Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 31st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: తనతో ఒక రాత్రి గడపమని లక్ష్మీని బెదిరించిన చారుకేశవ.. విహారి కంపెనీలకు ఎండీగా లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode చారుకేశవ లక్ష్మీతో తప్పుగా మాట్లాడటం వసుధ ఎంట్రీ ఇచ్చి లక్ష్మీ విహారి భార్య అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర లక్ష్మీ తండ్రి ఆదికేశవ్‌కి చేనేత వస్త్రాల కోసం కాల్ చేస్తుంది. తన డౌట్స్ అడుగుతుంది. ఆదికేశవ్ అర్థం కావడం లేదు అనగానే వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటారు. అక్కడే విహారి కింద పడుకొని ఉంటాడు. సహస్ర తన డిజైన్స్ చూపించే టైకి విహరి అటు వైపు తిరిగి పడుకోవడంతో విహారిని ఆదికేశవ్ చూడదు. ఇక ఆదికేశవ్ ఇంట్లో ఉన్న లక్ష్మీ, విహారి ఫొటోలను కూడా సహస్ర గమనించదు. ఆదికేశవ్‌కి సహస్ర థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత కలుద్దామని అనుకుంటారు. అర్థరాత్రి ఫోన్ చేసినందుకు సారీ అని సహస్ర అంటే నువ్వు నా కూతురి లాంటి దానివి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని ఆదికేశవ్ అంటారు.
మరోవైపు లక్ష్మీ వర్క్ చేసుకుంటుంటే చారుకేశవ ఆ గదిలోకి వెళ్లి లక్ష్మీని ఎలా అయినా వదలకూడదు అనుకుంటాడు. లక్ష్మీ అతన్ని చూసి షాక్ అయిపోతుంది. మీరేంటి ఈ టైంలో ఇక్కడ ఏం కావాలి అని అడుగుతుంది. దానికి చారుకేశవ డోర్ వేసి నువ్వే కావాలి అంటాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది.
చారుకేశవ్: నీ మొగుడు ఎక్కడో ఉన్నాడు నువ్వు పెద్ద నిప్పు అనుకున్నా కానీ ఈరోజే తెలిసింది నువ్వు నిప్పు కాదు పెద్ద తుప్పు అని.
లక్ష్మీ: ఏం మాట్లాడుతున్నారు.
చారుకేశవ: అర్థం కాలేదా. నీకు ఓ సాక్ష్యం చూపించి మరీ మాట్లాడుతా అని విహారి లక్ష్మీ కాళ్లు పట్టుకున్న ఫొటో చూపిస్తాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. ఒక పెళ్లి అయిన అమ్మాయి, అబ్బాయి ఇలా ఇంత క్లోజ్‌గా ఉండటాన్ని ఏం అంటారు.
లక్ష్మీ: దయచేసి అలా మాట్లాడొద్దు.
చారుకేశవ: ఏ.. అందరి కళ్లు కప్పి నువ్వు విహారితో ఆటలు, సరసాలు ఆడేటప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు. ఇప్పుడు సరాసరి పద్మాక్షి వదిన దగ్గరకు వెళ్లి నువ్వు, విహారి బాత్‌రూంలో సరసాలు.. ఈ రోజు జరిగింది అన్నీ చెప్తా. సహస్రకు కూడా తన భర్తతో నువ్వు ఆడిన అక్రమ సంబంధం కోసం చెప్తా.
లక్ష్మీ: చెప్పొద్దు అండీ ప్లీజ్.
చారుకేశవ: చెప్పొద్దా అయితే ఒక పని చేయ్ విహారితో చాటు మాటుగా సాగిస్తున్న వ్యవహారాలు అన్నీ నాతో కూడా ఈ రోజు షేర్ చేసుకో.
లక్ష్మీ: చీ అలా ఎలా మాట్లాతున్నారు.
చారుకేశవ్: నేను ఎవరికీ చెప్పకు నేను చెప్పను.
లక్ష్మీ: దయచేసి అలా అనొద్దు.
చారుకేశవ: నువ్వు విహారితో చాటు మాటుగా గడిపినప్పుడు లేనిది ఇప్పుడు నాతో అంటే పతివ్రతలా మాట్లాడుతున్నావ్. నీకు గంట టైం ఇస్తున్నా గెస్ట్‌హౌస్‌కి రా లేదంటే అందరికీ చెప్పేస్తా. అప్పుడు నిన్ను కుక్కని కొట్టినట్లు కొడతారు. మా సహస్ర అయితే నిన్ను చంపేస్తుంది.
లక్ష్మీ చాలా ఏడుస్తుంది. ఆదికేశవ్ గంట తర్వాత గెస్ట్ హౌస్‌కి వెళ్తే అక్కడ చారుకేశవ భార్య వసుధ ఉంటుంది. లక్ష్మీ అనుకొని చారుకేశవ మాట్లాడుతాడు. భార్యని చూసి షాక్ అయిపోతాడు. లక్ష్మీ కూడా అక్కడే ఉంటుంది. వసుధ భర్తని లాగిపెట్టి కొడుతుంది. మనిషివా పశువువా కొంచెం కూడా బుద్ధి ఉందా ఆడపిల్లతో అలా ఎలా ప్రవర్తించావ్ అని తిడుతుంది. అసలు తను ఎవరో తెలుసా అని అడుగుతుంది. లక్ష్మీ వద్దని అన్నా ఇలాంటి నీచుడుకి నీ గురించి తెలియాలి. వీడు ఎవరికీ చెప్పలేడులే చెప్తే నా తాళి తెంపేస్తా అంటుంది. యమున వదిన కోసం అవమానాలు పడుతున్న దేవతరా లక్ష్మీ అని అంటుంది. పద్మాక్షి అక్కకి విహారి ఇచ్చి మాట కోసం తన సౌభాగ్యం ఇచ్చేసిన స్వార్థం లేని మనిషిరా లక్ష్మీ. నువ్వు తనకి ఎవరూ మొగుడు లేడు అని నీ పక్కకి రమ్మన్నావ్ అసలు తన మొగుడు ఎవరో తెలుసా నా మేనల్లుడు విహారి అని చెప్తుంది.
చారుకేశవ షాక్ అయిపోతాడు. ఇప్పుడు తన మీద చేయి వేయ్‌రా విహారికి విషయం చెప్తా అప్పుడు విహారి నీ సంగతి చెప్తాడు అని వసుధ అనగానే చారుకేశవ భార్య, లక్ష్మీ కాళ్ల మీద పడతాడు. మీరు అంటే ఆమెకు ప్రాణం కానీ ఆమెను మీరు ఏనాడైనా ప్రేమగా చూసుకున్నారా.. ఊరిలో అందరూ గొడ్రాలు అని ఎన్ని మాటలు అన్నా తను బాధ పడలేదు కానీ ఈరోజు మీ ప్రవర్తన వల్ల ఎంత బాధ పడుతున్నారో చూడండి. మీకోసం బతికే వాళ్లని మీరు నిర్లక్ష్యం చేయడం చాలా తప్పు అండీ అంటుంది లక్ష్మీ. దాంతో చారుకేశవ వసుధ కాళ్ల మీద పడి సారీ చెప్తాడు. నా తప్పుల వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. ఈ ఒక్క సారి నాకు ఛాన్స్ ఇవ్వు అని బతిమాలుతాడు. లక్ష్మీ కూడా క్షమించమని అంటుంది. క్షమించరాని తప్పు చేసినందుకు ఎలా క్షమిస్తాను అంటుంది. నువ్వు మారే వరకు నేను వెయిట్ చేస్తా మనకు ఎవరైనా పిల్లలు లేరు అంటే లక్ష్మీ మన కూతురు అని చెప్పు అని చారుకేశవ ఏడుస్తూ వెళ్లిపోతాడు. లక్ష్మీ, వసుధ హగ్ చేసుకొని ఏడుస్తారు.
ఉదయం ఆఫీస్‌కి లక్ష్మీ రాగానే విహరితో పాటు స్టాఫ్ అందరూ లక్ష్మీకి కంగ్రాట్స్ చెప్తారు. వీ క్రాఫ్ట్‌స్‌తో పాటు విహారి అన్నీ కంపెనీలకు లక్ష్మీనే ఎండీ అని విహారి చెప్తాడు. లక్ష్మీ ఎండీ స్థానంలో కూర్చొంటుంది. అంబిక మనసులో ఇది దీని ఎక్ట్రాలు అనుకుంటుంది. లక్ష్మీ కంపెనీ నాశనం కోరే వారిని ఈ రోజే ఏరి పారేస్తా అని అంటుంది. ఆ లిస్ట్ విహారికి చూపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీ బతకడానికి కారణమైన రుక్మిణిని రూపలా చూసుకుంటున్న సూర్యప్రతాప్..!





















