అన్వేషించండి

Jagadhatri Serial Today January 15th: ‘జగధాత్రి’ సీరియల్‌: కేదార్‌పై అటాక్ చేసిన యువరాజ్ - యువరాజ్‌కు వార్నింగ్ ఇచ్చిన కేదార్ 

Jagadhatri Today Episode :  మేనేజర్ సిటీ వదిలి వెళ్తున్నాడని సమాచారం రావడంతో మేనేజర్ ను పట్టుకోవడానికి ధాత్రి, కేదార్ వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.  

Jagadhatri  Serial Today Episode:   కాచి, బూచి కిచెన్‌లోకి వెళ్లి మొత్తం పెంట పెంట చేస్తారు. అప్పుడే కిచెన్‌లోకి వచ్చిన ధాత్రి ఏంటి ఇలా చేశారు అని అడిగితే కాఫీ, స్నాక్స్‌ చేసుకున్నామని నిషిక చెప్తుంది. ఏంటి కాఫీ, స్నాక్స్‌ కే ఇంత చేశారా అని ఆశ్చర్యపోతుంది. రాత్రి ఎవరు బోజనం చేయరు అందరికీ చపాతీ చేయండి అని చెప్పి వెళ్లిపోతుంది నిషిక.

కేదార్‌: మీ చెల్లిని.. మా చెల్లిని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టొచ్చు..

ధాత్రి: ఎప్పుడూ చేయని పని కదా..?

కేదార్‌: అప్పుడప్పుడు చూపించాలి ఇంక..

అంటూ కేదార్‌ క్లీన్‌ చేయబోతుంటే..

ధాత్రి: ఏయ్‌ ఏం చేస్తున్నావు..

కేదార్‌: క్లీనింగ్‌ చేస్తాను..

ధాత్రి: నువ్వు వెళ్లి హాల్లో కూర్చుని టీవీ చూస్తుండు.. నేను వీటిని క్లీన్‌ చేసి అరగంటలో వంట చేస్తా..

కేదార్‌: టీవీ చూసే వాళ్లు చాలా మంది ఉన్నారులే.. ఇద్దరం కలిసి క్లీన్‌ చేసి వంట చేద్దాం.

ధాత్రి: ఏమీ వద్దు నువ్వు వెళ్లు నేను చూసుకుంటాను.

కేదార్: నాభార్య ఇక్కడ ఒక్కతే కష్టపడుతుందని తెలిసి కూడా నేను వెళ్లి ఎలా కూర్చోను.

 ధాత్రి: ఇది నాకు కష్టం కాదు.. ఇష్టం.. అందరికి ఏం కావాలో వండిపెట్టడం.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడం నాకు ఇష్టం.

కేదార్‌: అలాగే నా భార్యకు ఇష్టమైన పనుల్లో నేను పాలు పంచుకోవడం నాకు ఇష్టం.

ధాత్రి: సరే..అయితే రా..

అంటూ ఇద్దరూ కలిసి కిచెన్‌ మొత్తం క్లీన్‌ చేస్తారు. తర్వాత ఇద్దరూ కలిసే చపాతీలు చేస్తుంటారు. మరోవైపు ఆఫీసును మేనేజర్‌ వచ్చి కౌషికితో షేర్స్‌ గురించి మాట్లాడుతుంటాడు.

మేనేజర్‌: రావు గారు మన షేర్ హోల్డర్స్‌ దగ్గర నుంచి షేర్స్‌ అన్ని కొనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన పీఏ చెప్పారు మేడం.

కౌషికి: అదే జరిగితే మన కంపెనీలో 70శాతం షేర్స్‌ రావు చేతుల్లోకి వెళ్లిపోతాయి. అప్పుడిక కంపెనీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. మేనేజర్‌ గారు ఈ కంపెనీలో ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చింది ఇలా ఒకరి చేతుల్లో పెట్టడానికి కాదు. షేర్స్‌ రావు గారు కొనడానికి వీల్లేదు. దానికి మనం ఏం చేయాలో చెప్పండి.

మేనేజర్‌: ఏముంది మేడం.. రావు గారు ఆఫర్‌ చేసిన దానికంటే మనం ఎక్కువ ఇస్తామంటే మనకే అమ్ముతారు.

కౌషికి: అన్ని షేర్స్‌ కొనాలంటే 25 కోట్లు కావాలి. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే..

మేనేజర్‌: మేడం మనుక ఇంకా రెండు రోజులే ఉన్నాయి.

కౌషికి: గచ్చిబౌలి దగ్గర నా లాండ్‌ ఒకటి ఉంది. అది 30 కోట్లు వ్యాల్యూ చేస్తుంది. అర్జెంట్‌ మనీ కావాలని 25 కోట్లకు ఇచ్చేదాం అది చూడండి

మేనేజర్‌: సరే మేడం..

అంటూ మేనేజర్‌ వెళ్లిపోతాడు. అప్పుడే పై నుంచి వస్తున్న యువరాజ్‌, నిషిక మేనేజర్‌ను చూసి ఇంత రాత్రి పూట వచ్చాడంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది అనుకుంటారు. అక్కనే అడుగుతానని యువరాజ్‌ అంటాడు. తర్వాత ఫోన్‌ మాట్లాడుకుంటూ ఒంటరిగా వెళ్తున్న కేదార్‌ను తన మనుషులతో వచ్చి కొట్టి వెళ్లిపోతాడు యువరాజ్. యువరాజ్‌ను చూసిన కేదార్‌ ఇంటికి వచ్చి యువరాజ్‌కు పాలు తీసుకెళ్లి గొంతు పట్టుకుని కొడతాడు. పోలీస్‌ ఆఫీసర్‌ మీద చేయి చేసుకోవడం నేరం అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. రమ్య, ధాత్రికి ఫోన్‌ చేసి హీరోయిన్‌ మేనేజర్‌ను ఫైండ్‌ అవుట్ చేశామని చెప్తుంది. ధాత్రి, కేదార్‌ వెంటనే వెళ్లాలని బయలుదేరుతారు. లాండ్‌ అమ్మకం విషయంలో చిన్న ప్రాబ్లమ్‌ ఉందని లాయర్‌ చెప్పగానే కౌసికి ఆలోచనలో పడుతుంది.  దీంతో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ పాపని దొంగతనం చేసిన పద్మాక్షి! మళ్లీ నొప్పులు.. ఈ సారి బాబు పుడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ పాపని దొంగతనం చేసిన పద్మాక్షి! మళ్లీ నొప్పులు.. ఈ సారి బాబు పుడతాడా!
Godavari Serial Today May 22nd: 'గోదావరి' సీరియల్: నందుకి ఎన్నారై సంబంధం ఫిక్స్ అవుతుందా! మురళీ పరిస్థితేంటి? సూర్య, జానులను డెస్టినీ కలుపుతుందా!
'గోదావరి' సీరియల్: నందుకి ఎన్నారై సంబంధం ఫిక్స్ అవుతుందా! మురళీ పరిస్థితేంటి? సూర్య, జానులను డెస్టినీ కలుపుతుందా!
Karthika Deepam 2 Serial Today May 22nd: కార్తీకదీపం 2 సీరియల్:
కార్తీకదీపం 2 సీరియల్: "కన్నకూతుర్ని మర్చిపోవడం పెద్ద కష్టమేమీ కాదు" జ్యోత్స్నకి సుమిత్ర వార్నింగ్! దీపే కారణమా!
Nindu Manasulu Serial Today Episode: సిద్ధూ తండ్రి శరత్‌ ఫొటో చూసి షాకైన ప్రేరణ... విజయానంద్‌ అసలు రంగు బయటపడుతుందా?
నిండు మనసులు: సిద్ధూ తండ్రి శరత్‌ ఫొటో చూసి షాకైన ప్రేరణ... విజయానంద్‌ అసలు రంగు బయటపడుతుందా?

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhagirath Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
Vijayawada Patamata Thar Incident: అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
Satya Dev Samavarthi : సమవర్తిగా సత్యదేవ్ - వెర్సటైల్ హీరో వైల్డ్ యాక్షన్ మోడ్
సమవర్తిగా సత్యదేవ్ - వెర్సటైల్ హీరో వైల్డ్ యాక్షన్ మోడ్
Nalagandla Land Rates: అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
Peddi Special Song : పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
SAEL Solar Project AP: జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!
జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!
Faria Abdullah: బ్లూ కలర్ లెహెంగాలో జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా!
బ్లూ కలర్ లెహెంగాలో జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా!
Patriot OTT : ఓటీటీలోకి మల్టీ స్టారర్ పేట్రియాట్ - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మల్టీ స్టారర్ పేట్రియాట్ - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget