Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 11th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: చేనేత చీరలో అదిరిపోయిన లక్ష్మీ.. లక్ష్మీని గదిలో లాక్ చేసేసిన అంబిక.. ప్రజెంటేషన్ ఎలా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కోసం చెప్పిన ఇద్దరు మోడల్స్‌ని అంబిక, సహస్ర అడ్డుకోవాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ విహారికి తన ఫ్యాషన్ ప్రజంటేషన్ ఐడియా కోసం చెప్తుంది. చేనేత వస్త్రాలు గురించి పెళ్లి చేసేలా చెప్దామని అంటుంది. దాంతో విహారి ఇంప్రెస్ అయి మొత్తం బాధ్యతల్ని లక్ష్మీకే అప్పగిస్తాడు. లక్ష్మీకి థ్యాంక్స్ చెప్తూ వెళ్లి పడిపోబోతే లక్ష్మీ విహారిని పట్టుకుంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇంతలో యమున విహారి కోసం అటుగా వస్తుంది.
యమున మాట విని ఇద్దరూ లేచే సరికి లక్ష్మీ తాళి విహారి తాడుకి అతుక్కుంటుంది. ఇక విహారిని చూసి తల్లి చాలా హ్యాపీగా ఉన్నావ్ నాన్న ఈ మధ్య కాలంలో ఎప్పుడూ నిన్ను ఇలా చూడలేదు అని అంటుంది. దాంతో విహారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్తాడు. యమున విహారితో నీది మంచి మనసురా నీకు అంతా మంచే జరుగుతుందని అంటుంది. ఇక ఇద్దరినీ తినడానికి పిలిస్తే తర్వాత వస్తామని అంటారు. విహారి గది శుభ్రం చేస్తానని యమున అనడంతో లక్ష్మీ తాను చేస్తానని గది శుభ్రం చేస్తుంది. విహారి లక్ష్మీతో రేపు ఫారిన్ వాళ్లు వస్తారు కదా నువ్వు లంగావోణిలో కాకుండా నువ్వు చెప్పిన చేనేత చీరలో రావాలని చెప్తాడు. లక్ష్మీ సరే అంటుంది. ఈ ప్రాజెక్ట్‌ని టాప్ వన్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేద్దామని అంటుంది.
ఉదయం ప్రాజెక్ట్ ప్రజంటేషన్ కోసం అంతా రెడీ చేస్తారు. అంబిక కూడా డెలిగేట్స్ గురించి చెప్తుంది. లక్ష్మీ అన్నీ ఏర్పాట్లు చేసేసిందని అన్నీ లక్ష్మీ చూసుకుంటుందని తెలిసి అంబిక రగిలిపోతుంది. ఈ ప్రజెంటేషన్ లక్ష్మీ సక్సెస్ చేస్తే దాన్ని ఆపలేం అనుకొని సహస్రకు కాల్ చేస్తుంది. విహారి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ మొత్తం లక్ష్మీనే చేస్తుందని అది సక్సెస్ అయితే లక్ష్మీ రేంజ్ పెరిగిపోతుంది అప్పుడు లక్ష్మీని విహారి ఆకాశంలో కూర్చొపెడతాడని ఆ లక్ష్మీ ప్రజెంటేషన్ నాశనం చేయాలని అంటుంది. ఏం చేద్దాం అని సహస్ర అడిగితే దాని సోర్స్ తెలుసుకొని వాటిని కట్ చేస్తే సరిపోతుంది నువ్వు ఆఫీస్‌కి వచ్చేయ్ అని చెప్తుంది.
విహారి, అంబిక ఇద్దరూ ఎంప్లాయ్స్‌తో మాట్లాడుతారు. లక్ష్మీ ఇంకా రాలేదని విహారి కంగారు పడతారు. లక్ష్మీ కెపాసిటీ ఈ రోజు తెలిసిపోతుందని అంబిక విహారితో అంటుంది. ఎప్పుడూ లక్ష్మీని పొగిడే నీతోనే తనని తిట్టిస్తానని అనుకుంటుంది. ఇంతలో ఫారిన్ డెలిగేట్స్ వస్తారు. విహారి, అంబిక స్టాఫ్ వాళ్లని రిసీవ్ చేసుకుంటారు. విహారి లక్ష్మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మీ చేనేత చీరలో ఎప్పటిలా కాకుండా జుట్టు విరబోసుకొని ఏమాయ చేశావేలో సమంతలా ఎంట్రీ ఇస్తుంది. చీర కట్టులో విహారి లక్ష్మీని చూసి వావ్ అనుకుంటాడు. జాన్ కూడా ఇంప్రెస్ అవుతాడు. లక్ష్మీని చూసి విహారితో నీ భార్యనా అని అడుగుతాడు. విహారి మనసులో ఎస్ అనాలి అని ఉంది కానీ చెప్పలేను అని ప్రాజెక్ట్ లీడ్ అని అంటాడు. జాన్ లక్ష్మీ చీరని పొగిడేస్తాడు. విహారి వాళ్లని లోపల కూర్చొపెడతాడు. అంతా చక్కగా జరగాలి అని లక్ష్మీతో చెప్తాడు.
అంబిక పార్ధుని పిలిచి ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అడుతుంది. ఇద్దరు మోడల్స్‌తో చేయిస్తున్నారని చెప్తాడు. దాంతో అంబిక వాళ్ల ఫొటోలు తీసుకొని సహస్రకి ఫోన్ వాళ్లని ఆపమని చెప్తుంది. లక్ష్మీని డెలిగేట్స్ విహారి భార్యనా అని అడగగానే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుందని చెప్పి సహస్రని రెచ్చగొడుతుంది. మోడల్స్ ఇంకా రాలేదని విహారితో లక్ష్మీ చెప్తుంది. ఇక లక్ష్మీ బయటకు వెళ్తుంటే ఆఫీస్ బాయ్ జ్యూస్ తీసుకెళ్తూ లక్ష్మీ మీద పడేస్తాడు. లక్ష్మీ వాష్ రూమ్‌కి వెళ్లగానే అంబిక డోర్ క్లోజ్ చేసేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















