Jagadhatri Serial Today July 24th: జగద్ధాత్రి సీరియల్: ద్ధాత్రికి నగలు ఇచ్చిన సుధాకర్.. నిషిక, వైజయంతిల ఆగ్రహం! కేథార్ ప్రేమకు అర్థం లేదా?
Jagadhatri Serial Today Episode July 24th జగద్ధాత్రికి సుధాకర్ నగలు ఇవ్వడం, కేథార్ కౌషికి కూతురి కోసం నగ కొంటానంటే యువరాజ్, నిషిక అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode తాయారు కొడుకు విక్కీ చేసిన అరాచకం గుర్తు చేసుకొని సుధాకర్ డీలా పడిపోతాడు. కౌషికి బాబాయ్‌తో ఒక సారి హాస్పిటల్‌కి వెల్దామని అంటుంది. సుధాకర్ వద్దని అంటాడు. నిషిక అందరితో పిచ్చోళ్లని ఇంట్లో పెట్టుకోవడం ఏంటో అని అంటుంది. యువరాజ్ అయితే తాయారుని తిడతాడు. ఇంతలో జగద్ధాత్రి వాళ్లు వస్తారు.
కౌషికి ఎదురెళ్లి మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటాడు. కాల్చింది ఎవరో చూడ్డానికి వెళ్లాం అలాగే వేరే పని ఉండి వెళ్లామని అంటారు. యువరాజ్ కేథార్‌తో ఏంటి కేథార్ నువ్వు కాల్చింది ఎవరో చూడటానికి వెళ్లావా లేదా పట్టుకోవడానికి వెళ్లావా అని అడుగుతాడు. వెంటనే నిషిక తనేమైనా పోలీస్ ఆఫీసరా అని అడుగుతుంది. ఇంతలో ఇంటికి నగలు తీసుకొని సేటు వస్తారు. ఎవరు పిలిపించారని సుధాకర్ అడిగితే నేనే పిలిపించానని బాబాయ్, పిన్నిల పెళ్లి రోజు వస్తుంది కదా గ్రాండ్‌గా చేద్దామని అందరూ నగలు తీసుకుంటారని సేటుని పిలిచామని అంటుంది.
సుధాకర్ కౌషికితో ఇప్పుడు ఎందుకు అవన్నీ ఒక్క దానివే ఏర్పాట్లు చేయలేవని అంటే జగద్ధాత్రి అందుకొని వదిన ఎందుకు చేస్తారు వదిన కూర్చొని ఆర్డర్ వేస్తే నేను కేథార్ చేసేస్తాం అంటుంది. దానికి యువరాజ్, నిషికలు ఇప్పుడు కరెక్ట్‌గా అర్థం చేసుకున్నారు. మీ స్థానం కరెక్ట్‌గా గుర్తు చేసుకున్నారు. మేం యజమానులం మేం చెప్పే పనులు చేసే పని వాళ్లు మీరు అని అంటారు. కౌషికి కోప్పడుతుంది. వాళ్లు సాయం చేస్తాం అన్నారు మీరు కనీసం అది కూడా అనలేదు.. బాధ్యత తీసుకోవడం చాలా కష్టం మాటలు అనేయొచ్చు అని అంటుంది.
వైజయంతి గొడవ ఆపడానికి నగలు చూపించమని సేటుతో చెప్తుంది. కౌషికి, నిషిక, వైజయంతి అందరూ నగలు చూస్తారు. జగద్ధాత్రి మాత్రం దూరంగా నిల్చొంటుంది. సుధాకర్ చూసి నగలు తీసుకుంటాడు. అది చూసిన నిషిక, వైజయంతి ఇంటి ఏకైక కోడల్ని నేనే కదా అత్తయ్య నా కోసం కొంటున్నారు అని అంటుంది. యువరాజ్ కూడా నువ్వు అంటే చాలా ఇష్టం నిషిక అంటాడు. కౌషికి జగద్ధాత్రిని కూడా తీసుకోమని చెప్తుంది. నా దగ్గర ఉన్నాయి వద్దు అని జగద్ధాత్రి అంటుంది. వైజయంతి, నిషిక కూడా తీసుకో మా ఇంటి ఫంక్షన్‌కి మా స్థాయికి తగ్గట్టు ఉండాలని అంటారు. కౌషికి చెప్పడంతో జగద్ధాత్రి తీసుకుంటుంది.
కేథార్ కూడా ఓ నగ నచ్చి తీసుకొని అపురూపంగా చూస్తాడు. కౌషికి చూసి ఏంటి అంత అపురూపంగా చూస్తున్నావ్ ఎవరికి సెలక్ట్ చేశావ్ అంటే కీర్తికి నా మేనకోడలి కోసం తీసుకుంటున్నా ఎప్పటి నుంచో కొనాలి అనుకున్నా అంటాడు. నిషిక, యువరాజ్‌లు మా డబ్బుతో మాకే గిఫ్ట్ ఇస్తారా అని గొడవకు దిగుతారు. నా డబ్బుతో కొందామని అనేలోపు మీరు గొడవ పడ్డారని అంటాడు. నీ ప్రేమ మాట అబద్ధం మోసం అని అందరికీ తెలుసని నటించొద్దు అని యువరాజ్ అంటాడు. వాళ్ల మాటలకు కేథార్ బాధతో వెళ్లిపోతాడు. కేథార్‌ని చూసి జగద్ధాత్రి కూడా నగ పడేసి వెళ్లిపోతుంది. సుధాకర్ యువరాజ్ వాళ్లతో మీకు ప్రేమించడం రాకపోతే మానేయండి అంతేకానీ ఎదుటి వాళ్ల మనసుని మీ మాటలతో విరిచేయకండి అని అంటాడు.
కేథార్ బాధ పడుతుంటే జగద్ధాత్రి వెళ్తుంది. కేథార్ జగద్ధాత్రితో నా ప్రేమని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు ద్ధాత్రి మనసుకి చాలా కష్టంగా ఉందని అంటాడు. దానికి జగద్ధాత్రి ఇవాళ పరాయి వాళ్లు అన్న వాళ్లే రేపు మా వాళ్లు అంటారు అని అంటుంది.సుధాకర్ వచ్చి జగద్ధాత్రి చెప్పింది నిజం కేథార్ మిమల్ని ప్రేమించకుండా ఎవరూ ఉండలేరు. ఈ ఇంటి వాళ్ల కోసం మీరు చాలా కష్టపడుతున్నారు అంటారు. కేథార్ తప్పు చేశాడు అంటే నేను నమ్ముతానేమో కానీ సుహాసిని కొడుకు తప్పు చేశాడంటే నేను నమ్మను అని అంటాడు. అది విన్న వైజయంతి, నిషిక కోపంతో రగిలిపోతారు. మీ ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్లు పిచ్చివాళ్లు అని సుధాకర్ అంటే అది విన్న నిషిక మామయ్య మనల్ని పిచ్చోళ్లు అంటున్నారు అంటుంది.
సుధాకర్ జగద్ధాత్రికి నగలు ఇస్తారు. నీ కోసమే తీసుకున్నా తీసుకోమ్మా అని చెప్తారు. అది చూసిన వైజయంతి నా చేతిలో మీ మామయ్య అయిపోతారు అంటుంది. నిషిక ఆపుతుంది. ఇక సుధాకర్ చాలా నగలు ఇస్తే జగద్ధాత్రి అన్ని వద్దు అంటుంది. నువ్వు ఈ ఇంటి కోడలిగా వచ్చిన తర్వాత ఏం ఇవ్వలేదు తీసుకోమ్మా అంటారు. ఇక కౌషికి వచ్చి ఇంటి ప్రేమ కావాలి అంటారు ఇంటి పెద్ద ప్రేమ చూపిస్తే తీసుకోరా అంటుంది. సుధాకర్ జగద్ధాత్రితో నేను నీకు నగలు ఇవ్వకూడదా అమ్మా అంటారు. అలా ఏంలేదు మామయ్య అంటుంది. కేథార్ తీసుకోమని జగద్ధాత్రికి సైగ చేస్తాడు. జగద్ధాత్రి తీసుకుంటుంది. కౌషికి బాబాయ్‌తో కేథార్ పర్మిషన్ లేకుండా తీసుకోదని అంటుంది.
జగద్ధాత్రి సుధాకర్‌తో ఈ నగలు నిషిక అక్కకి ఇచ్చామని ఇచ్చారా లేదంటే మీ కోడలిగా ఇచ్చారా అని అడుగుతుంది. సుధాకర్ జగద్ధాత్రితో దీనికి సమాధానం నేను ఇవ్వలేనమ్మా కానీ నా మనసులో ఏం ఉందో నీకు తెలుసు కదమ్మా అంటారు. కౌషికి జగద్ధాత్రి వైపు చూసి ఇది మీ హక్కు మీ హక్కు మీరు కోల్పోవద్దు అని అంటుంది. సుధాకర్‌ని నిషిక, వైజయంతి నిలదీస్తారు. నన్ను కాదని ఆ జగద్ధాత్రికి ఎందుకు నగలు ఇచ్చారు అని అడుగుతుంది. కృతజ్ఞతగా ఇచ్చాను వాళ్లు రోజు రోజుకు రుణపడి పోతున్నారు అందుకే ఇచ్చా.. అని అంటారు. ఉదయం అందరూ హాల్లో ఉంటే సురేశ్ తల్లి ఆదిలక్ష్మీ బిందెతో వచ్చి వైజయంతిని ఢీ కొడుతుంది. ఎందుకు బయటకు వచ్చారు ఆంటీ అని నిషిక అడిగితే నిషికకు ఒకటితగులుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?





















