అన్వేషించండి

Jagadhatri Serial Today October 25th: ‘జగధాత్రి’ సీరియల్‌: కేదార్‌ ను వారసుడిగా  ఒప్పుకోన అన్న యువరాజ్ –  సుధాకర్ ఎప్పుడైనా మాట మార్చోచ్చు అన్న ధాత్రి

Jagadhatri Today Episode:    కేదార్‌ను కొడుకుగా ఒప్పుకున్న సుధాకర్‌ కోపంతో యువరాజ్‌ను కొట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  ఎవరికి పుట్టాడో తెలియని వాణ్ని ఇంట్లోకి తీసుకొస్తానంటే నేను ఊరుకోను అని యువరాజ్‌ అనగానే సుధాకర్‌ కోపంగా యువరాజ్‌ను కొడతాడు. వైజయంతి అడ్డు వెళ్లబోతుంటే.. ఆమెను తిడతాడు సుధాకర్‌. కేదార్‌ కిడ్నీ దానం చేస్తానంటే జగధాత్రి ఆపలేదు. మధ్యలో వీడికెందుకు అంటూ ప్రశ్నిస్తాడు.  చూశావా యువరాజ్‌ కొడుకు అంటే అలా ఉండాలి. కోడలు అంటే ఇలా ఉండాలి అని చెప్తాడు.

ధాత్రి: యువరాజ్‌ ఇప్పుడు నీ సమస్య కేదార్‌ మామయ్యగారి కొడుకా..? కాదా అన్నది కాదు. మామయ్యగారిని ఎలా కాపాడుకోవాలి అనేది. మామయ్యగారికి నీ కిడ్నీ సరిపోదు అని డాక్టర్‌ చేత చెప్పించారు. అదే డాక్టర్‌ గారు అలా చెప్పారు అంటున్నాను. కేదార్‌ కిడ్నీ సరిపోతుంది అన్నప్పుడు కేదారే ఇస్తాడు.

నిషిక: అదేం కుదరదు. కిడ్నీ దానం చేసి ఈ ఇంటికి వారసుడు అయిపోదామనుకుంటున్నారు.

సుధాకర్‌: కిడ్నీ దానం చేసినా చేయకపోయినా వాడు ఈ ఇంటి వారసుడు. వాడు నా కొడుకు.

వైజయంతి: చూడు బావ ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్య అంటున్నావు. ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్యే ఉండాలి లేదంటే నా ప్రాణం వదిలేయాల్సి వస్తుంది.

కౌషికి: పిన్ని కేదారు బాబాయే తన తండ్రి అనిపించుకోవాలని ఆశపడుతున్నాడు తప్పా.. ఈ ఇంటి పరువు తీయాలనో ఇంకోటో కాదు.

కేదార్‌: ఇన్నాళ్లకు అందరి ముందు నేను నీ కొడుకు అని చెప్పారు అది చాలు నాన్నా..

ధాత్రి: ఇన్నేళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది కేదార్‌. అందరిలో ఉన్న ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది.

కౌషికి: అవును ఇంతకాలం రహస్యంగా ఉన్న నిజం బయటపడింది. ఇక మీదట ఎవరూ నటించాల్సిన అవసరం లేదు.

కేదార్: నాన్నా మీ ఆరోగ్యం గురించి మీరేమీ ఆలోచించకండి. మీరు నాకు ప్రాణం పోశారు. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది.

ధాత్రి: అవును మామయ్య గారు మీరు ఇంక నిశ్చింతగా ఉండండి. వదిన తీసుకెళ్లండి.

కౌషికి: పదండి బాబాయ్‌ రెస్ట్‌ తీసుకుందురు గాని రండి.

 అని అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కేదార్‌, ధాత్రి మాత్రం ఎమోషనల్‌ గా ఫీలవుతుంటారు. ఇదే నా ఐడెంటిటీ అంటూ ఆనందంతో ఏడుస్తుంటాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాను అంటాడు. ఈ క్షణం నిజం మాట్లాడిన వాళ్లు దీనికి ఒప్పుకోకపోవచ్చు అంటూ ధాత్రి బాంబు పేలుస్తుంది. మామయ్యగారి మనసు మార్చడానికి అందరూ ట్రై చేస్తారు. అందుకే నిజం బయటి ప్రపంచానికి తెలియాలి అని ధాత్రి చెప్పగానే కౌషికి వచ్చి అలా జరగడానికి వీల్లేదు అంటుంది. ఇప్పటి వరకు నువ్వు నా సొంత తమ్ముడివే అయినా అలా చూడలేకపోయాను సారీ తమ్ముడు అంటుంది కౌషికి. మరోవైపు సుధాకర్‌ కొట్టిందే గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు యువరాజ్‌.

నిషిక: ఏంటి యువరాజ్‌ భోజనం చేయకుండా వచ్చేశావు. కనీసం ఈ చపాతీ అయినా తిను. జరిగిందేదో జరిగిపోయింది. అలా అని అన్నం తినకుండా ఉంటావా?

యువరాజ్‌: అసలు ఇదంతా నీ వల్లే జరిగింది.

నిషిక: నావల్లనా.. ఏంమంటున్నావు యువరాజ్‌.

యువరాజ్‌: అవును నువ్వు నాకు అడ్డు పడకుండా ఉండి ఉంటే కిడ్నీ ఇచ్చే అవకాశం ఆ కేదార్‌ కు వచ్చేదే కాదు. నీ ఇంట్లో నా వాళ్ల ముందే వాడు హీరో అయ్యాడు.

నిషిక: అబ్బా అలా అని ఎందుకు అనుకుంటున్నావు యువరాజ్‌. మామయ్య ఏమైనా కేదార్‌ను తన కన్న కొడుకు అనలేదు కదా? అవన్నీ జరగవులే కానీ ముందు ఇది తిను.

అనగానే చపాతిని పక్కకు తోస్తాడు యువరాజ్‌. నిషికను తిడతాడు. నీకు ముద్ద ఎలా దిగుతుంది అని ప్రశ్నిస్తాడు. ఇంతోల వైజయంతి వస్తుంది. యువరాజ్‌ను కొట్టి.. ఆయన కేదారే నా కొడుకు అని చెప్పేదాకా తీసుకొచ్చారంటే హాస్పిటల్‌ లో మీరేం చేశారో నాకు తెలియదు అనుకోవద్దు. మీరేం చేసినా ఆ కేదార్‌ కంటే ముందే చేయాల్సింది అంటుంది. నిషికను కూడా తిడుతూ నువ్వు ఆ ధాత్రిని చూసి నేర్చుకో అంటుంది. ఇంతలో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: హైదరాబాద్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సదరన్ రైజింగ్ సమ్మిట్
హైదరాబాద్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సదరన్ రైజింగ్ సమ్మిట్
YS Jagan And Sharmila: జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: హైదరాబాద్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సదరన్ రైజింగ్ సమ్మిట్
హైదరాబాద్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సదరన్ రైజింగ్ సమ్మిట్
YS Jagan And Sharmila: జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
GHMC Commissioner: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
Crime News: తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
Mega DSC Notification: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, ఖాళీలు ఎన్నో తెలుసా?
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, ఖాళీలు ఎన్నో తెలుసా?
YS Sharmila:  అందరూ  అమ్మల మీద, చెల్లెళ్ల మీద  కోర్ట్ ల్లో కేసులు వేయరు  కదా? - జగన్‌కు షర్మిల కౌంటర్
అందరూ అమ్మల మీద, చెల్లెళ్ల మీద కోర్ట్ ల్లో కేసులు వేయరు కదా? - జగన్‌కు షర్మిల కౌంటర్
Embed widget