Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 5th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: మదన్, లక్ష్మీల పెళ్లికి ముహూర్తాలు.. లక్ష్మీని విహారి ఒప్పిస్తాడా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీని మదన్‌తో పెళ్లికి విహారి ఒప్పించడానికి ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ బ్యాగ్ తీసుకొచ్చి సహస్ర చూడమని అంటుంది. అందరి ఎదురుగా లక్ష్మీ బ్యాగ్ ఓపెన్ చేసే సరికి అందులో విహారి ఫొటోలు ఉంటాయి. లక్ష్మీతో పాటు అందరూ షాక్ అయిపోతారు. పద్మాక్షి కోపంతో లక్ష్మీకి కొడుతుంది. లక్ష్మీ వెళ్లి స్టవ్ మీద పడటంతో వేడి నీరు మీద పడతాయి.
పద్మాక్షి: అయిపోయిందా నీ డ్రామా.
వసుధ: అంతలా కాలిపోతే అలా అంటావేంటి అక్క.
పద్మాక్షి: నీకు తెలీదు దీని డ్రామాలు.
అంబిక: సహస్ర నీ అనుమానం నిజమేనేమో.. విహారి తను ఇష్టపడుతుందేమో. అందుకే ఆ ఫొటోలు విహారి గుర్తుగా దాచుకుందేమో.
విహారి: అత్తయ్యా..
పద్మాక్షి: తన బ్యాగ్‌లో ఫొటోలు ఉన్నాయి అంటే మనసులో కూడా విహారి ఉన్నాడు అందుకే మదన్ ప్రపోజ్ చేయగానే ఏడ్చింది.
లక్ష్మీ: అమ్మా నాకు ఏం తెలీదమ్మా ఆ ఫొటోలు నేను ఇప్పుడే చూస్తున్నా.
యమున: అవి మన ఆల్బమ్‌లో ఫొటోలు అవి తన దగ్గరకు ఎలా వస్తాయి.
పద్మాక్షి: ఆ విషయం నీలాగే డ్రామాలు ఆడుతుంది కదా దాన్ని అడుగు.
విహారి: అత్తయ్య పొరపాటున తన బ్యాగ్‌లో ఎవరో పెట్టుంటారు కదా. సహస్ర ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్. అమ్మ తనని లోపలికి తీసుకెళ్లు.
అంబిక: మనసులో బతికిపోయావే నువ్వు నా జోలికి వస్తే ఇంకా ఇంకా ఏడిపిస్తా.
మదన్: త్వరగా లక్ష్మీని పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళ్లిపోవాలి.
లక్ష్మీ ఆఫీస్‌కి రెడీ అయి అంబికకు ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుంటుంది. ఆఫీస్‌కి వెళ్తుంటే సహస్ర లక్ష్మీ గదిలోకి వస్తుంది. లక్ష్మీని ఆపుతుంది. నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు ఇంట్లోనే ఉండు అని అంటుంది. అర్జెంట్ పని ఉందని లక్ష్మీ అంటుంది. ఈ ఒక్క రోజు వెళ్తాను అని కనీసం ఒక్క గంట అయినా వెళ్తాను అని లక్ష్మీ అంటే వద్దని మదన్‌కి నీకు పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులు వస్తారని నా కళ్లు కప్పి ఎక్కడికీ వెళ్లొద్దని అంటుంది. లక్ష్మీ కన్నీరు పెట్టుకుంటే నీకు బావ అంటే ఇష్టం కదా అందుకే ఈ కన్నీళ్లు అని అంటుంది. లక్ష్మీ ఏడుస్తూ ఉండిపోతుంది.
యమున పంతులు వస్తారు అనడంతో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తాంబూలం ఇచ్చిపుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. విహారి, మదన్ కిందకి వస్తారు. మదన్‌కి అప్పుడే పెళ్లి కల వచ్చేసిందని సహస్ర ఆట పట్టిస్తుంది. లక్ష్మీని తీసుకురమ్మని పంతులు చెప్పడంతో వసుధ వెళ్తుంది. లక్ష్మీ రెడీ అవ్వకుండా ఏడుస్తుంటుంది. నువ్వు విహారి మీద ప్రేమని చెప్పలేవు వాడు నీ ప్రేమని గుర్తించలేడు. మీ కథకి విలన్స్ మీరే అని మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నారని అంటుంది. నీ భర్త నీ కళ్లు ముందే పెళ్లి పీటలు ఎక్కితే భరించావు ఇప్పుడు నీ వంతు అని అంటుంది. ఇక పద్మాక్షి పిలవడంతో వసుధ లక్ష్మీని తీసుకొని వెళ్తుంది. లక్ష్మీని చూసి ఎందుకు రెడీ అవ్వలేదని అందరూ అడుగుతారు.
లక్ష్మీ చీర మార్చుకోలేదని యుమన అడిగి తీసుకెళ్తుంది. లక్ష్మీ యమునతో నేను ఈ పెళ్లి చేసుకోలేనని అంటుంది. నాకు పెళ్లి అయింది భర్త ఉన్నాడు అంటే అలాంటి వాడి కోసం ఆలోచించొద్దని యమున అంటుంది. నా మాట అంటే గౌరవం ఉంటే ఈ చీర కట్టుకొని మదన్‌తో పెళ్లికి రెడీ అవు అంటుంది. లక్ష్మీ మాత్రం మీరు అంటే గౌరవమే కానీ పెళ్లి చేసుకోను అంటుంది. పంతులు తొందర పెట్టడంతో విహారి వెళ్లి తీసుకొస్తా అంటాడు. యమునని పంపి తాను లక్ష్మీని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















