Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సహస్రని నిలదీసిన విహారి! తలబాదుకుంటున్న యమున! లక్ష్మీ పరిస్థితేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode December 17th విహారి సహస్రను నిలదీయడం పెళ్లి నాటకం గురించి యమునకు తెలిసి యమున లక్ష్మీకి క్షమాపణ చెప్పి ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక ఇంట్లో వాళ్లతో ఊరిలో వాళ్ల పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు నా పెళ్లి గురించి మీకు ఎందుకు అంటుంది. మమల్ని కుక్కల్తో పోల్చుతావా అని వసుధ అంటుంది. విహారి కోపంగా ఇంట్లోకి వస్తాడు. అప్పటికే అక్కడ అంబిక పెళ్లి టాపిక్ జరుగుతుండటం.. అందరూ బాధగా ఉండటంతో విహారి ఏం అనకుండా అలా ఉంటాడు.
అంబిక పెళ్లి విషయంలోనే తాతయ్య బాధ పడుతున్నారు.. ఇక సహస్ర విషయం తెలిస్తే బాధ పడతారు అని చెప్పడు. అంబిక అందరితో తనకు పెళ్లి పెళ్లి అని సతాయించొద్దని తేల్చేస్తుంది. నా గురించి నా పెళ్లి గురించి మానేసి ఎవరి పనులు వాళ్లు చూసుకోండి అని చెప్తుంది. విహారి సహస్ర చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్తాడు. నువ్వు మనిషివేనా నీకు కొంచెం అయినా మనస్శాక్షి ఉందా అని తిడతాడు. నేనేం చేశాను బావ అని సహప్ర అంటే ఆ మోసం నా నోటితోనే చెప్పాలా అని విహారి అంటాడు. లేడీ డాక్టర్ని కలిశానని చెప్తాడు.
సహస్ర షాక్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీ నాటకం అని తెలిసిపోయిందా.. అని కంగారు పడుతుంది. విహారి సహస్ర మీద వేసిన కేకలు యమున విని బయటకు వస్తుంది. సహస్ర యాక్సిడెంట్ అని గర్భసంచి పోయిందని చెప్పబోతే యాక్సిడెంట్ నాటకం.. చివరి కోరిక అని నువ్వు అడిన నాటకం మొత్తం నాకు తెలిసిపోయిందని అంటాడు. యమున ఆ మేటర్ విని షాక్ అయిపోతుంది. నేను మోసం చేయలేదు అది నాకు నీ మీద ఉన్న ప్రేమ అని సహస్ర అంటే విహారి సహస్రని కొట్టడానికి చేయి ఎత్తుతాడు.
ఎందుకు ఆగిపోయావ్ బావ కొట్టు.. నేను నిన్ను మోసం చేశాను అని చాలా పెద్ద మాట అన్నావ్ కదా బావ నేను అలా చేయడానికి కారణం నువ్వే.. ఆ నాటకం ఆడటానికి కారణం కూడా నువ్వే.. ఎందుకంటే మన కుటుంబాలు కలవాలి అని నువ్వు మా అమ్మ కాళ్లు పట్టుకొని మన పెళ్లి జరుగుతుందని మాటిచ్చావ్.. మరి ఆ మాట మీద నిలబడి నాతో నిశ్చితార్థం చేసుకోవడానికి ఎందుకు వాయిదా వేశావ్ బావ.. ఆ తర్వాత పీటల మీద మన పెళ్లి ఎన్ని సార్లు ఆగింది బావ.. అందరూ బలవంతం చేస్తే పీటల మీద తాళి వదిలేసి నువ్వేం చెప్పావో గుర్తుందా బావ.. ఆ టైంలో కూడా నీ గురించి ఆలోచించుకున్నావ్ కానీ నాకోసం ఆలోచించలేదు.. నువ్వే మా ఇంటికి వచ్చి నాలో ఆశలు రేపి మళ్లీ నువ్వే టైం కావాలి అంటే నేనేం అయిపోవాలి బావ.. నీ వైపు నుంచి చూస్తే నాదే తప్పు.. కానీ నా వైపు నుంచి చూడు బావ నేను చేసింది తప్పు కాదు.. నీ మీద ప్రేమతో తప్పక అలా చేశా అనిపిస్తుంది. నా ప్రేమని బతికించుకోవడానికి నేను మోసం చేశాను.. నువ్వు రేపిన ఆశలు నిజం చేసుకోవడానికి నిన్ను మోసం చేశా.. నాలో స్వార్థం రేపిందే నువ్వు బావ.. ఇంట్లో వాళ్లకి సహస్ర మోసం చేసింది అని చెప్తావేమో.. కానీ ఇప్పుడు నేను నీ భార్యని.. గర్భవతిని కూడా.. నా కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది బావ.. అది గుర్తు పెట్టుకొని అందరికీ విషయం చెప్పు బావ నేను భయపడను అని సహస్ర అంటుంది. యమున మొత్తం విని చాలా ఏడుస్తుంది.
అంబిక, సుభాష్ మాట్లాడుకుంటారు. మీ ఇంట్లో నీకు పెళ్లి చేస్తా అన్నారు అని నన్ను మోసం చేస్తావా అని అడుగుతాడు. నిన్ను ఎలా మోసం చేస్తాను సుభాస్ నాకు నువ్వు చేసిన సాయం, ఓదార్పు అన్నీ గుర్తున్నాయి అని చెప్తుంది. నేను నా పగని వదిలేయను.. నా ప్రేమని వదిలేయను.. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు.. అదే చేస్తా.. ముందు ఈ పెళ్లి కంటే లక్ష్మీ దత్తత ఆపాలి అని అంటుంది.
యమున ఏడుస్తూ ఉంటే లక్ష్మీ వెళ్లి ఏమైందని అడుగుతుంది. లక్ష్మీని హగ్ చేసుకొని యమున ఏడుస్తుంది. లక్ష్మీ చేతులు పట్టుకొని క్షమాపణ చెప్తుంది. నీకు చాలా అన్యాయం చేశాను లక్ష్మీ అని ఏడుస్తుంది. ఒక్క నాటకం నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని సహస్ర పెళ్లి గురించి చెప్తుంది. విహారికి నేనే బలవంతం చేశా .. ఆ రోజు నేను విహారి మాట వినుంటే నీకు ఈ కష్టం ఉండేది కాదు అని తలబాదుకొని ఏడుస్తుంది. విహారి కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సహస్ర కుట్రకి అందరం ఇరుక్కొని నీ బతుకు పోగొట్టేశామని యమున ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















