Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: అమ్మిరాజు లక్ష్మీ జీవితం నాశనం చేస్తాడా! విహారి ఎంట్రీతో ట్విస్ట్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode November 17th పండు అమ్మాయిలా పొలాల్లోకి రావడం అమ్మిరాజుకి విషయం తెలిసి లక్ష్మీని ఇబ్బంది పెట్టాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ, పండు, రుక్మిణిలు అమ్మిరాజు చెప్పిన అడ్రస్‌కి వెళ్తారు. పండు అమ్మిరాజుని ట్రాప్ చేయడానికి లేడీ గెటప్‌లో రెడీగా ఉంటాడు. అమ్మిరాజు అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు అని హ్యాపీగా వెళ్తుంటాడు. మరోవైపు విహారి కావేరి కోసం వెతుకుతూ ఉంటాడు.
అమ్మిరాజు రావడం చూసి లక్ష్మీ, రుక్మిణి దాక్కుంటారు. పండు ముఖం మూసుకొని నిల్చొని ఉంటాడు. అమ్మిరాజు చేతికి మల్లెపూలు చుట్టుకొని వస్తాడు. అమ్మిరాజుని చూసి పండు వస్తాడు నా అమ్మిరాజు ఈరోజు అని పాట పాడుతాడు. వచ్చేశాడునీ అమ్మిరాజు అని అమ్మిరాజు పాడుతాడు. నేను నీకు అంత నచ్చానా అని పండు అడిగితే పిచ్చి పిచ్చిగా నచ్చేశావ్ వసంత అని అమ్మిరాజు పండుని పట్టుకొని హగ్ చేసుకుంటాడు. పండు దూరంగా జరిగి ఒకసారి నీ కళ్లు మూసుకో అని చెప్తాడు.
అమ్మిరాజు కళ్లు మూసుకోగానే పండు లక్ష్మీ, రుక్మిణిలను రమ్మని సైగ చేస్తాడు. రుక్మిణి కర్ర పట్టుకొని వస్తుంది. పండు అమ్మిరాజు ముఖం మీద మత్తు ముందు పెట్టే టైంకి అమ్మిరాజు చూసేస్తాడు. అమ్మిరాజు పండుని నెట్టేస్తాడు. రుక్మిణి కొట్టాలి అని చూస్తే రుక్మిణిని రాయి మీదకు తోసేస్తాడు. తలకు గాయం అయి రుక్మిణి పడిపోతుంది. అమ్మిరాజు లక్ష్మీ దగ్గరకు వెళ్లి కుంటి లక్ష్మీ నా చెరలో చిక్కుకున్నావే.. నాకు దొరికిపోయావే.. అసలే చలి కాలం.. పైగా కలికాలం.. అని లక్ష్మీ మీదకు వెళ్తాడు. లక్ష్మీ అమ్మిరాజు చేయి పట్టుకొని అరుస్తుంటే ఇలాగే అరు నాకు చాలా ఇష్టం అని మీదకు వెళ్తాడు.
ఇంతలో విహారి వచ్చి ఒక్కటి అమ్మిరాజుని ఒక్కటి తంతాడు. అమ్మిరాజుని చితక్కొట్టి చెట్టుకు కట్టేస్తాడు. లక్ష్మీని కాస్త పక్కకి తీసుకెళ్లి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా.. నేను రావడం కొంచెం ఆలస్యం అయింటే నీ పరిస్థితి ఏంటి అని అంటాడు. ఏదైనా చేసేముందు ఆలోచించవా.. నాకు ఏమైనా అయింటే నా పరిస్థితి ఏంటి అది ఆలోచించవా అని కోప్పడతాడు. కావేరి కోసం రుక్మిణి గారు కంగారు పడుతుంటే వచ్చేశాం అని లక్ష్మీ అంటుంది.
రుక్మిణి పండుని పిలిచి విహారి లక్ష్మీని భార్య అంటున్నాడు లక్ష్మీ ఆయన భార్యా అని అడుగుతుంది. అవును అని పండు చెప్తాడు. మరి పద్మాక్షి కూతుర్ని అంటే ఆమెను కూడా పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడు భార్యగా ఒప్పుకున్నారని.. ఇక సహస్రమ్మని పెళ్లి చేసుకోవడానికి యమునమ్మ కారణం.. యమునమ్మని ఇంట్లో పని మనిషిని చూసినట్లు కూడా చూసేవాళ్లు అని మొత్తం చెప్తాడు. రుక్మిణి చాలా బాధ పడుతుంది. ఇక్కడికి రావడానికి ముందు హరికృష్ణ కుటుంబం నాశనం అవ్వాలి అనుకున్నా కానీ మీరంతా నా కోసం ప్రాణాలు తెగిస్తున్నారు ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి.. అని అంటుంది.
అంబిక, వీర్రాజు దగ్గరకు వెళ్తుంది. చూపు లేని ఆ లక్ష్మీ తన రౌడీలను కొట్టిందని అంటుంది. ఇక అమ్మిరాజు గురించి అడిగితే ఇక్కడే ఉండాలి అని పానకాలు కాల్ చేస్తాడు. విహారి కాల్ లిఫ్ట్ చేసి బాబాయ్ నన్ను గుర్తు పట్టలేదా.. కాబోయే పెళ్లి కొడుకు నా దగ్గర ఉన్నాడు. నాకు కావాల్సిన వాళ్లు నీ దగ్గర ఉన్నారు నువ్వు తనని వదిలేస్తే నేను నీ కొడుకుని వదిలేస్తా.. నువ్వు కావేరిని వదిలేస్తే.. నేను నా తమ్ముడిని వదిలేస్తా లేదంటే నా తమ్ముడిని పూజకి పనికి పువ్వుని చేస్తా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















