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. నీకోసం ప్రాణాలు అయినా ఇస్తారు.
లక్ష్మీ: ఇంతలా ప్రేమిస్తున్న మా నాన్నని నేను మోసం చేస్తున్నాను. అమెరికాలోనే ఉన్నాననే భ్రమ కలిగిస్తున్నాను. నేను నా భర్తతో సంతోషంగా ఉన్నానే భ్రమ  అనుక్షణం కలిగిస్తున్నాను.
విహారి: ఆ విషయానికి వస్తే నేను నీ తల్లిదండ్రులకు మోసం చేస్తున్నాను. మీ నాన్న ఫోన్ చేసిన ప్రతీ సారి నేను నీతో సంతోషంగా ఉన్నానని చెప్తున్నా ఈ అమ్మవారే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి.

ఇక కనకం గదిలోకి యమున వస్తుంది. దాంతో విహారి దాక్కుంటాడు. స్వామీజీ దగ్గరకు వెళ్లాలి నువ్వు రావాలి నాతో పాటు అని అడుగుతుంది. విహారి ప్రవర్తనలో మార్పు వస్తుందని నిశ్చితార్థం రోజు వింతగా ప్రవర్తించాడని తాగాడని చెప్పి ఏడుస్తుంది. అదంతా విహారి విని ఎమోషనల్ అవుతాడు. ఇక లక్ష్మీ వస్తానని యమునతో చెప్తుంది. ఇక యమున వెళ్లిపోయిన తర్వాత విహారిని వెళ్లిపోమని లక్ష్మీ చెప్తుంది. విహారి వెళ్లిపోతాడు. అంబిక, సుభాష్‌ కలుస్తారు. అంబిక అనే పవర్‌ని అందరి ముందు కించ పరచ బోతున్నాడని అందరూ తనకి ఇక విలువ ఇవ్వరని జాగ్రత్త పడాలని చెప్తుంది. రేపు విహారి మీటింగ్‌కి రాకుండా ఆపాలని అంటుంది. విహారి కారుకి బ్రేక్‌లు తీసేయ్‌మని సుభాష్‌కి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: విశాలే తనకు కాబోయే భర్త అని ఫిక్స్ అయిపోయిన త్రినేత్రి.. బ్రేక్‌ ఫెయిల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget