Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 11th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ చేతిలో విషం.. కడసారి వీడ్కోలుకు తల్లిదండ్రులు.. విహారికి తప్పని ముప్పు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode మదన్‌తో పెళ్లి ఇష్టం లేని కనకం చనిపోవడానికి తనతో పాటు విషం తెచ్చుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ ఏడుస్తూ ఉంటే పండు లక్ష్మీ దగ్గరకు వస్తాడు. నాతో ఏమైనా చెప్తావా పండు అని లక్ష్మీ అడిగితే ఇంత వరకు వస్తే నేనేం చెప్తా అమ్మా.. నేను చెప్పినా నువ్వేం వినవు కదా.. విహారి బాబుకి నువ్వు ప్రేమిస్తున్నట్లు చెప్పవు. నీ ప్రేమ విహారి బాబుకి అర్థం కాదు. ఇంక నేను ఏం మాట్లాడనమ్మా అని అంటాడు. ఇక విహారి లక్ష్మీ వైపు రావడంతో పండు అమ్మా నీకు దండం పెడతా విహారి బాబుకి నీ మనసులో మాట చెప్పు అని అంటాడు. విహారి కనక మహాలక్ష్మీ దగ్గరకు రావడంతో లక్ష్మీ ఏడుస్తూ విహారిని హగ్ చేసుకుంటుంది. విహారి షాక్ అయిపోతాడు.
విహారి: నీ భయం నాకు అర్థమైంది కనక మహాలక్ష్మీ. నీకు ఏం భయం లేదు మదన్ నిన్ను బాగా చూసుకుంటాడు. (లక్ష్మీ టెన్షన్‌లో ఉందని తన తల్లిదండ్రులు వస్తున్నారని చెప్పకూడదని అనుకుంటారు) లక్ష్మీ బాధ పడకు అంతా బాగానే జరుగుతుంది. నీకు ఎప్పుడు ఏం సమస్య వచ్చినా నేను చూసుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు.
లక్ష్మీ: ఏడుస్తూ విహారి మాటలు తలచుకుంటుంది. ఈ మంగళ సూత్రం నా ప్రాణం ఉన్నంత వరకు నాతోనే ఉంచుకుంటాను. ఎవరూ నా నుంచి దీన్ని వేరు చేయలేరు. అని విషం బాటిల్ తీస్తుంది.
మదన్‌కి పద్మాక్షి హారతి ఇస్తుంది. అందరూ మదన్‌ని ఆశీర్వదిస్తారు. పంతులు పెళ్లికొడుకుని తీసుకురమ్మని అంటే మదన్‌ని తీసుకొస్తారు. మరోవైపు సత్య కనకం తల్లిదండ్రుల్ని తీసుకొస్తుంటాడు. సత్య విహారికి కాల్ చేసి ఎక్కడికి తీసుకురావాలి అంటే గుడి దగ్గరకు తీసుకురమ్మని విహారి చెప్తాడు. వాళ్లు తట్టుకుంటారా అంటే నచ్చచెప్తానని కోప్పడినా భరిస్తానని విహారి అంటాడు. ఇక విహారికి పండు కనిపిస్తాడు. పండు విహారితో నిజం నాకు తెలుసు బాబు మీరు ఎంత సతమతమయిపోతున్నారో నాకు తెలుసు బాబు.. మీకు లక్ష్మీకి పెళ్లి అయిందని నాకు తెలుసు అని అంటాడు. విహారి షాక్ అయిపోతాడు. మీరు ఆ నలిగిపోతున్నారని నాకు తెలుసు అని ఏడుస్తాడు. నాకు ఎందుకు చెప్పలేదు అని విహారి అడిగితే మీ బాధ చూశాక చెప్పలేకపోయానని అంటాడు. ఇంకెవరికీ ఏం బాధ ఉండదు అని లక్ష్మీకి మదన్‌కి పెళ్లి జరిగితే అంతా సెట్ అయిపోతుందని విహారి అంటాడు. ఇక పండుకి చారుకేశవ పిలవడంతో వెళ్లిపోతాడు.
లక్ష్మీతో కూడా పంతులు పూజ చేయిస్తారు. లక్ష్మీ విషం చేతిలో పట్టుకొని ఉంటుంది. ఆదికేశవ్ లక్ష్మీకి కాల్ చేస్తాడు. చాలా సంతోషంగా ఉందని అల్లుడు గారు మీరు హైదరాబాద్ వచ్చారని మాకు తెలుసు అంటాడు. గౌరీ కనకంతో తాము గుడిలో పూజకు వస్తున్నామని అంటుంది. దాంతో కనకం కడసారి వీడ్కోలు చెప్పడానికి మీరు వస్తున్నారా అంటుంది. అదేంటే అలా మాట్లాడుతున్నావని తల్లి అడిగితే అమెరికా వెళ్లిపోతా కదా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!





















