Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 29th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: డబ్బు కోసం లక్ష్మీని అమ్మేయడానికి ప్రకాశ్ ప్లాన్.. విహారి, లక్ష్మీల సప్తపది.. సహస్ర గోల!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం, విహారి తెలీకుండా సప్తపది అడుగులు వేయడం చూసిన సహస్ర అందరి ముందు గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్రని శిక్షించాలని అందరూ అంటారు. పెద్ద దొర సహస్రకి శిక్ష విధిస్తారు. దాంతో సహస్ర చాలా భయపడుతుంది. లక్ష్మీ, విహారి అక్కడికి రావడంతో సహస్ర భయంతో విహారిని హగ్ చేసుకుంటుంది. విహారి మనసులో లక్ష్మీతో తనకు పెళ్లి అయిన విషయం సహస్రకు తెలిసినా.. సహస్రకు తనకు పెళ్లి కాబోతుందని గూడెం వాళ్లకి తెలిసినా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటాడు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది తన పరిస్థితి అయిపోయిందని అనుకుంటాడు.
సహస్ర పొరపాటున గూడెం వాళ్ల దైవాన్ని కాలితో తొక్కేశాను అని చెప్తుంది. సహస్రని క్షమించమని విహారి, లక్ష్మీ వేడుకుంటారు. తాను పొరపాటున చేసిందని శిక్షించొద్దని వేడుకుంటుంది లక్ష్మీ. మీ కోసం తనని విడిచిపెడుతున్నాం అని చెప్పి పంపేస్తారు. ముగ్గురు అందరికీ దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు విహారి, లక్ష్మీలను మోసం చేసి పెళ్లి చేసిన ప్రకాశ్‌తో తన ఫ్రెండ్ నువ్వు చేసిన పనికి ఎవరైనా నిన్ను చూస్తే చంపేస్తారని హైదరాబాద్ వదిలి వెళ్లిపోమని చెప్తాడు. దాంతో ప్రకాశ్ మినిస్టర్‌కి సంబంధించి 2 కోట్ల ప్రాజెక్ట్ ఉంది అది పూర్తి చేసి డబ్బుతో వెళ్లిపోతా అంటాడు.
ఇంతలో ప్రకాశ్‌కి ఓ వ్యక్తి ఫోన్ చేసి నలుగురు అమ్మాయిలు కావాలని వాళ్లని పట్టివ్వమని ఒక్కోక్కరికి 10 లక్షల చొప్పున 40 లక్షలు వస్తాయని నాలుగు ఫొటోలు పంపిస్తారు. ఆ ఫోటోల్లో కనకం ఫొటో కూడా ఉంటుంది. కనక మహాలక్ష్మీని ఈజీగా పట్టిస్తానని అనుకొని కనకాన్ని పట్టిస్తే ఎంత ఇస్తారని అడుగుతారు. 50 లక్షలు అని చెప్పగానే ప్రకాశ్ కనకాన్ని పట్టి ఇస్తానని అనుకుంటాడు. విహారితో ప్రాబ్లమ్ అని ప్రకాశ్‌తో చెప్పిన ఇద్దరూ తాను చెప్పినట్లు ఆడుతారని కనకాన్ని పట్టించి 50 లక్షలు దక్కించుకుంటానని అనుకుంటాడు.
పద్మాక్షి సహస్ర, విహారి వాళ్ల కోసం చాలా టెన్షన్ పడుతుంది. ఇంతలో యమున వచ్చి వదిన అందరూ క్షేమంగా ఉన్నారని వస్తున్నామని విహారి కాల్ చేసి చెప్పాడని అంటుంది. విహారి వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. సహస్ర కారులో ఫోన్ మర్చిపోయానని వెళ్తుంది. ఇంతలో విహారి ముందు వెళ్తూ ఉండగా వెనకాలే లక్ష్మీ వెళ్తుంటుంది. ఇంటి ముందు వేసిన ముగ్గులో కుంకుమ విహారి తొక్కి అడుగులు వేస్తే పసుపు తొక్కి విహారి అడుగుల పక్కనే లక్ష్మీ అడుగులు వేస్తుంది. సహస్ర అది చూసి కోపంతో ఆగు లక్ష్మీ అని అరుస్తుంది. లక్ష్మీ ఆగుతుంది. అందరూ బయటకు వస్తారు. సహస్ర కోపంతో బకెట్‌తో వాటర్ తీసుకొచ్చి ఇద్దరి కాళ్ల మీద పోసేస్తుంది. ఏమైందని అందరూ అడుగుతారు.
వసుధ: మీ బావ కాళ్లు కడిగావంటే అర్థముంది. లక్ష్మీ కాళ్లు కూడా ఎందుకు కడిగావ్.
సహస్ర: నా రాతే ఆ దేవుడు సరిగా రాయలేదో లేక ఈ లక్ష్మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నా రాత మారిపోయిందో తెలీడం లేదు. నా జీవితంలో ప్రతీ క్షణం ఈ లక్ష్మీనే ఉండేలా కనిపిస్తుంది. ఈ లక్ష్మీ నా జీవితం లాక్కుంటుందేమో అనిపిస్తుంది. నా జీవితం లాక్కోవడం అంటే బావ పక్కన తాను చేరడం. నా స్థానాన్ని తను భర్తీ చేయాలని చూడటం.
విహారి: సహస్ర నీకు ఏమైనా పిచ్చా ఏం మాట్లాడుతున్నావ్.
సహస్ర: నా పెళ్లికి జరిగిన ప్రతీ కార్యక్రమం లక్ష్మీ కోసం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక సారి లక్ష్మీకి గాజులు కొనిచ్చావ్. తనకు తెలీకుండా తను నిన్ను ప్రాణాపాయం నుంచి కాపాడింది. ఇప్పుడేమో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అనుకొని చేశారో అనుకోకుండా చేశారో తెలీదు కానీ జాగ్రత్తగా ఒకరి అడుగులో మరొకరి అడుగు పడేలా వీళ్లు నడుచుకొని వచ్చారు. ఆరు అడుగులు పడ్డాయి ఇంకొక్క అడుగుపడి ఉంటే వాళ్ల సప్తపది పూర్తయ్యేది. ఆఖరికి ఇక్కడ కూడా నా స్థానంలో లక్ష్మీ ఉంది.
పద్మాక్షి లక్ష్మీ లాగిపెట్టి కొడుతుంది. ఏంటి ఇదంతా అని విహారి అడుగుతాడు. దానికి పద్మాక్షి దాని పని అది చేసుకోకుండా అందరి జీవితాల్లోకి ఇలా వస్తుందేంటి అని అంటుంది. ఒక రాత్రి అంతా విహారితో నువ్వు ఎందుకు ఉన్నావ్? విహారితో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అని అడుగుతాడు. లక్ష్మీని అనుమానిస్తే నన్ను అనుమానించినట్లే అని విహారి అంటాడు. లక్ష్మీని అలా అడిగితే నన్ను అడిగినట్లే కదా అని అంటాడు. దానికి పద్మాక్షి నిన్నే అడుగుతున్నా రాత్రంతా మీ ఇద్దరు ఎక్కడున్నాడు అని అడుగుతుంది. లక్ష్మీ అడవిలోకి వెళ్లిపోయిందని అడవి మనుషులు తమని పట్టుకున్నారని దెబ్బ కూడా చూపిస్తాడు. యమున కంగారు పడుతుంది. సహస్రని కూడా పట్టుకున్నారని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















