Prema Entha Madhuram August 12th: అను బాబు కోసం దిగిన మరో అపరిచితుడు.. మారువేషంలో రంగంలోకి దిగిన జిండే?
బాబుని ఆర్య వాళ్లకు ఇచ్చే సమయంలో ఓ అపరిచితుడు ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ కు డబ్బు ఆశ చూపి బాబు కావాలని అనటంతో సీరియల్ ఆసక్తిగా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram August 12th: ఆర్య జిండేతో బాబుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే వాళ్ళను లాక్ చేసి ఆ మాఫియా గ్యాంగ్ గురించి తెలుసుకోవాలని అంటాడు. తనకు తెలిసి డబ్బుకు ఆశపడి వాళ్ళు ఇలా చేస్తున్నారని అంటాడు ఆర్య. ఇక జిండే కూడా అవునని.. వాళ్ళు రాగానే అసలు సంగతి చూస్తానని అంటాడు. మరోవైపు మాఫియా గ్యాంగ్ బాబుని తీసుకొని వస్తారు.
ఇక ఆర్య బాబు కోసం అంతలా తాపత్రయ పడటంతో.. వెంటనే అను.. తను నీ బిడ్డ అని తెలియకపోయినా కూడా ఎంత ఆరాటపడుతున్నారని.. మీది చాలా గొప్ప మనసని అనుకోని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక క్యాబ్ రావడానికి గమనించి క్యాబ్ వైపు చూస్తారు. మరోవైపు మాఫియా గ్యాంగ్ లీడర్ కు ఒక అపరిచితుడు ఫోన్ చేసి రెండు కోట్లకు ఆశపడి కిడ్నాప్ చేసిన బాబుని తిరిగి వాళ్లకు అప్పగిస్తున్నావు.
కాబట్టి ఆ పిల్లాడిని నువ్వు వాళ్లకు అప్పగించవద్దు. వాడు నాకు కావాలని అంటాడు. అంతేకాకుండా ఐదు కోట్ల ఆఫర్ కూడా చేస్తాడు. దాంతో ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ డబ్బుకు ఆశపడి బాబుని అప్పజెప్తాను అని అంటాడు. ఇక ఆపరిచితుడు అడ్రస్ చెప్పగా ఆ అడ్రస్ కు పంపిస్తానని అంటాడు. వెంటనే ఆ గ్యాంగ్ లీడర్ తన మనిషికి ఫోన్ చేసి కారు వెనక్కి తిప్పమని.. బాబుని ఇవ్వాల్సింది వాళ్లకు కాదని.. అయిదు కోట్ల ఆఫర్ వచ్చింది అనటంతో వెంటనే అతడు సరే అంటాడు.
ఇక దగ్గరకు వస్తున్న కారులో అనుకు బాబు కనిపించడంతో నా బాబు అని అంటుంది. దాంతో ఆర్య కంగారు పడకు అని ధైర్యం ఇస్తాడు. ఇక కారు దగ్గర వరకు వచ్చి తిరిగి యూటర్న్ తీసుకోవడంతో వెంటనే జిండే, ఆర్య, నీరజ్ కార్ వెనకాల పరిగెడతారు. అను బాబు అని ఏడుస్తూ ఉండటంతో అంజలి ఓదారుస్తూ ఉంటుంది. ఆ కార్ మిస్ అవ్వటంతో జిండేతో ఆ కార్ ని ఫాలో అవ్వాలి అని అంటాడు.
ఆర్య కార్లో కూర్చొని మళ్లీ కారు వెనక్కి ఎందుకు తీసుకెళ్లారు అని ఆలోచనలో పడతాడు. ఇక జిండే మారువేషంలో రాగా జాగ్రత్తగా డీల్ చేయమని వారికి ఎటువంటి అనుమానం రాకుండా చేయమని అంటాడు ఆర్య. మరోవైపు మాఫియా గ్యాంగ్ కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బును పంచుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి జిండే వచ్చి వాళ్ళతో తన పేరు లంగర్ హౌస్ రంగా అని చెప్పి పరిచయం పెంచుకుంటాడు.
తను కూడా ఒక మాఫియా దందా చేసే వ్యక్తి అన్నట్లు వారితో పరిచయం పెంచుకొని.. ఒక ఆఫర్ చేస్తాడు. ఇక ఆఫర్ కు వాళ్లు ఆశపడగా.. మా భాయ్ దగ్గరికి తీసుకెళ్తాము అని అంటాడు. కానీ ఇప్పుడు కాదు రేపు ఇదే టైం కి రమ్మని అనడంతో దానికి జిండే ఓకే అంటాడు. మరోవైపు అను ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాబుని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రీతి, రేష్మ వచ్చి ఓదారుస్తుంటారు.
పాప ఏడవటంతో ఆకలి కోసం పాప ఏడుస్తుందని పాలు ఇవ్వమని రేష్మ అంటుంది. ఇక పాప ఏడుస్తుందంటే బాబుకి కూడా ఆకలి వేస్తుందని చాలా ఏడుస్తూ ఉంటుంది. తను బాగా ఏడవటంతో కళ్ళు తిరిగి కింద పడుతుంది. వెంటనే ప్రీతి నీరు చల్లడంతో స్పృహ నుండి బయటకు వేస్తుంది. అక్కడే ఉన్న పాప ఆకలితో బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అనుని పాలు తాగమని అనటంతో అను వద్దు అంటుంది. వాళ్ళు ఎంత బ్రతిమాలిన కూడా అను వద్దంటుంది.
దాంతో రేష్మ కు కోపం రావడంతో అనుపై చెయ్యి ఎత్తి మళ్ళీ దించి తను కూడా బాగా ఎమోషనల్ అవుతుంది. దగ్గరికి తీసుకొని ఓదార్చుతుంది. ధైర్యంగా ఉండమని అంటుంది. ఇక ప్రీతి ఆర్య కు ఫోన్ చేయగా రేష్మ ఆర్యతో భాను చాలా బాధపడుతుందని చెబుతుంది. దాంతో ఆర్య అనుతో బాబు ఆచూకి దొరికిందని ధైర్యంగా ఉండమని చెప్పటంతో అప్పుడు అను కాస్త కుదుటపడి పాలు తాగుతుంది. మరుసటి రోజు జిండే ఆ మాఫియా గ్యాంగ్ తో వెళ్తుంటాడు. వారిని ఆర్య వెనకాల నుండి ఫాలో అవుతాడు.
also read it : Trinayani August 11th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నయని, ఆస్తిలో వాట కావాలంటూ రచ్చ చేసిన సుమన?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial