Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 12th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారిని రక్షించుకోవడానికి భార్యగా వ్రతం ప్రారంభించిన లక్ష్మీ.. విహారి కండీషన్ సీరియస్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారిని ప్రాణాలతో దక్కించుకోవడానికి లక్ష్మీ స్వామీజీ చెప్పిన కుంకుమార్చన వ్రతం ప్రారంభించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారికి యాక్సిడెంట్ అవ్వడంతో కనకం భయంతో స్వామీజీ దగ్గరకు వెళ్లడానికి బయల్దేరుతుంది. కనక మహాలక్ష్మీ చేతిలో డబ్బులు లేకపోవడంతో పండు లక్ష్మీకి డబ్బులు ఇస్తాడు. ఇక భక్తవత్సలానికి నర్స్ బీపీ చెక్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. కొడుకుని పోగొట్టుకొని పుట్టెడు దుంఖంలో ఉన్నానని ఇప్పుడు విహారికి ఏమైనా అయితే తట్టుకోలేనని భక్తవత్సలం ఏడుస్తాడు. విహారికి ఏం కాదు అని యమున ధైర్యం చెప్తుంది. లక్ష్మీ స్వామీజీ దగ్గరకు వెళ్తుంది.
స్వామీజీ: నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసమ్మా.
లక్ష్మీ: ఆయన పరిస్థితి ఏం బాలేదు స్వామీజీ.
స్వామీజీ: ప్రమాదానికి గురయ్యాడు ఇప్పుడు ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నాడు అంతే కదా.
లక్ష్మీ: అవును స్వామీజీ చలనం లేకుండా పడున్నారు ఆయన మామూలుగా మారడానికి మార్గం చెప్పండి.
స్వామీజీ: మార్గం ఎప్పుడో చెప్పాను కానీ నువ్వు భార్యగా ఆ పని చేయడానికి వెనకడుగు వేశావు. నీకు విహారికి పడిన బంధం అమ్మవారు వేసిన బంధం దాన్ని గౌరవించి నీ భర్తని కాపాడుకోవడం నీ ధర్మం. నేను ఇది వరకే చెప్పినట్లు నియమ నిష్టలతో కుంకుమార్చనలో పూజ చేసి నీ భర్త భోజనం చేసిన ప్లేట్‌లో నువ్వు తిని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే తను ఈ గండం నుంచి గట్టెక్కుతాడు.
లక్ష్మీ: మీకు పరిస్థితులు అన్నీ తెలుసు అయినా ఇవన్నీ నాకు చేయడం సాధ్యం అవుతుందా.
స్వామీజీ: మిమల్ని కలిపిన అమ్మవారే వ్రతం చేయడానికి మార్గం చూపిస్తుంది. నువ్వు సంకల్పించుకొని మొదలు పెట్టు అమ్మవారే పూర్తి చేస్తుంది.
లక్ష్మీ పసుపు నీటితో స్నానం చేసి అమ్మవారి సాక్షిగా విహారి కోసం దీక్ష ప్రారంభిస్తుంది. అమ్మవారికి కుంకుమార్చన చేస్తుంది. ఇక స్వామీజీ లక్ష్మీ కుంకుమ ఇచ్చి నీ భర్తకి బొట్టు పెట్టు అని చెప్పి తీర్థం ఇచ్చి తాగించమని చెప్తారు. లక్ష్మీ వాటిని తీసుకొని హాస్పిటల్‌కి బయల్దేరుతుంది. విహారి ఆపరేషన్ సక్సెస్ అయిందని వసుధ యమునకు ధైర్యం చెప్తుంది. ఇక యమున కుంకుమార్చన వ్రతం గురించి చెప్తుంది. ఆ పూజ చేయాలి అంటే ఇద్దరికీ వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని అంటుంది. దానికి పద్మాక్షి ఫైర్ అయిపోతుంది. మా వల్లే పొరపాట్లు జరుగుతున్నాయని మా వల్లే పెళ్లి ఆగిపోతుందని అంటున్నావా అని అరుస్తుంది. యమున వదిన అలా అనలేదు అని వసుధ అంటుంది. అంబిక కూడా యమున అలా అంటున్నానా చాలా అర్థం ఉండేలా మాట్లాడుతుందని అంటుంది. నేను అలా అనలేదు అని యమున అంటుంది. గొడవలు వద్దని చారుకేశవ అంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి విహారి ఇంకా లేవడం లేదని అబ్జర్వేషన్‌లో ఉంచామని చెప్తారు. అంబిక సుభాష్‌కి కాల్ చేసి మన ప్లాన్ సక్సెస్ అయినట్లుందని అంటుంది. ఇంతలో లక్ష్మీ వస్తుంది. అంబికని చూసి భయపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.