అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 20th: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు

Jagadhatri Serial Today Episode July 20th: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి అడవిలోకి తీసుకెళ్లిన జేడీ,కేడీ వాడిని బతికి ఉండగానే తల వరకు పాతిపెట్టి వస్తారు. యువరాజును కలవడానికి సోనీ ఇంటికి రాగా....నిషిక కోపంలో కాఫీలో కారం కలిపి ఇస్తుంది. అది ఆదిలక్ష్మీ తాగి కుర్రోమొర్రో అంటుంది.
మీనన్‌ను పాతిపెట్టిన జేడీ
                          పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన మినిస్టర్ మనుషులను జేడీ,కేడీ ఇరగ్గొట్టి మీనన్‌ను తీసుకుని వెళ్లిపోతారు. మీడియాలో అంతా రౌడీలు పోలీసుస్టేషన్‌పై దాడి చేసి మీనన్‌ను ఎత్తుకెళ్లిపోయారని అనుకుంటారు. కానీ జేడీ,కేడీలు మారువేషంలో మీనన్‌ను ఎత్తుకెళ్లిపోతారు. నిర్మాణనుష్యమైన అటవీ ప్రాంతానికి మీనన్‌ను తీసుకెళ్లిపోతారు. ఎవరూ లేని అడవిలో తలవరకు గోతి తీసి కప్పిపెడతారు. ఇంతలో మినిస్టర్‌ ఫోన్ చేసి బెదిరించగా....అతనికి ధాత్రి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికి మీనన్‌ పని అయిపోయిందని...ఆరుగురు పిల్లలను చంపిన నిన్ను కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తుంది.  మీనన్‌ను చంపకుండా వదిలిపెట్టడంతో అతను ఎంతో బ్రతిమలాడతాడు. మీరు చెప్పినట్లే కోర్టులో అన్ని నేరాలు ఒప్పుకుంటానని చెబుతాడు. ఇన్ని పాపాలు చేసిన నీకు బతికే హక్కులేదని అందుకే చచ్చిపొమ్మని జేడీ అంటుంది. నీలాంటి పాపిని చంపే పాపం మాకు వద్దని అందుకే ప్రాణాలతో పాతిపెట్టి వెళ్తున్నామని చెబుతుంది. ఈ అడవిలో పులులు, పాములు చాలా ఉంటాయని హెచ్చరిస్తుంది. ఆకలితో చచ్చిపోతావో లేక భయంతో చచ్చిపోతావో, లేక ఏదైనా క్రూర మృగాలకు ఆహారమైపోతావో నీ ఇష్టమని చెబుతుంది. నువ్వు ఎంత గట్టిగా అరిచి మొత్తుకున్నా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక్కరూ నిన్ను కాపాడలేరని చెబుతుంది. అలాగే మీనన్ అరుస్తున్నా వినిపించుకోకుండా జేడీ, కేడీ వెళ్లిపోతారు.
యువరాజు ఇంట్లో సోనీ
                     మీనన్‌ పని అయిపోయింది కాబట్టి మనం హనీమూన్‌కు వెళ్దామని కేదర్‌ జగధాత్రిని అడుగుతాడు. అయితే ఆదిలక్ష్మి అత్తయ్యగారికి కూడా టిక్కెట్ బుక్‌ చేయమని చెబుతుంది. ఇప్పుడు ఆమె ఎందుకని అడగ్గా...మనం లేకుంటే మీ అక్కను టార్చర్‌ పెట్టకుండా ఉండటానికి అని మాట్లాడుకుంటుండగా సోనీ వస్తుంది. సోనీని చూడగానే జగధాత్రికి కోపం  వచ్చి నిలదీయడానికి వెళ్తుండగా....నిషిక, వైజయంతి వస్తారు. ఎంత ధైర్యం ఉంటే మళ్లీ  నా ఇంటికి వస్తావు అని నిషిక మండిపడుతుంది. సోనీపై చేయిచేసుకుంటడగా యువరాజు వచ్చి ఆపుతాడు. తప్పు చేసిన మీ అక్కను ఇంట్లో ఉంచుకుని బయటవాళ్లపై జులుం ఏంటని అంటాడు. మీ అక్క చెప్పబట్టే ఇలాంటి పని చేసిందిని సోనీ వచ్చి నాకు చెప్పుకుని బాధపడిందని అంటాడు.అయినా సరే ఈ సోనీ నీ ఆఫీసులో ఉండటం ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు  ఉంచుకున్నావని నిషిక మండిపడుతుంది. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందామని...నువ్వు వెళ్లి సోనీకి కాఫీ పెట్టకుని రమ్మని అంటాడు. 
కాఫీలో కారం కలిపిన నిషిక
                             యువరాజుపై పిచ్చకోపంతో ఉన్న నిషిక కాఫీలో కారం, ఉప్పు కలిపి తీసుకొస్తుంది. సరిగ్గా సోనీకి కాఫీ ఇచ్చేసమయానికి అక్కడికి వచ్చిన ఆదిలక్ష్మీ....గంట నుంచి కాఫీ అని అరుస్తుంటే ఒక్కరూ పట్టించుకోరేంటని అంటూ సోనీ కోసం తెచ్చిన కాఫీ తీసుకుంటుంది. ఆ కాఫీ తాగొద్దని జగధాత్రి, కేదార్‌, నిషిక చెబుతున్నా వినకుండా తాగుతుంది. కారం మండిపోవడంతో అరుచుకుంటూ కిచెన్‌లోకి వెళ్లిపోతుంది. నన్ను చంపడానికే కాఫీలో కారం కలిపి ఇచ్చారని గొడవపెట్టుకుంటుంది. అసలు మేం వద్దు అని మొత్తుకుంటున్నా వినకుండా కాఫీ లాక్కుని తాగింది మీరని...మళ్లీ మేము కావాలని నీకు కాఫీ ఇచ్చినట్లు గొడవపెట్టుకుంటున్నావేంటని నిషిక నిలదీస్తుంది.అయితే కాఫీలో కారం ఎందుకు కలిపారని కౌషికి అడుగుతుంది. అది వేరే వాళ్ల కోసం కలిపామని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget