Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 28th Episode: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: బాత్‌రూంలో లక్ష్మీ, విహారిల ఎమోషనల్ సీన్స్! విడాకుల పేపర్లు మీద విహారి సంతకం!!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode August 28th లక్ష్మీ విహారిలను సహస్ర బాత్‌రూంలో చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీని పిలిచి విడాకుల గురించి మళ్లీ అడుగుతాడు. లక్ష్మీ విహారితో నా గురించి ఆలోచించకండి సహస్రమ్మ గురించి మాత్రమే ఆలోచించండి అని అంటుంది. విహారి కోపంతో లక్ష్మీని బాత్రూంకి తీసుకెళ్లి షవర్ కింద పెట్టి నీ తల ఇప్పుడైనా చల్లారిందా.. ఏం మాట్లాడుతున్నావ్ లక్ష్మీ నన్ను వదిలేయాలి అని నన్ను దూరం పెట్టాలి అని నువ్వు గట్టిగా ఫిక్స్ అయిపోయావ్ కదా అని అడుగుతాడు.
లక్ష్మీ విహారితో మీరు కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నారు. ముగిసిన మన ప్రయాణం గురించి వదిలేయండి అంటుంది. ఏంటి నీకు నాకు మధ్య ఏం లేదా అని అడుగుతాడు. కొన్ని బలవంతంగా ముడిపడతాయి మన బంధం కూడా అంతే కానీ మీది సహస్రమ్మల బంధం రెండు కుటుంబాల కలయిక అది ఎప్పటికీ విడిపోకూడదు అని అంటుంది. దాంతో విహారి అయితే నువ్వు త్యాగానికి సిద్ధపడిపోయావా.. అని అంటాడు. కలవని దారులు కలవాలి అనుకోవడం అన్యాయం అవుతుంది అని లక్ష్మీ అంటుంది. విహారి కోపంతో నువ్వు విడాకులు ఇచ్చి నా నుంచి దూరం వెళ్లాలి అనుకుంటున్నావ్. నేను దూరం వెళ్లిపోతే సహస్రతో సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావ్ కదా.. నేను వెళ్లి తిరిగివచ్చే లోపు నువ్వు ఈ గడప దాటి వెళ్లడానికి వీల్లేదు. నువ్వు విడాకులు కావాలి అంటే నేను అందరి ముందు జరిగింది చెప్పేస్తా ఇది నిన్ను బెదిరించాలని చెప్పడం లేదు.. సహస్రని నేను భార్యగా ఎప్పటికీ చూడలేను. తనని నా అర్థాంగిలా ఎప్పటికీ చూడలేను.. ప్రకాశ్ నుంచి నీకు ఏ ప్రాబ్లమ్ రాకుండా చారుకేశవ మామయ్య పండు చూసుకుంటారు. నేను యూఎస్ వెళ్లి వస్తా జాగ్రత్త అని చెప్తాడు.
లక్ష్మీ వెళ్లిపోబోయి పడిపోతుంది. విహారి లక్ష్మీని పట్టుకుంటాడు. సహస్ర అప్పుడే గదిలోకి వచ్చి చూసి షాక్ అయిపోతుంది. బావ, లక్ష్మీ బాత్‌రూంలో ఉన్నారేంటి ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటుంది. ఇంతలో పద్మాక్షి రావడం చూసి బట్టలు సర్దుతున్నట్లు నటించి బావ అని పిలుస్తుంది. విహారి షాక్ అయి డోర్ వేసి స్నానం చేస్తున్నా అని చెప్తాడు. పద్మాక్షి వచ్చి సహస్ర వాళ్లతో త్వరగా కిందకి రమ్మని చెప్తుంది. విహారి లక్ష్మీని బాత్‌రూంలో ఉంచి బయటకు టవల్ చుట్టుకొని వెళ్తాడు. లక్ష్మీ తుమ్ముతుంటే కవర్ చేయడానికి విహారి తుమ్మినట్లు నటిస్తాడు. తల తుడుచుకో బావ తమ్ములు ఎక్కువ అయిపోతున్నాయ్ అని సహస్ర అంటుంది.
విహారి మళ్లీ బాత్‌రూంకి వెళ్లి లక్ష్మీ తల తుడిచి పక్కకి వెళ్లి బట్టలు వేసుకొని వచ్చి నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా మా అత్తయ్యా అమ్మ చూసుకుంటారు. మన బంధం ఎప్పటికీ ముగిసిపోదు అర్థం చేసుకో అంటాడు. ఇక సహస్ర విహారిని తీసుకొని కిందకి వెళ్తుంది. యమున విహారి చేత విడాకుల కాగితాల మీద సంతకం పెట్టించాలని అనుకుంటుంది. అంబిక ఫైల్స్ తీసుకొని విహారి చేత సంతకం పెట్టించాలి అనుకుంటే వాటిని యమున తీసుకొని ఆ పేపర్లలో విడాకుల పేపర్ పెట్టేస్తుంది. సంతకాలు పెట్టమని విహారికి పేపర్లు ఇస్తుంది. విహారి అన్ని పేపర్లు మీద సంకతం చేసి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టేస్తాడు. ఇక ఏ సమస్య ఉండదు అని యమున అనుకుంటుంది.
విహారి, సహస్రలు అమెరికా బయల్దేరుతారు. పద్మాక్షి విహారికి సహస్రని అప్పగిస్తుంది. జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఇంతలో లక్ష్మీ వస్తుంది. లక్ష్మీ, విహారి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. చారుకేశవ, వసుధలతో లక్ష్మీని జాగ్రత్తగా చూసుకోమని అంటాడు. పండుకి కూడా లక్ష్మీని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















