అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 25th: శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్‌ చెడగొట్టేందుకు ధాత్రి వేసిన ప్లాన్ బెడిసికొట్టిందా...? జగధాత్రి పథకాన్ని కనిపెట్టిన నిషిక ఏం చేసింది..?

Jagadhatri Serial Today Episode February 25th: శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్‌ చెడగొట్టేందుకు ధాత్రి వేసిన ప్లాన్ బెడిసికొట్టిందా...? జగధాత్రి పథకాన్ని కనిపెట్టిన నిషిక ఏం చేసింది..?

Jagadhatri Serial Today Episode :  మీనన్‌ ఇంటికి వచ్చాడని కౌషికి చెప్పడంతో అందరూ వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తారు. అక్కడ కేవలం బెలూన్లు  అడ్డుగా ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. అన్ని కెమెరాలకు బెలూన్లు ఎలా అడ్డువచ్చాయని అనుమానిస్తారు. సీసీ ఫుటేజ్‌లో మీనన్ కనిపించకపోవడంతో నిషిక వాళ్లు ఈ వ్యవహారాన్ని ఇక ఇంతటితో వదిలేయాలని చెప్పి వెళ్లిపోతారు. కానీ కౌషికి మాత్రం మీనన్‌ వచ్చి బెదిరించాడనే నమ్ముతుంది. జగధాత్రి ఆమె వద్దకు వెళ్లి  చనిపోయిన మీనన్ తిరిగి వచ్చాడంటే ఎవరూ నమ్మరు వదినా...కాకపోతే ఆ రూమ్‌లో మీరు కాకుండా ఇంకొకరు ఉన్నారన్నది మాత్రం నిజం అంటుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. రాత్రి డిన్నర్‌ కోసం జగధాత్రి,కేదార్ వంట రెడీ చేస్తుంటారు. ధాత్రి చేతికి దెబ్బ ఉండటంతో కేదార్‌ కూరగాయలు కోస్తుంటాడు. అదేంటి నువ్వు వంట చేస్తున్నావని అడిగితే....జగధాత్రి ఇచ్చిన పనిష్‌మెంట్  అని చెబుతాడు. నేను దగ్గర ఉండి అన్ని పనులు చేయిస్తానని చెప్పడంతో వాళ్లంతా వంట గదిలో నుంచి వెళ్లిపోతారు.
                  చికెన్, బిర్యానీ వండటానికి అన్ని సిద్ధం చేసిన తర్వాత కొత్తిమీర లేకపోడంతో నేను షాపుకు వెళ్లి తీసుకొస్తానని జగధాత్రి బయటకు వెళ్తుంది. ఫోన్‌లో వంట ఎలాచేయాలో కేదార్‌కు చెబుతుంటుంది. అలా బయటకు వెళ్లిన జగధాత్రికి ఉమెన్స్ హాస్టల్ వద్ద గంజాయి తాగి అమ్మాయిలను ఏడిపిస్తున్న రౌడీబ్యాచ్‌ ఎదురుపడుతుంది. వాళ్లను చితక్కొడుతూనే కేదార్‌కు చికెన్ ఎలా చేయాలో చెబుతుంటుంది ధాత్రి. ఈలోగా రమ్యకు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె కానిస్టేబుల్‌తో అక్కడికి చేరుకుని గంజాయి బ్యాచ్‌ను పట్టుకుంటుంది.ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందిరా అని వాళ్లను నిలదీస్తుంది జగధాత్రి. ఎంత అడిగినా తమకు తెలియదని వాళ్లు సమాధానం చెబుతారు. అయితే మీ ఆ మ్మవాళ్లను పిలిపించి మాట్లాడతామని చెప్పడంతో భయపడిపోయిన వాళ్లు....తమకు ఏం తెలియదని మేం ఫోన్‌లో ఎంత గంజాయి కావాలో మాత్రమే చెబుతామని....వాళ్లు బైక్‌ ఎక్కడ పార్క్ చేయాలో చెబుతారని అంటారు. బైక్‌ కవర్‌లో డబ్బులు తీసుకుని వాళ్లే అందులో గంజాయి పెట్టి వెళ్లిపోతారని చెప్పడంతో ...జగధాత్రి వీళ్ల దగ్గర ఆ నెంబర్ తీసుకుని రేపు వీళ్లలాగే మెసెజ్‌ పెట్టమని రమ్యకు చెబుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ  ఆ గంజాయి డీలర్‌ తప్పించుకోకూడదని చెప్పి ఇంటికి వెళ్లిపోతుంది.అప్పటికే కేదార్‌ చికెన్ బిర్యానీ రెడీ చేసి  ఉంచుతాడు.
                     తెల్లారి శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్‌ కోసం ఇంట్లో అంతా హడావుడిగా  పనులు చేస్తుంటారు కేదార్‌, జగధాత్రి.అది చూసి నిషిక, వైజయంతికి అనుమానం వస్తుంది. వీళ్లిద్దరూ ఏంటీ ఇంత హడావుడి చేస్తున్నారని అనుకుంటారు. ఈ ఎంగేజ్‌మెంట్ ఎలా ఆపుతామని జగధాత్రి అనగా....మనం ఏం చేయాల్సిన పనిలేదని మనం కొట్టేసిన డబ్బు కోసం వాళ్లే కొట్టుకుని ఒకరిపైఒకరు చెప్పుకుని బయటపడిపోతారని అంటుంది. ఇంతలో పెళ్లికొడుకు రావడంతో కౌషికి వీళ్లను తీసుకుని రిసీవ్‌ చేసుకోవడానికి వెళ్తుంది. వాళ్లకు స్వాగతం పలికిన తర్వాత...నిషిక, వైజయంతి కలిసి పెళ్లికొడుకుని నాలుగు ఫొటోలు తీయించుకుని తీసుకొస్తామని చెప్పడంతో కౌషికి వెళ్లిపోతుంది.అప్పుడు వైజయంతి కోటిరూపాయల బ్యాగ్ తీసుకొచ్చారా అని అడగగా....మా దగ్గర కొట్టేసిన డబ‌్బుల్లో వాటా  ఇవ్వండని రాజు అంటాడు.  దీంతో వాళ్లు గొడవపడతారు. మర్యాదగా డబ్బులు ఇవ్వకపోతే పోలీసులను పిలుస్తామని చెబుతుంది నిషిక. దీంతో బయపడిపోయిన రాజు...నిజంగా ఆ కోటిరూపాయలు మేం తీసుకుని ఉంటే...మళ్లీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చేవాళ్లమని అటునుంచి అటే వెళ్లిపోయేవాళ్లం కదా అని అంటారు. అయితే మీరు మా దగ్గర నుంచి తీసుకుని వెళ్లిన 10నిమిషాల్లోనే ఆ బ్యాగ్ ఎవరు కొట్టేసి ఉంటారని వైజయంతి అంటుంది. ఇంకెవరు ఆ జగధాత్రి, కేదార్‌ పనేనని నిషిక చెబుతుంది. మనం మనం కొట్టుకుని బయటపడాలనే వాళ్లు ఈ ప్లాన్ వేశారని చెప్పడంతో వైజయంతి నోరు వెళ్లబెడుతుంది. అయ్యిందేదో అయ్యింది ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రాజును లోపలికి తీసుకెళ్తుంది నిషిక. అటు గంజాయి బ్యాచ్‌ కోసం ఫోన్‌లో రమ్యకు ఇన్‌స్ట్రక్షన్లు ఇస్తుంటుంది జేడీ...డ్రగ్‌ డీలర్‌ దొరికాడని చెప్పగానే అరెస్ట్‌ చేయండని ధాత్రి అనడం కౌషికి వింటుంది.
   

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Embed widget