అన్వేషించండి

Jagadhatri Serial Today Fabruary 12th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రి నాటకం సక్సెస్‌ -  నిజం బయటపెట్టిన వైజయంతి

Jagadhatri Today Episode :  పరంధామయ్య ఆత్మ వచ్చినట్టు నాటకం ఆడించింది వైజయంతి వాళ్లేనన్న విషయం కనిపెడుతుంది ధాత్రి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Jagadhatri  Serial Today Episode   కారు దగ్గరకు వెళ్లిన ధాత్రి, కేదార్‌.. కౌషికిని తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన కౌషికి ఆందోళన పడుతుంది. మామయ్య నన్ను చంపాలనుకుంటున్నాడు. ఆ డ్రైవర్‌ను నా కళ్ల ముందే చంపాడు కానీ మళ్లీ ఎలా బతికి వచ్చాడో నాకు అర్థం కావడం లేదు అని చెప్తుంది. బాబాయ్‌ నన్ను నమ్మండి అంటుంది.

సుధాకర్‌: నాక్కూడా నీ మాటలు నమ్మాలని ఉందమ్మా కౌషికి కానీ చనిపోయిన మనిషి వచ్చి నిన్ను చంపాలనుకోవడం ఏంటో అర్థం కావడం లేదు.

ధాత్రి: వదిన మీరు చెప్పింది నిజమని మేము ముగ్గురం నమ్ముతున్నాం. కానీ జరిగిన దానికి మన కళ్ల ముందు జరుగుతున్న దానికి తేడా కనిపెడితే ఈ కన్పీజన్‌కు క్లారిటీ వస్తుంది.

కేదార్‌: అక్కా అది కనిపెట్టే వరకు మీరు ఒక్కరే బయటకు వెళ్లకండి..

సుధాకర్‌: అవునమ్మా కౌషికి కొద్ది రోజులు నువ్వు ఇంట్లోనే ఉండు.

నిషిక: మాకు కావాల్సింది అదే కదా..? ( మనసులో అనుకుంటుంది)

కౌషికి: నేను కళ్లతో చూసింది నిజం కాకపోవడం. కళ్లముందు కనిపిస్తున్న నిజం అబద్దం అవడం.. అది మీ ఎవరికీ నేను నిరూపించకపోవడం ఏం జరుగుతుందో నాకేమీ అర్తం కావడం లేదు బాబాయ్‌.

ధాత్రి: వదిన ముందు మీరు కంగారు పడకండి.. అసలు ఏం జరగుతుందో కనిపెడదాం. మేముండగా మీకు ఏమీ కాదు.

కేదార్‌: అవునక్కా మేము ఉండగా నీకేమీ కాదు. కానివ్వం..

సుధాకర్‌: అమ్మా జగధాత్రి.. కౌషికిని లోపలికి తీసుకెళ్లు..

ధాత్రి: సరే మామయ్య గారు.. రండి వదిన

అంటూ కౌషికిని తీసుకుని లోపలికి వెళ్తుంది. మరోవైపు మీనన్‌.. మంత్రిని కలుస్తాడు. మంత్రి హ్యాపీగా చెప్పినట్టే చేశావు భాయ్‌ అంటాడు. ఇద్దరూ కలిసి మందు కొడుతారు.

మంత్రి: చెప్పినట్టే చేసి చూపెట్టావు. థాంక్యూ మీనన్‌ భాయ్‌.. 20 ఏళ్ల దూరాన్ని గుర్తు పెట్టుకోకుండా అంతకుముందు ఉన్న మన స్నేహాన్ని గుర్తు పెట్టుకుని అడగ్గానే సాయం చేశావు. ఆఖరి నిమిషంలో వచ్చి నన్ను చాలా పెద్ద సమస్య నుంచి బయట పడేశావు.

మీనన్‌: అయినా మనిషికి తెలియకుండా ప్రాణాలు తీసే నువ్వు ఇలాంటి కేసులో ఎలా ఇరుక్కున్నావు కేశవ.

మంత్రి: ఇదిగో ఇలాంటి చెత్త వెధవలను పక్కన పెట్టుకున్నందుకు జరిగిన తప్పు భాయ్‌ ఇదంతా..

అభి: చంపమన్నది నువ్వే కదా బావ

మంత్రి: చంపమంటే.. ప్రపంచం అంతా చూసేలా చేయమని కాదు. నేరం చేయడానికి వెళ్లి ఆధారాలు అక్కడ వదిలేసి వచ్చావు. మీనన్‌ భాయ్‌ కాపాడకపోతే నేను కూడా నీతో పాటు పక్క సెల్‌ లో ఉండేవాణ్ని..

మీనన్‌: వీణ్ని బయట తిరగనివ్వకు.. కేసు గొడవ తేలే వరకు అండర్‌ గ్రౌండ్‌లో ఉంచు..

మంత్రి: సరే భాయ్‌.. ఆ జేడీని కూడా ఏదో ఒకటి చేయాలి..

అవును ఇద్దరం కలిసినప్పుడు తప్పకుండా గెలిచాం మళ్లీ ఇప్పుడు కూడా కలిశాం కదా.. తప్పకుండా గెలుస్తాం అంటాడు మీనన్‌. మరోవైపు రూంలో ఒంటరిగా కూర్చున్న కౌషికి తనను చంపడానికి పరంధామయ్య వచ్చినట్టు భ్రమ పడుతూ భయపడుతుంది. గట్టిగా అరుస్తుంది. బయటి నుంచి అరుపులు విన్న ధాత్రి, కేదార్‌ కౌషికి రూంలోకి పరుగెత్తుకెళ్తారు. అక్కడ కౌషికి కింద పడిపోయి ఉండటం చూసి షాక్‌ అవుతారు. కౌషికిని తీసుకెళ్లి ఓదార్చి పడుకోబెడతారు.

ధాత్రి: వాళ్లకు కావాల్సింది వదినను అందిరి ముందు పిచ్చిదాన్ని చేయడం. ఆస్థి కొట్టేయడం.. మనల్ని బయటకు గెంటేయడం.. ముందు ఇదంతా నిషిక వాళ్ల నాటకమేనన్న  క్లారిటీ రావాలి.

కేదార్‌: వాళ్ల నోటితోనే నిజాన్ని బయటకు రప్పించాలి.  

అని కేదార్‌ అనగానే ధాత్రి తన కొచ్చిన ఐడియా చెప్తుంది. అనుకున్నట్టుగానే ఇద్దరూ వైజయంతి దగ్గరకు వెళ్లి నిషి నగలు పోయాయని చెప్తారు. అందరూ షాక్‌ అవుతారు.

కాచి: ఏంటి నిషి నగలు పోయాయా..?

కేదార్‌: అవును పరంధామయ్య మామయ్య లాగా ఒక వ్యక్తి వచ్చి నగలు ఎత్తుకెళ్లడం మేము చూశాము..

అని చెప్పగానే నిషిక లోపలికి వెళ్లి నగలు చూస్తుంది అక్కడ నగలు కనిపించవు. దీంతో కంగారుగా బయటకు వచ్చిన నిషిక.. యువరాజ్‌కు తన నగలు కనిపించడం లేదని చెప్తుంది. దీంతో వైజయంతి బాధపడుతూ నా నగలు  అన్ని కూడా పోయాయా..? అంటూ ఇదంతా ఆ దొంగ నాయాలా పని అనుకుంటా.. వాణ్ని వెంటనే పోలీసులకు పట్టించి మన నగలు అంటూ ధాత్రి, కేదార్‌ లను చూసి ఆగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 20: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
Nindu Manasulu Serial Today November 20th: నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
Godavari Serial Today November 20th: 'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!
'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget