Janaki Kalaganaledu మే 24 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీ సంగతి తెలుసుకొని జ్ఞానాంభ ఆగ్రహం- అత్తయ్యను ఎలా ఒప్పించాలో తెలియక తలపట్టుకున్న జానకి

అప్పు తీర్చడానికి వంటల పోటీల్లో పాల్గొనడమే ఉత్తమ మార్గమని భావించిన జానకీ... రామాను ఒప్పిస్తుంది. అప్లికేషన్‌పై సంతకాలు కూడా పెట్టిస్తుంది. కానీ జ్ఞానాంభ మాత్రం ఆగ్రహంతో ఊగిపోతుంది.

FOLLOW US: 

ఇంట్లో పూజ జరుగుతుండగానే రామాను బయటకు తీసుకెళ్తుంది జానకి. లూసీ వెళ్లిపోయేలా ఉందని... త్వరగా వెళ్లి అప్లికేషన్ ఇచ్చి వచ్చేసే బెటర్ అని చెబుతుంది. పూజ అయిపోయింది కదా అంటుంది. పూజ అయిన తర్వాత బయటకు వెళ్లకూడదని అమ్మ చెప్పారని గుర్తు చేస్తాడు రామా. పూజా ఫలం అందదేమో అన్న బయంతో అలా చెప్పి ఉంటారని... మంచి చేస్తామంటే తోడు ఉండి సాయం చేస్తాడే కానీ పగ సాధించడు కదా అంటుంది జానకి. అమ్మకి చెప్పకుండా వెళ్తే తిడతారనే భయం ఉందని... కానీ అంతకంటే ముందు చెఫ్‌ కాంపిటీషన్‌లో పాల్గొనడం ముఖ్యమని చెబుతుంది. మనం ఆలస్యం చేస్తే గొప్ప అవకాశం చేజారి పోతుందని ధైర్యం నూరిపోస్తుంది. తిరిగి వచ్చాక అత్తయ్యను ఒప్పించ వచ్చని అంటుంది.
అత్తయ్య అర్థం చేసుకుంటుందని.. అంతా మంచి జరుగుతుందని హోప్ ఇస్తుంది. మొత్తానికి రామాను ఒప్పించి బయటకు తీసుకెళ్తుంది. ఇదంతా విన్న పెద్దమ్మ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పేస్తుంది. 

బైక్‌పై వెళ్తూనే లూసీకి ఫోన్  చేస్తుంది జానకి. ఫోన్ కలవకపోవడంతో ఇద్దరూ టెన్షన్ పడతారు. అలా టెన్షన్ పడుతూనే లూసీ ఉండే గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు. ఆమె వెళ్లిపోయారని సెక్యూరిటీ గార్డ్ చెప్పడంతో ఇద్దరూ నిరాశలో కూరుకుపోతారు. కాస్త తేరుకొని వేగంగా వెళ్లి దారిలో లూసీతో మీట్ అవ్వొచ్చని బయల్దేరతారు. మొత్తానికి కారులో వెళ్తున్న లూసీని చేరకుంటారు. జరిగిన విషయాన్ని చెప్తారు. లూసీ వద్ద అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి ఇచ్చేస్తారు.  మూడు రోజుల్లో పోటీ ఉంటుందని త్వరగా హైదరాబాద్ రావాలని చెబుతుంది. కచ్చితంగా గెలుస్తారని చెప్పి లూసీ వెళ్లిపోతుంది.
 
జానకి, రామ కోసం ఇంట్లోని వారంతా వెయిట్ చేస్తుంటారు. పూజ మధ్యలో వదిలేసి వెళ్లిపోయారనే కోపంతో ఊగిపోతుంది జ్ఞానాంభ. ఇంతలో చిన్న కోడలు మల్లిక వస్తుంది. అందర్నీ ఒక చోట చూసి ఆశ్చర్యపోతుంది. ఏదో జరిగిందని అనుకుంటుంది. విషయం పెద్దమ్మ ద్వారా తెలుసుకొని ఆనందంతో గెంతులేస్తుంది. తన ముందు జానకిని అత్తయ్య  తిడుతుంటే చూడాలని ఆశపడుతుంది. 

ఇంతలో జానకి, రామ ఇద్దరూ వస్తారు. వస్తూనే రామ ఏదో చెప్పాలని ట్రై చేస్తాడు... వద్దని వారిస్తుంది జ్ఞానాంభ. పక్కనే ఉన్న కోడలని తిట్టిపోస్తుంది. తన కుమారుడి ప్రాణమంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తుంది. నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే... ఆయుష్సు పూజ మధ్యలో వదిలేసి ఎలా వెళ్లావని ప్రశ్నిస్తుంది. అసలు ఏమనుకుంటున్నావని నిలదీస్తుంది. నా మాటంటే విలువలేదా... నా కొడుకంటే విలువలేదా అని క్వశ్చన్ చేస్తుంది. గోవిందరాజు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నా జ్ఞానాంభ వినిపించుకోదు. ఇంతలో చిన్న కోడలు మల్లీ కలుగజేసుకొని జానకిని ఎత్తిపొడుస్తుంది. పెట్రోల్ పోస్తున్న విషయాన్ని తెలుసుకున్న గోవిందరాజు అడ్డు చెప్తాడు. 

పూజ రోజున రామను ఎందుకు బయటకు తీసుకెళ్లావని నిలదీస్తుంది జ్ఞానాంభ. మాస్టర్ చెఫ్ పోటీల అప్లికేషన్ పూర్తి చేయడానికి వెళ్లామని అసలు విషయం చెబుతుంది. ఆ మాట విన్న జ్ఞానాంభ ఆగ్రహంతో ఊగిపోతుంది. తాను వద్దని చెప్పాక కూడా పోటీలకు ప్రిపేర్ చేస్తున్నావంటే నీ ధైర్యం ఏంటని ప్రశ్నిస్తుంది. ఒప్పుకోనని ముందే చెప్పినా ఏ ధైర్యంతో ఈ పని చేశావని అడుగుతుంది. ఇంకోసారి వంటల పోటీ ప్రస్తావన ఇంట్లో వస్తే మర్యదగా ఉండదని జానకికి వార్నింగ్ ఇస్తుంది జ్ఞానాంభ.  

Published at : 24 May 2022 09:13 AM (IST) Tags: janaki kalaganaledu serial janaki kalaganaledu serial today Janaki Kalaganaledu latest episode Janaki Kalaganaledu Today Episode Janaki Kalaganaledu Telugu Serial Janaki Kalaganaledu May 24th Episode Janaki Kalaganaledu 307 Episode Janaki Kalaganaledu 24th May Episode 307

సంబంధిత కథనాలు

Ennenno Janmala Bandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి

Ennenno Janmala Bandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి

Janaki Kalaganledu July 7th Update: చూపు తిప్పుకోలేనంత అందంగా జానకి, తప్పించుకునేందుకు రామా తిప్పలు

Janaki Kalaganledu July 7th Update: చూపు తిప్పుకోలేనంత అందంగా జానకి, తప్పించుకునేందుకు రామా తిప్పలు

Gruhalakshmi July 7th Update : ప్రేమ్ ని అక్కున చేర్చుకున్న తులసి, అంకిత-అభిల మధ్య గొడవ

Gruhalakshmi July 7th  Update : ప్రేమ్ ని అక్కున చేర్చుకున్న తులసి, అంకిత-అభిల మధ్య గొడవ

Guppedantha Manasu జులై 7 ఎపిసోడ్: క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి

Guppedantha Manasu జులై 7 ఎపిసోడ్:  క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి

Devatha Serial July 7th Update: తన కన్నింగ్ ఆలోచనలు బయట పెట్టిన మాధవ, దేవిని స్కూల్ లో చేర్పించిన ఆదిత్య- మాధవ కుట్ర నుంచి రాధ ఎలా తప్పించుకుంటుంది?

Devatha Serial July 7th Update: తన కన్నింగ్ ఆలోచనలు బయట పెట్టిన మాధవ, దేవిని స్కూల్ లో చేర్పించిన ఆదిత్య- మాధవ కుట్ర నుంచి రాధ ఎలా తప్పించుకుంటుంది?

టాప్ స్టోరీస్

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

YSRCP Permanent President : వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ! ఎందుకంటే ?

YSRCP Permanent President :  వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ! ఎందుకంటే ?

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?