అన్వేషించండి

Jagadhatri Serial Today September 20th: జగద్ధాత్రి సీరియల్: సంధ్యని గ్యాంగ్‌ రేప్‌ చేసి నరకం చూపించి విక్కీకి జేడీ వేసే శిక్షేంటి?

Jagadhatri Today Episode Sep 20th తాయారు కొడుకు విక్కీ సంధ్యని దారుణంగా హింసించి చావు బతుకుల్లోకి తీసుకు రావడం విక్కీ కేసు కోసం జేడీ, కేడీలు కొత్త అవతారం ఎత్తడంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తిరంగా మారాయి.

Jagadhatri Serial Today Episode మాధురి ప్రెగ్నెంట్ అని ఇంటికి వచ్చి అందరితో సంతోషంగా తన గుడ్‌న్యూస్ పంచుకుంటుంది. అందరూ చాలా సంబరపడిపోతారు. కానీ మాధురి భర్త వంశీ, మాధురి అత్త వచ్చి మాధురి చెప్పకుండా వచ్చేసిందని కోప్పడతారు. మీరు పంపనందుకే వచ్చేశా అని మాధురి అంటుంది. అసలు పుట్టింటికి పంపకూడదు అనుకునేంత తప్పు మాధురి ఏం చేసిందని జగద్ధాత్రి ప్రశ్నిస్తుంది.  దానికి వంశీ యువరాజ్‌ ఓ నేరస్తుడని అందుకే ఇలాంటి క్రిమినల్స్ ఉన్న ఇంటితో మాకు సంబంధాలు వద్దని అనుకున్నాం అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. వంశీ, యువరాజ్ గొడవ పడతారు. నిజానికి వంశీ చాలా దారుణంగా మాట్లాడుతాడు. నా పుట్టింటిని నాకు దూరం చేయాలని చూస్తే ఊరుకోను అని మాధురి అంటే వంశీ మాధురిని కొట్టడానికి వెళ్తాడు.  

భార్య కడుపుతో ఉందన్న కనీస బాధ్యత లేకుండా వంశీ ప్రవర్తనకు యువరాజ్, కేథార్ ఇద్దరికీ  కోపం వచ్చి వంశీని వాయించడానికి వెళ్తారు. మా చెల్లి జోలికి వస్తే బావ అని కూడా చూడమని వార్నింగ్ ఇస్తారు. సుధాకర్ కలుగజేసుకొని కొడుకుల్ని కోప్పడి వంశీకి సర్ది చెప్పి మాధురిని తీసుకెళ్లేలా ఒప్పిస్తాడు. అయితే వంశీ తన భార్యకు జరిగే ఏ ఫంక్షన్‌లోనూ యువరాజ్ ఉండకూదు అని కండీషన్‌ పెడతాడు. వంశీ మాధురిని తీసుకొని వెళ్తాడు.  

వైజయంతి శ్రీవల్లి సంగతి తేల్చాలి అని అనాథాశ్రమానికి బయల్దేరుతుంది. శ్రీవల్లి సుహాసిని కూతురని కేథార్‌కి సొంత చెల్లని తెలుసుకుంటుంది.  కేథార్ దగ్గరకు జగద్ధాత్రి వెళ్లి శ్రీవల్లి అనాథాశ్రమం పేరు చెప్పగానే అత్తయ్య షాక్ అయిపోయారు.. ఈ రోజు చాలా ప్రశ్నలు అడిగారు.. ఏదో అనుమానంగా ఉందని చెప్తుంది. శ్రీవల్లిని అడగాలి అనుకుంటుంది. ఇక మాధురి ఫ్రూట్స్ కావాలి అనడంతో వంశీ టైం అయిపోతుందని తనకు పని ఉందని చెప్పి మాధురిని ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్లిపోమని చెప్తాడు. మాధురి ఫ్రూట్స్ కొనడానికి వెళ్తుంది. అక్కడే ఉన్న హోంమినిస్టర్ తాయారు కొడుకు విక్కీ.. మాధురి మీద కామెంట్స్ చేస్తాడు. మాధురి విక్కీని చెప్పుతో కొట్టడంతో మాధురిని పాడు చేయాలి అని కారులో ఎక్కించుకొని వెళ్లిపోతాడు.  సంధ్య అది చూసి జగద్ధాత్రికి కాల్ చేస్తుంది. ఇంతలో సంధ్య జగద్ధాత్రికి కాల్ చేసి కేథార్ గారి చెల్లి మాధురి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు నేను ఆ కారుని ఫాలో అవుతున్నాను అని చెప్తుంది. జగద్ధాత్రి కేథార్‌కి విషయం చెప్తుంది.  

జేడీ, కేడీలు గన్‌లు తీసుకొని బయల్దేరుతారు. రమ్య సంధ్య లొకేషన్ ట్రేస్ చేసి మాధురిని హోంమినిస్టర్‌ కొడుకు విక్కీ తీసుకెళ్లాడని తెలుసుకొని గెస్ట్ హౌస్‌కి వెళ్తారు. విక్కీ పిచ్చోడిలా ఆడుకుంటా రండిరా.. అని నాటకం మొదలు పెడతాడు. జగద్ధాత్రి, కేథార్‌లు ఒకమ్మాయిని ఎవరో కిడ్రాప్ చేశార్‌రా మేం వెతకాలి అని అంటే విక్కీ మీరు వెళ్లొద్దు ఇంటికి వెళ్లిపోండి అని చిన్న పిల్లాడిలా మారాం చేస్తే జేడీ, కేడీలు విక్కీని వాయించేస్తారు. జేడీ, కేడీలు గెస్ట్ హౌస్‌కి వచ్చి మొత్తం వెతుకుతూ ఉండటంతో విక్కీ తాయారుకి కాల్  చేసి విషయం చెప్పడంతో తాయారు వెంటనే జేడీకి కాల్ చేసి తన గెస్ట్‌ హౌస్‌ వెతుకుతున్నావ్ అంట.. పిచ్చి పిచ్చిగా ఉందా.. వెంటనే వెళ్లిపోండి అని సెర్చ్ వారంటీ ఉంటే రండి అని పంపేస్తుంది.  

విక్కీ అతని రౌడీలు సంధ్య మీద సామాజిక అత్యాచారం చేస్తారు. సంధ్యతో దారుణంగా ప్రవర్తిస్తారు. మందు తాగించి బ్లేడ్‌లతో ప్రైవేట్ పార్ట్‌లు కట్ చేసి చిత్ర హింసలు పెట్టి శునకానందం పొందుతారు. విక్కీ రౌడీలతో సంధ్య చనిపోయి ఉంటే గోయి తీసి పాతేయమని  చెప్తాడు. మాధురి కనిపించడం లేదని ఇంట్లో తెలిసి అందరూ ఏడుస్తారు.   మాధురి కనిపించలేదని ఇంట్లో అందరూ కంగారు పడతారు. వంశీ మాత్రం దారుణంగా మాట్లాడుతాడు. యువరాజ్ వంశీనే ఏదో చేసుంటాడు అని అంటాడు. అంతా ఆ తల పొగరుదాని వల్లే వచ్చింది. దాన్ని మీరు అలా పెంచారు.. అది మీ తప్పు అని మాట్లాడుతాడు. 

జగద్ధాత్రి కోపంగా ఏం మాట్లాడుతున్నావ్ వంశీ భార్య అంటే కనీసం బాధ్యత లేదు.. బాధ లేదు.. తను అంటే నీకు అస్సలు ఇష్టం లేనట్లు మాట్లాడుతున్నావ్ ఎంత ఊరుకుందామన్నా నీ మాటలే అలా మాట్లాడేలా చేస్తున్నాయి అని అంటుంది. వైజయంతి ఏడుస్తూ అదే కదా నా కూతురు కనిపించడం లేదని మనమంతా బాధ పడుతున్నా భార్య గురించి కనీసం బాధ్యత లేదు ఏం పట్టనట్లు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని అంటుంది. నేను ఇలాగే మాట్లాడుతా అని వంశీ అంటే నువ్వు ఇంత వెధవ  అని తెలీక నీకు ఇచ్చి పెళ్లి చేశాం లేదంటే అస్సలు చేసేవాళ్లం కాదని యువరాజ్ అంటాడు. నన్నే వెధవ అంటావా అని వంశీ గొడవకు దిగుతాడు. అరిచావ్ అంటే బాగోదు అని యువరాజ్ అంటే నీ చెల్లికి నీ వెధవ బుద్ధులే వచ్చాయ్.. మాటలు వినకపోతే అనుభవిస్తుంది కదా అని దారుణంగా మాట్లాడుతాడు. 

కౌషికి, సుధాకర్ గొడవ వద్దని అంటారు. మాధురిని వెతికే పని చూడకుండా ఈ గొడవలు ఎందుకురా అని సుధాకర్ ఏడుస్తూ కొడుకుతో చెప్తాడు. సంతోషంగా వచ్చింది మళ్లీ తనని అలా చూస్తానా లేదా అని భయంగా ఉందిరా.. తనకు ఏమైనా అయితే నేను బతకలేనురా అని సుధాకర్ ఏడుస్తాడు. కౌషికి బాబాయ్‌కి ధైర్యం చెప్తుంది. యువరాజ్ మనసులో నా చెల్లి ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తా దీనికి కారణం అయిన వాళ్లని మాత్రం వదలను అని అనుకుంటాడు. 

కేథార్ జగద్ధాత్రితో చెల్లికి ఏమైనా అయితే నాన్న మనకు దక్కరు జగద్ధాత్రి.. సాక్ష్యాలు కోసం ఆగడం ఏంటి జగద్ధాత్రి మాధురితో పాటు సంధ్య కూడా ప్రమాదంలో ఉంది.. ఇలా అయితే ఎలా ధాత్రి అని అంటాడు. కొంచెం వెయిట్ చేద్దాం అని జగద్ధాత్రి అంటుంది. ఇంతలో జగద్ధాత్రికి రమ్య కాల్ చేసి ఆ కార్ నెంబరు హోం మినిస్టర్ తాయారు పేరు మీద రిజిస్టర్‌ అయిందని చెప్తుంది. కేథార్ ధాత్రితో సాక్ష్యం వచ్చేసింది.. వాడి తల్లి పేరుతో ఉన్న కారుని వాడు వాడుతున్నాడు  వాడు పని చెప్దాం పద అంటే ఆ కారులో మాధురి ఉందని సాక్ష్యం చూపించ లేకపోతే సెర్చ్ వారెంటీ ఇవ్వరు.. ఇక స్ట్రైట్‌గా వెళ్తే లాభం లేదు సాధు సార్ సాయం తీసుకొని వేరే రూట్లో వెళ్లాల్సిందే అని సాధు సార్‌కి కాల్ చేస్తుంది. విషయం చెప్తుంది. ఇంత జరిగితే నాకు ముందే ఒక మాట చెప్పాలి కదా.. అయినా సాక్ష్యాలు ఏం అవసరం లేదు.. ఇద్దరు ప్రాణాలు మనకి ముఖ్యం ఏం చేస్తారో చేయండి.. ఈరోజు రాత్రికి వాడి కథ ముగించేయండి.. కానీ సాక్ష్యాలు ఉండకూడదు.. నేను పర్మిషన్ ఇస్తున్నా వెళ్లండి అని అంటారు. 

జేడీ, కేడీతో పాటు మరో ఇద్దరు నలుపు రంగు బట్టలు వేసుకొని ముఖానికి నలుపు రంగు పూసుకొని లొకేషన్‌కి వచ్చేస్తారు. సిగ్నల్‌ రాకుండా జామర్‌ వాడుతారు. సంధ్యని అందరూ కలిసి రేప్ చేయడంతో ఒంటి నిండా గాయాలు అయి చావు బతుకుల మధ్య ఉంటుంది.  మాధురి మీదకు విక్కీ వెళ్తే మాధురి తను ప్రెగ్నెంట్ అని వదిలేయమని వేడుకుంటుంది. అయినా విక్కీ వదలడు.. పోలీసులు వచ్చారని తెలిసి విక్కీ చాలా భయపడతాడు.  విక్కీ మాధురికి గన్ గురి పెట్టి జేడీ వాళ్ల మీద అరుస్తాడు. అందరూ గన్‌లు పట్టుకొని వెళ్లబోతే ముందు వస్తే దీని తల పేలిపోతుంది అని అంటాడు. మాధురిని అడ్డుపెట్టుకొని తప్పించుకుంటాడు. మాధురి ఏడుస్తూ సంధ్య పరిస్థితి ఎలా ఉందో తెలీదు అని చెప్తుంది. 

జేడీ కేడీలు సంధ్య దగ్గరకు వెళ్లే చూసి షాక్ అయిపోయి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. సంధ్య కండీషన్ సీరియస్‌గా ఉందని తన మీద గ్యాంగ్ రేప్ జరిగిందని దారుణం మొత్తం డాక్టర్ వివరిస్తుంది.  సంధ్య బతకడం కష్టం.. తన మీద సామూహికంగా అత్యాచారం చేశారు. మందు తాగించారు.. ప్రైవేట్‌ పార్టుల్లో కట్ చేసి దారుణంగా హింసించారు. తనకి ఎక్కువ టైం లేదు చివరి వాగ్మూలం తీసుకోండి అంటుంది. జేడీ, కేడీ, రమ్య కిరణ్ ఏడుస్తూ సంధ్య దగ్గరకు వెళ్తారు. కేడీ ఏడుస్తూ సంధ్య ఇలా అడగటం చాలా కష్టంగా ఉంది నన్ను నీ అన్నయ్య అనుకొని చెప్పమ్మా అని అంటాడు. నాకు తోడబుట్టిన వాళ్లు లేరు నేను బతుకుతానో లేదో తెలీదు కానీ వాళ్లు బతకకూడదు అన్నయ్య వాళ్లని నడిరోడ్డు మీద ఉరి తీయాలి అంటుంది. మీ అన్నయ్య అడుగుతున్నాడని చెప్పమ్మా నువ్వు చెప్పే ప్రతీ మాట వాడిని చంపడానికి ఉపయోగపడుతుందని అంటాడు. హోం మినిస్టర్ కొడుకు అని సంధ్య జరిగింది అంతా చెప్తుంది. వాడిని వాడి గ్యాంగ్‌ని వదలకూడదు అన్నయ్య అని అంటే వాడి గ్యాంగ్ లేదమ్మా వాడు ఒక్కడే తప్పించుకున్నాడు అని కేడీ అంటాడు. వాడు హోం మినిస్టర్ కొడుకు ఈజీగా తప్పించుకుంటాడు. వాడిని వదలను అని మాటివ్వు అన్నయ్య అంటుంది. జేడీ, కేడీలు ఇద్దరూ మాటిస్తూ వాడిని నడిరోడ్డు మీద కుక్కని కాల్చి చంపుతాం.. అని మాటిస్తారు. ఇవీ ఈ వారం హైలెట్స్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్ - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్ - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్ - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్ - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Embed widget