Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 12th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విషం తాగి పెళ్లి పీటలెక్కిన లక్ష్మీ.. విహారిని హెచ్చిరించిన స్వామీజీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode మదన్‌తో పెళ్లి ఇష్టం లేని లక్ష్మీ విషం తాగేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఏడుస్తుంది. అంబిక సహస్రతో లక్ష్మీని మండపం దగ్గరకు తీసుకెళ్లారా.. ఆ లక్ష్మీని చూస్తుంటే ఎందుకో అనుమానంగా ఉందని చెప్తుంది. లక్ష్మీని తక్కువ అంచనా వేయొద్దని ముందే జాగ్రత్త పడదామని అంటుంది. ఇక ముందు జాగ్రత్తగా ఓ ఐడియా సహస్రకి చెప్తుంది. సహస్ర అంతా తాను చూసుకుంటా అంటుంది.
మదన్‌కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడానికి ఎవరు వస్తున్నారు అంటే యమున వసుధ, చారుకేశవని తీసుకురమ్మని అంటుంది. చారు కేశవ రెడీగా ఉంటాడు. అంబిక వసుధని తీసుకురావడానికి వెళ్తుంది. లక్ష్మీ విహారి మాటలు తలచుకొని బాధ పడుతుంది. స్వామీజీ అదే గుడికి వస్తారు. వసుధ ఓ చోట కూర్చొని బాధ పడుతుంటే అంబిక వచ్చి పిలుస్తుంది. మదన్‌కి కాళ్లు కడిగి నువ్వు బావ కన్యాదానం చేయాలని యమున వదిన పిలుస్తుందని చెప్తుంది. వసుధ షాక్ అయిపోతుంది. పెళ్లి అయిన పిల్లకి మరో వ్యక్తితో కన్యాదానం మేం చేయాలా అని అని అనుకుంటుంది. తాను చనిపోతే సమస్య పరిష్కారం అవుతుందని మదన్ బాబు వేరే వారిని పెళ్లి చేసుకుంటారని లక్ష్మీ అనుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకుంటుంది. తన తండ్రి తన చావుని చూసి తట్టుకునే శక్తి ప్రసాదించమని దేవుడిని కోరుకుంటుంది. ఇదే నా చివరి కోరిక అని విషం తాగేస్తుంది. విషం బాటిల్ అక్కడే పడేస్తుంది.
మరోవైపు సత్య లక్ష్మీ తల్లిదండ్రుల్ని తీసుకొని గుడికి వచ్చేస్తాడు. విహారికి కాల్ చేసి వచ్చేశామని చెప్తాడు. పక్కనున్న మరో గుడికి దగ్గరకు లక్ష్మీ తల్లిదండ్రుల్ని తీసుకురమ్మని తాను ఇప్పుడే వస్తాను అని అంటాడు. వసుధ, చారుకేశవలు మదన్ కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. మదన్ చాలా సంతోషపడతాడు. ఇక వసుధ, యమున లక్ష్మీని పెళ్లి తంతు దగ్గరకు తీసుకొస్తారు. విహారి కనకం తల్లిదండ్రుల్ని కలుస్తారు. బాగున్నారా బాబు బాగా చిక్కుకుపోయారు అని అంటారు. ఇక కనకం గురించి అడుగుతారు. విష ప్రభావం వల్ల మత్తుగా ఉన్న లక్ష్మీ మదన్ పక్కన కూర్చొంటుంది. కనకం గురించి ఆదికేశవ్ అడుగుతారు. దాంతో విహారి వాళ్లని తనతో పాటు పెళ్లి అవుతున్న చోటుకు తీసుకెళ్తుండగా స్వామీజీ ఎదురు పడటంతో వాళ్లని సత్యతో దర్శనానికి పంపుతాడు.
స్వామీజీ విహారితో వృథా ప్రయత్నం చేస్తున్నావ్.. మీ జీవితాలలో దైవాజ్ఞతో బంధం ముడిపడిపోయింది. ఆ బంధాన్ని ముళ్లోకాలు ఏకమైనా విడదీయలేవు అని చెప్పగానే విహారి షాక్ అయిపోతాడు. మీ ఇద్దరూ బతికున్నంత కాలం కలిసే ఉంటారు ఉండాలి అని అంటారు. ఇంతకు ముందు మంగల్యాన్ని పరీక్షించి తప్పు చేశారు మళ్లీ అదే చేస్తే శిక్ష అనుభవిస్తావని స్వామీజీ విహారిని హెచ్చరిస్తారు. మా మధ్య బంధం అంత బలమైంది అయితే మా తాతయ్య మాట ఏం కావాలి? మా రెండు కుటుంబాలు కలిసేది ఎప్పుడు? నన్నే నమ్ముకున్న సహస్ర పరిస్థితి ఏంటి? నేను దక్కకపోతే సహస్ర చనిపోతుందని విహారి అంటాడు. వాళ్ల ఖర్మ ఫలం వాళ్లకి ఉంటుందని స్వామీజీ చెప్తారు. దాంతో విహారి నాకు నా కుటుంబమే ముఖ్యం మీ మాటలు వినను ఎటు అయితే అటు మాట్లాడుతారు అని నన్ను అడ్డు పడొద్దని చెప్పి విహారి వెళ్లిపోతాడు. ఆదికేశవ్, గౌరీ దేవుడికి దర్శించుకుంటారు. ఆదికేశవ్ ఎక్కడికో వెళ్తే గౌరీ వెతుకుతుంది. లక్ష్మీ నోటి నుంచి రక్తం వస్తుంది. మదన్ ఏమైందని లక్ష్మీని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!





















