Jagadhatri Serial Today JULY 14th:మినిస్టర్, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్
Jagadhatri Serial Today Episode July 14th:మినిస్టర్, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. యువతీ యువకుల కిడ్నాప్ వెనక ఉన్నది హెల్త్‌మినిస్టర్ అని తెలుసుకున్న జేడీ,కేడీ ఇద్దరినీ అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తారు. కేసు కోర్టులో నిలబడాలంటే సాక్ష్యాలు కావాలని సాదూ చెప్పడంతో జేడీ కొత్తప్లాన్ వేస్తుంది. శ్రీవల్లి క్షేమంగా ఇంటికి చేరడంతో సుధాకర్,కౌషికి ఊపిరి పీల్చుకుంటారు.
మీనన్ చేతికి బేడీలు
జేడీ,కేడీలను దారి మళ్లించానని వాళ్లపై గెలిచానని సంబరపడిపోతున్న మీనన్‌కు జేడీ షాక్ ఇస్తుంది. నేరుగా ఫాంహౌస్‌కు వచ్చి హాయ్ చెబుతుంది. మేం నీ ట్రాప్‌లో పడిపోయామని నువ్వు అనుకున్నావని...కానీ నువ్వే మా ట్రాప్‌లో పడిపోయావని తెలుసుకోలేకపోయావని అంటుంది. మేం ఫాలో అయ్యింది నీ కారును కాదని...రమ్య చేతికిఉన్న వాచ్‌లో పెట్టిన ట్రాకర్‌ను అని చెప్పడంతో మీనన్ షాక్ తింటాడు. నువ్వు అనుకున్నట్లే మార్చిన కారు వెంట మేం తిరుగుతున్నామని అనుకున్నావని....కానీ మేం మాత్రం నీ గుట్టు తెలుసుకునే నేరుగా ఇక్కడికి వచ్చామని చెబుతుంది. అయినా నామీద గెలవగలనని ఎలా అనుకున్నావంటూ హెచ్చరిస్తుంది.
జేడీ,కేడీ ఇద్దరినీ చంపేయమని మీనన్ రౌడీలను ఆదేశించడంతో వారు రంగంలోకి దిగుతారు.దీంతో వాళ్లందరినీ ఇరగదీసి జేడీ మీనన్‌ను పట్టుకోవడానికి లోపలికి వెళ్తుంది.అక్కడ హెల్త్ మినిస్టర్ మధుసూదన్‌రావును చూసి జేడీ ఆశ్చర్యపోతుంది. ఈ దందా వెనక ఉంది మీరా అంటూ జగధాత్రి మండిపడుతుంది. నాకు అప్పుడే అనుమానం వచ్చిందని...ఎవరో పెద్ద తలకాయ లేకుండా మీనన్ ఇంత పెద్ద ఢీల్ చేయడని అనుకున్నా అంటుంది. రౌడీలందరినీ కొట్టి మీనన్‌ను అరెస్ట్ చేయబోతుండగా మినిస్టర్‌తో కలిసి మీనన్ పారిపోయే ప్రయత్న చేస్తాడు. ఇంతలో కేడీ ఎదురుగా వచ్చి గన్ గురిపెట్టడంతో ఆగిపోతాడు. దీంతో జేడీ మినిస్టర్‌తోపాటు మీనన్ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తుంది.
కేంద్రమంత్రి నుంచి ఫోన్ కాల్
ఎన్నో ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న మీనన్‌తోపాటు అతనితో చేతులు కలిపిన మినిస్టర్‌ను అరెస్ట్ చేసినందుకు సాధూ జేడీ టీంను అభినందిస్తాడు. మొత్తానికి నీ కల నెరవేర్చుకున్నావని అంటాడు. ఎన్నోసార్లు మీనన్‌ను అరెస్ట్ చేసే అవకాశం వచ్చినా....నా చేతుల్లో నుంచి తప్పించుకున్నాడని...ఇప్పుడు మాత్రం వదిలిపెట్టేది లేదని జేడీ అంటుంది. సాధూతో కలిసి మీనన్‌ను ఇంటరాగేషన్ చేసేందుకు వెళ్తుంది. అక్కడ మినిస్టర్ సాధూను బెదిరిస్తాడు. నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను అరెస్ట్ చేశావంటే నీ సంగతి చూస్తానంటాడు. నీకు ఎన్ని డబ్బులు కావాలో చెబితే నేను ఇస్తానని ఆఫర్ చేస్తాడు. మమ్మల్ని మీడియా ముందు ప్రవేశపెట్టినా...మీరు సాక్ష్యాలు సంపాదించలేరని మీనన్ హెచ్చరిస్తాడు. కాబట్టి మర్యాదగా మమ్మల్ని వదిలేస్తే మంచిదని అంటాడు. ఇంతలో సాధూకు కేంద్రమంత్రి నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. మా పార్టీ వాడినే అరెస్ట్ చేస్తారా అని గట్టిగా తిడతాడు. మర్యాదగా వాళ్లను వదిలిపెట్టండని....వారి ప్లేస్‌లో మరో ముగ్గురు వచ్చి లొంగిపోతారని చెబుతాడు.
మినిస్టర్ చెంప పగులగొట్టిన కౌషికి
కేంద్రమంత్రే కాదు...ఆ దేవుడు దిగివచ్చి చెప్పినా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని జేడీ చెబుతుంది. కోర్టులో కేసు ఎలా నిలబెట్టుకోవాలో మాకు తెలుసునంటుంది.ఇంతలో కౌషికి వచ్చిందని చెప్పడంతో వెళ్లి జేడీ కలుస్తుంది. శ్రీవల్లిని కాపాడినందుకు జేడీకి కౌషికి థ్యాంక్స్ చెబుతుంది. ఆ తర్వాత మీడియాను పిలిచి ప్రెస్‌మీట్‌పెట్టి మీనన్, మినిస్టర్ చేసిన తప్పులను చెబుతుంది. యువతీ యువకులను కిడ్నాప్ చేయడమే గాక...అవయవాల కోసం ఆరుగురుని చంపేశారని చెబుతారు. ఇంతలో అక్కడికి వచ్చిన కౌషికి మినిస్టర్ చెంప పగులగొడుతుంది. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే....ఇలాంటి పనులకు పాల్పడతారా అని మండిపడుతుంది. ఆ తర్వాత శ్రీవల్లిని తీసుకుని కౌషికి ఇంటికి వెళ్లిపోతుంది.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















