Jagadhatri Serial Today September 23rd: జగద్ధాత్రి సీరియల్: ఆడపిల్ల జోలికి వస్తే ఏ మృగానికైనా ఇదే దుస్థితి! విజిల్స్ వేయించే సీన్!
Jagadhatri Serial Today Episode September 23rd విక్కీని జేడీ సమక్షంలో కేడీ దారుణంగా హింసించి చంపి ప్రతీకారం తీర్చుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మీనన్‌తో కలిసి విక్కీ తాగుతూ ఉంటాడు. మంచి మూడ్ వస్తుంది భాయ్ అని విక్కీ అనగానే మీనన్ మనిషి మళ్లీ రోడ్డు మీద పోయే దాన్ని తీసుకురమ్మని చెప్తావా.. దాన్ని చంపేస్తావా అని అడుగుతాడు. దానికి విక్కీ ఆ కిక్ నీకు తెలీదురా.. బ్లేడ్‌తో కోస్తూ ఉంటే అది అరుస్తూ ఉంటే ఆ కిక్ వేరే అని అంటాడు. ఒక్క అరగంట వదులు భాయ్ ఎవరో ఒకదాన్ని తీసుకొచ్చుకుంటా అని అంటాడు. మందు అయిపోని అని మీనన్ అనగానే.. భాయ్ ఒప్పుకున్నాడు ఇక ఎవరో ఒకదాన్ని చూసుకుంటా అని విక్కీ మనసులో అనుకుంటాడు.
ఇంతలో మీనన్ ఇంట్లో కరెంట్ పోతుంది. మీనన్ కరెంట్ ఆఫీస్‌కి కాల్ చేస్తాడు. లైన్ మెన్ వస్తాడని చెప్తారు. కేథార్ లైన్‌మ్యాన్‌లా ఎంట్రీ ఇస్తారు. బ్లూటూత్‌లో జేడీతో మాట్లాడుతూ ఉంటాడు. మీనన్, విక్కీ ఇక్కడే ఉన్నారని చెప్తాడు. మెయిన్ చూడ్డానికి కేడీని ఓ మనిషి లోపలికి తీసుకెళ్తాడు. కేడీ పెద్ద స్కూడ్రైవర్తో అతన్ని చంపేస్తాడు. కరెంట్ ఇంకా రాలేదు ఏంట్రా అని మీనన్ అంటే ఇంకో రౌడీ చూడటానికి వెళ్తాడు. వాడిని కేడీ వేసేస్తాడు. దాంతో కరెంట్ ఇంకా రాలేదని చూస్తా నేనే వెళ్తా విక్కీ వెళ్తాడు. విక్కీ ముఖానికి క్లాత్ చుట్టీ కేడీ తీసుకెళ్లిపోతాడు. ఇంకా ఎవరూ రాలేదు.. పవర్ కూడా రాలేదని మీనన్ దేవాని పంపిస్తాడు. దేవా చూసి లోపల ఇద్దరు రౌడీలు పడిపోవడం విక్కీ లేకపోవడంతో మీనన్ని పిలుస్తాడు. జేడీ జేడీ తాయారుకి ఏం సమాధానం చెప్పాలి అని మీనన్ అనుకుంటాడు.
ఉదయం జేడీ, కేడీ, రమ్య, కిరణ్‌లు ఓ ప్లేస్‌కి వస్తారు. ఇక్కడికి ఏంటి సార్ వచ్చాం అని రమ్య అడుగుతుంది. దానికి కేడీ అదే రమ్య రాత్రి విక్కీ గాడిని తీసుకెళ్లాం కదా వాడిని ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు. దానికి జేడీ అదే రమ్య వాడిని జైలుకి అప్పగిస్తే వాళ్ల అమ్మ హోం మినిస్టర్ కదా శిక్ష పడకుండా చూసుకుంటుంది కదా అని అంటుంది. వాడిని ఏం చేయాలి అంటావ్ రమ్య అని కేడీ అడుగుతాడు. దానికి రమ్య మీరు నా కంటే పై అధికారులు కదా సార్ నన్ను అడిగితే నేనేం చెప్తా అని అంటుంది. కేడీ రమ్యతో నువ్వు పోలీస్‌వి కాదు ఓ సాధారణ అమ్మాయివే అనుకో ఇలా ఒకమ్మాయిని దారుణంగా హింసించి చంపిన వాడి గురించి తెలిస్తే నీకు ఏం అనిపిస్తుంది..వాడిని ఏం చేయాలి అనిపిస్తుంది అని అడుగుతాడు. ఓ సామాన్యురాలిగా అయితే నాకు ఏం అనిపిస్తుంది అంటే వాడు కానీ నాకు దొరికితే వాడి కాళ్లు చేతులు విరగ్గొట్టి.. వాడి పార్టులు పార్టులుగా కోసి అందరూ చూస్తుండగా వాడి శవాన్ని వేలాడదీయాలి అనిపిస్తుంది సార్ అంటుంది.
రమ్య మాటలకు కేథార్ అవునా రమ్య నీకు అలాగే అనిపిస్తుందా.. అయితే ఒక్క సారి అటు చూడు అని అంటాడు. కాస్త దూరంలో ఓ చెట్టుకి విక్కీ శవం తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో కేడీ విక్కీని తీసుకొని జగద్ధాత్రి దగ్గరకు వెళ్తాడు. ఇద్దరినీ విక్కీ చూసి జగద్ధాత్రి, కేథార్ మీరేనా జేడీ, కేడీలు అని షాక్ అయిపోతాడు. నన్ను ఏమైనా చేస్తే మీ అమ్మ మిమల్ని చంపేస్తుందని అంటాడు. జేడీ నవ్వి మీ అమ్మ మమల్ని చంపుతుందో లేదో మాకు తెలీదు కానీ మేం నిన్ను ఇప్పుడే చంపేస్తాం అంటారు.
విక్కీ పారిపోవడానికి ప్రయత్నిస్తే కేడీ చితక్కొడతాడు. జేడీ కుర్చీ మీద కాస్త దూరంలో కూర్చొని వాడు అరుపులు నాకు వినపడాలి అంటుంది. కేడీ విక్కీని పచ్చడి పచ్చడి కొడతాడు. కాళ్లు చేతులు విరిచేస్తాడు. ప్రైవేట్ పార్ట్ మీద కొడతాడు. ఆడపిల్లలు అంటే అంత అలుసు అయిపోయిందారా.. ఆడపిల్లని బతకనివ్వర్రా అని కొడతాడు. విక్కీ సంధ్యని ఎలా కట్ చేసి కట్ చేసి చంపుతాడు అలాగే కేడీ కూడా విక్కీని చాకుతో పొడిచి పొడిచి ప్రైవేట్ పార్ట్ కట్ చేసేస్తాడు. వీక్కీ ఆర్తనాదాలు మిన్నంటుతాయి. విక్కీ చనిపోగానే కుక్కని ఈడ్చినట్లు కేథార్ ఈడ్చీ చెట్టుకు వేలాడదీస్తాడు. సంధ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు జేడీ, కేడీ చాలా హ్యాపీగా ఫీలవుతారు.
జేడీ, కేడీలు చేసిన పనికి రమ్య, కిరణ్‌లు గర్వంతో సెల్యూట్ చేస్తారు. ఇలా చూసిన వాళ్లకి ఆడపిల్ల జోలికి రావాలి అంటే దడ పుడుతుంది మేడం సంధ్య ఆత్మకి ఇప్పుడు శాంతి కలుగుతుంది అని రమ్య అంటుంది. ఇక వెంటనే తాయారుకి మిగతా పోలీసులకు సమాచారం ఇస్తారు. సాధుసార్ వచ్చి విక్కీని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతారు. చాటుగా మీనన్ చూసి నా కళ్లు కప్పి నా దగ్గర నుంచే వాడిని తీసుకెళ్లి చంపేస్తావా.. నిన్ను అంత తేలికగా వదలను జేడీ అనుకుంటాడు. తాయారు వచ్చి విక్కీని చూసి ఏడుస్తుంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు మేడం అని సాధుసార్ అంటే తాయారు కొట్టడానికి వెళ్తుంది. తాయారు తమ్ముడు ఆపుతాడు. సాధుసార్ బాడీని మేడంకి చూపించి పోస్ట్‌మార్టంకి పంపండి మేడం గుండె రాయి చేసుకోండి అని చెప్తాడు.
తాయారు ఏడుస్తూ నీకు ఈగతి పట్టింది ఏంట్రా అనుకుంటుంది. ఆడపిల్ల జోలికి వచ్చే వాడి గతి ఇంతే అని జేడీ మనసులో అనుకుంటుంది. డాక్టర్ విక్కీని చూస్తుంది. కిడ్నాప్ చేసిన వారు అతని మీద ఎంతో పగతో రగిలిపోయారని.. వాళ్లు మామూలుగా చంపలేదు.. ఎముకలు విరిగిపోయేలా.. చాకుతో ఎక్కడ పడితో అక్కడ కోసేశారు. నరాలు తెగిపోయాయి.. ఎముకలు విరిగిపోయాయి.. అతను బతికుండా గానే అతని ప్రైవేట్ పార్టులను కోసేశారు. దారుణంగా చంపేశారని డాక్టర్ చెప్పడంతో అయ్యయ్యో అని జేడీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















