అన్వేషించండి

Jagadhatri Serial Today November 18th: ‘జగధాత్రి’ సీరియల్‌:  సుధాకర్‌ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ గురించి చెప్పిన లాయర్‌ - ధాత్రి, కేదార్‌ లను పెళ్లికి పిలిచిన కౌషికి, సుధాకర్‌

Jagadhatri Today Episode:   మధుకర్‌ గారి వీలునామాలో ఎవరిదో వర్జినట్ సర్టిఫికెట్‌ ఉందని లాయర్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.          

Jagadhatri  Serial Today Episode:  మధుకర్‌ లీగల్‌ అడ్వైజర్‌ రాజ్‌ కుమార్‌ ఇంటికి వచ్చి మధుకర్‌ తన ఆస్తుల గురించి వీలునామా రాశారని చెప్తాడు. అందులో ఆయన ఆస్థులు అన్ని తన కూతురు కౌషికి పేరు మీద వ్రాశారని చెప్పడంతో. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఉమ్మడి ఆస్థులు అలా ఒకరి పేరు మీద ఎలా రాస్తారిన నిషిక అడుగుతుంది. యువరాజ్‌ కూడా ఈ వంశానికి నేనే వారసుడిని ఆడపడుచులకు ఇవ్వాలంటే నేనే ఇవ్వాలి కదా? అంటాడు. దీంతో కౌషికి ఉమ్మడి ఆస్తిలో లేని లాండ్‌ ను నాన్నగారు నా పేరు మీద రాశారని చెప్తుంది. అలా కుదురుతుంది కౌషికి అని కమలాకర్‌ ప్రశ్నిస్తాడు. మామయ్య గారి పేరు మీద ఉన్న ఆస్థులు అన్ని యువరాజ్‌ పేరు మీద రాయించండి అత్తయ్యా అంటుంది నిషిక. ఇంతలో లాయర్‌ వీలునామాలో ఏముందో క్లియర్‌ గా తెలియదు. అన్నట్టు ఆ వీలునామాతో పాటు ఒక వర్జినల్‌ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కూడా ఉంది అని లాయర్‌ చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు.

యువరాజ్‌: మ్యారేజ్‌ సర్టిఫికెటా..?

లాయర్‌: అవును అది మధుకర్‌ గారి తమ్ముడికి సంబంధించింది.

యువరాజ్‌: అంటే మేము కాల్చింది డూప్లికేట్‌ సర్టిపికెటా..? ( అని మనసులో అనుకుంటాడు.)

కమలాకర్‌: అన్నయ్య ఆస్థులతో పాటు కొంప కూడా ముంచాడు కదా..? ( ఆని మనసులో అనుకుంటాడు)

లాయర్‌:  ఆ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కూడా వారం రోజుల్లో మీకు అందిస్తాను.

అని లాయర్‌ వెళ్లిపోతాడు. బయట నుంచి అంతా విన్న కేదార్‌, ధాత్రి హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత అందరూ వెళ్లిపోతారు. ఇంట్లోకి వెళ్లిన కేదార్‌, ధాత్రి సంతోషంగా మాట్లాడుకుంటారు. కచ్చితంగా అది మా అమ్మా నాన్నల పెళ్లి సర్టిఫికెట్టే అయ్యుంటుంది అంటాడు కేదార్‌. అవునని ధాత్రి చెప్తుంది. మరోవైపు యువరాజ్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు.

యువరాజ్‌: అసలేం జరుగుతుందమ్మా ఇక్కడ. ఈ పెద్ద నాన్నేంటమ్మా.. ఇంత పని చేశారు. మనింట్లో ఏం ప్రాబ్లమ్స్‌ లేనట్టు వాడి ప్రాబ్లమ్స్‌ తీరుస్తున్నారు.

నిషిక: ఆస్తి మాత్రం కూతురుకు దక్కేలా రాశాడు. అన్ని సాక్ష్యాలు వీలునామాలు సృష్టించి పోయాడు.

వైజయంతి: నాకు అదే అర్తం కావడం లేదు అమ్మీ. ఏ లాకర్‌ చూసిన వాడి కోసమే.. ఏ ఫైల్‌ చూసినా వాడి కోసమే..

కమలాకర్‌: తెలిసి తెలిసి ఒకరు అన్యాయం అయిపోతుంటే.. చూడలేని మానవత్వంతోనే ఇదంతా చేసి ఉంటాడు.

అని కమలాకర్‌ చెప్పగానే వైజయంతి, యువరాజ్ కోపంగా మధుకర్‌ ను తిడతారు. చనిపోయిన పెద్దనాన్నే ఇంత చేసినప్పుడు బతికున్న మనం ఏం చేయలేమా..? అమ్మా ఏదో ఒకటి చేసి ఆ లాయర్‌  నుంచి ఆ సర్టిఫికెట్‌ తీసుకోవాలి అంటాడు. దీంతో ఆ లాయర్‌ కు డబ్బు ఆశ చూపించో.. బెదిరించో అవసరం అయితే వాడిని చంపైనా ఆ సర్టిఫికెట్‌ తీసుకొస్తాను అని కమలాకర్‌ చెప్తాడు. మరోవైపు సుధాకర్‌, కౌషికి కలిసి కేదార్‌, ధాత్రి దగ్గరకు వెళ్లి పెళ్లికి రమ్మని చెప్తారు.

కేదార్‌: మీరు అంటుంది నిజమేనా అక్కా మేము పెళ్లికి రావొచ్చా..?

సుధాకర్‌: రావొచ్చు.. ఇంతకాలం అందిరితో కలిసి ఉన్నారు. అందరిలో కలిసి పోయారు. మాధురి సంతోషం కోసం మీరొస్తే బాగుంటుంది అనిపిస్తుంది.

కేదార్‌: చాలా సంతోషంగా ఉంది. నా చెల్లి పెళ్లిలో అంతా నేనే చేయాలని అనుకున్నాను. ఇప్పుడు నా మనసుకు సంతోషంగా ఉంది.

సుధాకర్‌: ఇంకో మాట అక్కడ మీకు అవమానాలు జరగొచ్చు. అవి మేము ఆపకపోవచ్చు. తప్పుగా ఫీలవకండి.

కేదార్‌: మీ అందరితో కలిసి ఉండటానికి ఎలాంటి అవమానాలైనా ఎదురుకుంటాం.

అని చెప్పగానే సుధాకర్‌, కౌషికి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కేదార్‌, ధాత్రి హ్యాపీగా ఫీలవుతారు. ఇవన్నీ చూస్తుంటే మన ప్రాబ్లమ్‌ అన్ని సాల్వ్ అవుతాయని అనిపిస్తుంది అంటాడు కేదార్‌. మరుసటి రోజు పెళ్లి హడావిడి ఉంటుంది. కౌషికి ఒక దగ్గర డల్లుగా కూర్చుని ఉంటుంది. కేదార్‌ ఆతృతగా లాయర్‌ తో మాట్లాడి ఆ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ నాకే ఇవ్వమని అడుగుదామా..? అని ధాత్రికి చెప్తాడు. సరేనని కేదార్ లాయర్‌కు ఫోన్‌ చేసి అడుగుతాడు. ఏదైనా ఫ్రూప్‌ ఉంటే తీసుకునిరా అని లాయర్‌ చెప్తాడు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget