Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 19th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సహస్ర, విహారిలకు ఫస్ట్‌నైట్.. లక్ష్మీ హర్ట్ అవడానికి కారణం అదేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి తన తండ్రి హత్య కేసు గురించి తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరడం అంబిక వెనకాలే వెళ్లాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం తన గురించి కాకుండా సహస్ర గురించి ఆలోచించమని చెప్తుంది. విహారి ఆలోచిస్తూ గదిలోకి వెళ్తాడు. సహస్రని చూసిన విహారి చాప దిండు పట్టుకొని కింద పడుకుంటాడు. సహస్ర చూసి నీ మనసులో ఆ లక్ష్మీ ఉందని నాకు తెలుసు దాన్ని నీ మనసులోనే సమాధి చేస్తానని అనుకుంటుంది. గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది.
ఉదయం లక్ష్మీ టీ చేస్తుంటే పద్మాక్షి వచ్చి సహస్ర, విహారిలకు కాఫీ ఇవ్వమని చెప్తుంది. లక్ష్మీ తీసుకొని బయల్దేరుతుంది. లక్ష్మీ డోర్ కొట్టడంతో సహస్ర డోర్ తీస్తుంది. లక్ష్మీని ఏడిపించాలి అని అనుకొని నుదిట కుంకుమ చెరిపేసి జుట్టు చెదిరి బయటకు వస్తుంది. డోర్ తీయగానే కొత్తగా పెళ్లి అయిన వాళ్లని పొద్దున్నే లేపకూడదు అని తెలీదా అని తిట్టి కాఫీ తీసుకొని వెళ్లిపోతుంది. లక్ష్మీ వెళ్లిపోతుంది. సహస్ర బావ పక్కనే పడుకొని ఉంటుంది. సహస్రని చూసిన విహారి ఏంటి అలా చూస్తున్నావ్ అంటే చూడకూడదా అంటే మనకి పెళ్లి అయింది బావ అలా చూడటం కూడా తప్పా ఏంటి అని కాఫీ ఇస్తుంది. ఇద్దరూ కాఫీ తాగుతారు.
సహస్ర మనసులో నీ దగ్గరకు రావడం కూడా ఇష్టం లేదా నీ మనసులో ఉన్న ఆ లక్ష్మీని ఎలా దూరం చేస్తానో చూడు అనుకుంటుంది. అంబిక పేపర్‌లో విహారి, లక్ష్మీల ఫొటో చూసి ఎలా అయినా నా సామ్రాజ్యం నేనే దక్కించుకోవాలని అంటుంది. అందరూ టిఫెన్ చేస్తుంటారు. పండు వచ్చి విహారిబాబు, లక్ష్మీల గురించి పే పపర్‌లో వచ్చిందని చెప్తాడు. వీ క్రాఫ్ట్ గురించి వచ్చిందని అంటుంది. ప్రభుత్వం దాని కోసం 10 ఎకరాలు వస్తాయని చెప్తుంది. ఇదంతా లక్ష్మీ క్రెడిట్ అని విహారి అంటాడు. పని మనిషికి అంత క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని నా కూతురు ఈ ఇంటి కోడలు అయినందుకే నీ అదృష్టం మారిపోయిందని పద్మాక్షి అంటుంది.
అంబిక సహస్ర దగ్గరకు వెళ్లి నీ బావ ఆ లక్ష్మీని ఎలా పొగుడుతున్నాడో చూడు. నువ్వు దాన్ని ఇలాగే వదిలేస్తే అది నీ కాపురంలో చిచ్చు పెడుతుంది అని అంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు అని సహస్ర అనుకుంటుంది. విహారి తండ్రి ఫొటో చూసి ఇద్దరు భార్యల్లో ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావడం లేదని ఈ చిక్కు ముడి విప్పు నాన్నఅని తండ్రిని కోరుకుంటాడు. పద్మాక్షి పేపర్‌లో విహారి, లక్ష్మీల పొటో చూసి రగిలిపోతుంది. పద్మాక్షి సహస్రతో ఈ న్యూస్ చూస్తుంటే అది ఉండాల్సిన చోటులో ఉంది. అది సీఈవో స్థానం వరకు ఉంటే నువ్వు ఇంట్లో ఉండిపోతున్నావ్. ఎంతో చదువుకున్న నువ్వు ఇలా ఉండిపోకూడదు ఇంట్లో ఆఫీస్‌లో నువ్వే ఉండాలని అంటుంది. సహస్ర సరే అంటుంది.
పద్మాక్షి సహస్రతో ఈ రోజు మీ ఫస్ట్ నైట్ కదా అక్కడ జాగ్రత్తగా మ్యానేజ్ చేసి గిఫ్ట్ కింది ఆ ప్రాజెక్ట్ అడుగు అని చెప్తుంది. మరోవైపు అంబిక విహారి ఫోన్‌కి ఇన్విస్టిగేషన్ చేస్తానన్న రిటైర్డ్ ఆఫీసర్ కాల్ చేయడం చూస్తుంది. విహారికి ఫోన్ ఇచ్చి చాటుగా వింటుంది. విహారి తండ్రి మర్డర్ కేసు రెండో సారి నమోదు చేశారని పటాన్చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని చెప్తాడు. విహారి ఇంట్లో అందరికి చెప్పి బయటకు వెళ్తానని అంటాడు. దానికి ఇంట్లో వాళ్లు అర్జెంట్ అయితే వెళ్లు ఈ రోజు ముహూర్తం బాగుంది అంట నీకు సహస్రకు కార్యం ముహూర్తం పెట్టారని అంటారు. లక్ష్మీ ఆ మాట విని వెళ్లిపోతుంది. సహస్ర బావ దగ్గరకు వెళ్లి త్వరగా వచ్చేయ్ బావ అంటుంది. లక్ష్మీ మనసులో విహారి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ మెడలో వారసత్వ నగ.. ముడిపడిన లక్ష్మీ, సహస్రల తాళి!





















