Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 10th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: పిల్లల కోసం లక్ష్మీతో కలిసి వ్రతం చేయనున్న విహారి.. సహస్ర అడ్డుకోగలదా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి లక్ష్మీ పిల్లల కోసం వ్రతం చేయాలని అనుకోవడం సహస్ర ఆ వ్రతాన్ని అడ్డుకోవాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారికి ఆదికేశవ్ కాల్ చేస్తాడు. లక్ష్మీకి ఫోన్ ఇవ్వమని చెప్పి సంతానం కోసం పూజ చేసి జంట అరటి పళ్లను రావి చెట్టుకు కట్టమని మన ఊరి పంతులు చేయమని చెప్పారని రేపు మీతో మేం ఆ వ్రతం చేయిస్తామని అంటారు. విహారికి ఆదికేశవ్ కూడా చెప్పడంతో విహారి సరే అనేస్తాడు. అది సహస్ర వింటుంది.
సహస్ర మనసులో వీళ్లద్దరికీ అడ్డు ఉంటారని వీళ్లని తీసుకొస్తే సంతాన వ్రతం చేయిస్తారట ఎలా చేయిస్తారో నేను చూస్తాను అని అనుకొని కోపంగా వెళ్లిపోతుంది. గౌరీ భర్తతో ఏంటోనయ్యా ఇన్ని వ్రతాలు చేయిస్తున్నాం మన బిడ్డకు సంతానం పుట్టడం లేదు అని బాధ పడుతుంది. మన పూజలు ఫలిస్తాయి ఎక్కడికి పోతాయే మన బిడ్డకు సంతానం పుడతారు అని ఆదికేశవ్ అంటారు. ఇక సహస్రకు మళ్లీ ముహూర్తం లేకుండా పెళ్లి అయింది అని గౌరీ చెప్తే మంగళ గౌరీ వ్రతం చేయిస్తే అన్ని దోషాలు పోతాయి చెప్పలేకపోయావా అని అడుగుతాడు. సాయంత్రంలోపు చెప్దాం వాళ్లు కూడా ఏర్పాట్లు చేసుకుంటారని ఆదికేశవ్ అంటారు.
యమున ఆదికేశవ్,సహస్ర, వాళ్లకి భోజనం పెడుతుంది. గౌరీ కోసం భోజనం తీసుకెళ్లమని యమున పండుతో చెప్తుంది. ఇక విహారి అక్కడికి వచ్చేస్తాడు. ఆదికేశవ్‌ని చూసి దాక్కుంటాడు. సహస్ర చూసి నవ్వుకుంటుంది. ఆదికేశవ్ సహస్రతో సహస్రమ్మా నీ భర్తని ఇంత వరకు చూపించలేదు ఎప్పుడు చూపిస్తావమ్మా అని అంటారు. దానికి సహస్ర మా ఆయన పైన గదిలో వర్క్ చేస్తున్నారు పిలవమంటారా అంటే వద్దని ఆదికేశవ్ అంటారు. ఇక ఆదికేశవ్ చేయి కడుక్కోవడానికి కిచెన్ వైపు వెళ్తారు. లక్ష్మీ అక్కడే ఉంటుంది. విహారి చూసి చాలా టెన్షన్ పడతారు. ఇంతలో యమున లక్ష్మీని పిలిచి చేయి తుడుచుకోవడానికి టవల్ తీసుకురా అని చెప్తుంది.
లక్ష్మీ టవల్ తీసుకొని వచ్చే టైంకి సహస్ర పరుగులు తీస్తుంది. లక్ష్మీ తండ్రిని చూసి కంగారు పడి ముఖం దాచుకుంటుంది. సహస్ర అందర్ని చూసి ఏం మాట్లాడకుండా ఆగిపోతుంది. లక్ష్మీని ఆదికేశవ్ చూసే టైంకి విహారి పవర్ కట్ చేసేస్తాడు. లక్ష్మీ తండ్రి చేతిలో టవల్ పట్టేసి వెళ్లిపోతుంది. తర్వాత విహారి మెయిన్ ఆన్ చేస్తాడు. అంతా ఊపిరి పీల్చుకుంటారు. కొంచెం ఉంటే నాన్నకి దొరికిపోయేదాన్ని అని లక్ష్మీ అనుకుంటుంది. ఉదయం సహస్ర తల్లి, పిన్నితో మాట్లాడుతుంటారు. ఆదికేశవ్ రావడంతో సహస్ర కూర్చొమని చెప్తారు. ఆదికేశవ్ సహస్రతో అమ్మా నీ పెళ్లి ముహూర్తం లేకుండా జరిగింది కదా నువ్వు నీ భర్తతో కలిసి మంగళ గౌరీ వ్రతం చేస్తే అన్ని దోషాలు పోతాయమ్మా అని అంటారు. మంచి సలహా అని యమున అంటుంది. సహస్ర కూడా నా కూతురి లాంటిది అని అంటారు.
సహస్ర తల్లిని ఒప్పిస్తుంది. తన కూతురు అల్లుడికి కూడా వ్రతం ఉందని మీరు ఆ రోజు మంగళ గౌరీ వ్రతం పెట్టుకోండి విజయవంతంగా ఇద్దరూ పూర్తి చేయండి మీ జీవితం బాగుంటుందని అంటారు. పద్మాక్షి సరే అంటుంది. యమునకు అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తుంది. విహారి విని అయ్యో అనుకుంటాడు. అంబిక సిద్దార్థ్‌ని కలవడానికి వెళ్తుంది. సిద్దార్థ్‌ని కోప్పడుతుంది. దాంతో సిద్ధార్థ్ ఓ వీడియోని చూపిస్తాడు. దాంతో అంబిక షాక్ అయిపోతాడు. అంబిక సిద్దార్థ్‌కి డబ్బులు ఇవ్వడం లక్ష్మీ చూసేస్తుంది. క్లారిటీ లేకుండా ఈ విషయం విహారికి చెప్పలేను కదా తనని కనిపెట్టి తర్వాత చెప్తా అనుకుంటుంది. ఇంతలో విహారి లక్ష్మీకి కాల్ చేస్తాడు. రేపు ఉదయం గుడికి అని చెప్పి రెడీగా ఉండు నేను బయటకు వెళ్తున్నా అని వస్తా అని అంటాడు. సహస్ర ఆ మాటలు వినేస్తుంది.
సహస్ర మనసులో రేపు ఎట్టి పరిస్థితుల్లో వీళ్లని ఇళ్లు కదలనివ్వకుండా చేయాలి అనుకుంటుంది. విహారితో మాట్లాడుతూ ఏంటి బావ ఆలోచించి మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా నీ మనసులో నుంచి ఆ లక్ష్మీని తీసేస్తా అనుకుంటుంది. సహస్ర విహారి, లక్ష్మీని ఎలా ఆపాలి అనుకుంటూ ఉంటే అంబిక వచ్చి లక్ష్మీ బయటకు వెళ్లిపోతే మనకు బెస్ట్ అని అంటుంది. సహస్ర మనసులో అది బయటకు వెళ్తే బావతో వెళ్తుంది అని అనుకుంటుంది. అంబిక తనలో తాను సహస్ర నాకు తెలీకుండా గూడు పుటాని నడిపిస్తుంది. నేను తెలుసుకుంటా అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!





















