Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 24th:కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సహస్ర నా భార్య కాదు.. రెండు ముడులే వేశానని లక్ష్మీతో చెప్పేసిన విహారి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode December 24th విహారి లక్ష్మీతో సహస్రకు రెండు ముడులే వేశా మాది పెళ్లే కాదు అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక సుభాష్‌ని పెళ్లి చేసుకోవాలి అని కావాలనే పెళ్లి కొడుకు ఫొటోల్లో పంజాబీ అతన్ని సెలక్ట్ చేసుకుంటుంది. ఇంట్లో వాళ్లు అతనితో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంబిక, సుభాష్ ప్లాన్ ప్రకారం అతన్ని దారిలో అడ్డుకొని ఆ స్థానంలో సుభాష్ వస్తాడు. మన మీద లక్ష్మీ, విహారిలకు అనుమానం రాకుండా చూసుకోవాలని త్వరగా పెళ్లి తంతు పూర్తి చేయాలని అనుకుంటారు.
విహారి లక్ష్మీని చూస్తూ లక్ష్మీ నన్ను దూరం పెడుతోంది. వీలైనంత త్వరగా సహస్ర మెడలో రెండు ముడులే వేశానని చెప్తానని అనుకుంటాడు. అంబిక, కరన్‌సింగ్‌గా ఉన్న సుభాష్ ఇద్దరూ ఒకరికి ఒకరు ఇష్టమని చెప్తారు. పద్మాక్షి అంబికను చూసి ఇన్ని రోజులు పెళ్లి అంటే ఇష్టం లేదు అని చెప్పింది సడెన్‌గా అబ్బాయి నచ్చాడు అని ఎప్పుడూ లేనట్లు సిగ్గు పడుతోంది అని అనుకుంటుంది. సహస్రకు అదే అనుమానం వస్తుంది. పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి అని భక్తవత్సలం అంటే కరన్‌సింగ్, అంబిక సింపుల్‌గా చేయమని అంటారు.
సహస్ర విహారి చేయి పట్టుకొని మనం దగ్గరుండి పెళ్లి చేద్దాం బావ అంటే విహారి చేయి విడిపించుకుంటాడు. భక్తవత్సలం, విహారి దగ్గరుండి సుభాష్‌ని పంపిస్తారు. ఇక విహారి లక్ష్మీ బయటకు వెళ్లడంతో లక్ష్మీ కోసం వెళ్తాడు. లక్ష్మీతో నువ్వు నాతో సరిగా ఉండటం లేదు.. నిజం అందరికీ చెప్తా అంటే చెప్పనివ్వడం లేదు.. నాతో మాట్లాడవు.. ఇప్పుడు నిజం చెప్పేస్తా.. సహస్ర మరీ ఓవర్ అయిపోతుంది. నేను నీతో ఉండాలి అనుకుంటే సహస్రతో ఉండాల్సి వస్తుంది అని అంటాడు. తప్పదు విహారి గారు మీరు మొదట పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి మొదట తననే పెళ్లి చేసుకున్నారు అని అంటుంది. మనసులో నువ్వు ఉంటే తనతో రాయిలా ఉండలేను.. నువ్వు నీలో నా మీద ప్రేమని దాచేస్తావ్ అని అంటాడు. మీ మీద నాకు ప్రేమ లేదు.. మీరు పెళ్లి చేసుకున్న సహస్రమ్మ దగ్గరకు వెళ్లి మీ కంటే ముందు నన్ను పెళ్లి చేసుకుంటా అని ఎలా చెప్తారు.
విహారి కోపంగా నేను సహస్ర ఎప్పటికీ భార్యభర్తలం కాదు అని అంటాడు. ఎందుకు కాదు మీరు ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు అంటుంది. నేను మూడు ముళ్లు వేయలేదు.. ఆ రోజు హాస్పిటల్‌లో రెండు ముళ్లు మాత్రమే వేశాను అంటాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. రెండు ముడులు వేస్తే సహస్ర నా భార్య ఎలా అవుతుంది.. అది పెళ్లి ఎలా అవుతుంది అని అడుగుతాడు. మనదే అసలైన పెళ్లి మనదే.. నువ్వే నా అసలైన భార్య.. అని అంటాడు. అవన్నీ వదిలేయండి అని విహారి గారు.. మీకు అర్థమవ్వాల్సింది ఏంటి అంటే మీ మధ్య ఏం జరిగినా.. మీరు ఎన్ని ముడులు వేడినా తను ఇప్పుడు గర్భవతి.. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తనని చూసుకోవాలి అని అంటుంది. మూడు ముళ్ల వేయడానికే ఇష్టపడని నేను తనతో అలా ఉంటాను అని నువ్వు ఎలా అనుకుంటావ్. నేను కలలో కూడా సహస్రని తాకను. తాగి వచ్చిన నాకు తనలో నువ్వు కనిపిస్తే హగ్ చేసుకున్నా అంతే అని అంటాడు.
లక్ష్మీ విహారితో మీరు ఇలా చెప్తే సహస్రమ్మ క్యారెక్టర్ మీద నింద వేసినట్లు అవుతుంది. అలా చెప్పొద్దు అని అంటుంది. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఎవరు ఏమనుకున్నా ఈ జన్మలో నువ్వే నా భార్యవి అని అంటాడు. భక్తవత్సలం యమునతో పంతులుకి కాల్చేయమని అంటారు. యమున ఫోన్ చేసి పంతులుకి చెప్పి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయిస్తారు. భక్తవత్సలం చాలా హ్యాపీ అయిపోతారు. వీర్రాజు టీవీలో ఫైట్ సీన్ చూసి రెచ్చిపోతాడు. ఇక పానకాలు అంబికకు పెళ్లి అని చెప్పగానే వీర్రాజు షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















