అన్వేషించండి

Jagadhatri Serial Today December 28th: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికిని బ్లేమ్‌ చేయడానికి నిషి నాటకం – నాటకం బయటపెట్టిన ధాత్రి, కేదార్‌

Jagadhatri Today Episode:  దివ్యాంక చెప్పినట్టు కౌషికికి మందు తాగించి వీడియో తీయాలనుకుంటుంది నిషిక. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Jagadhatri  Serial Today Episode:   కాచి, బూచి ఇంటి పని చేస్తుంటే యువరాజ్‌ తిడతాడు. నిషిక కోపంగా ఆ జగధాత్రి ఏదో చేసింది యువరాజ్‌. మనం లేని టైం చూసి వాళ్లను ఏదో చేసింది అని చెప్తుంది.  ధాత్రి, కేదార్‌ జ్యూస్‌ తాగుతూ కూర్చుంటే కాచి, బూచి మొత్తం క్లీన్‌ చేస్తుంటారు. అలాగే ఆస్తి పేపర్స్‌ వెతుకుతుంటారు. ఎక్కడా వీలునామా పేపర్స్‌ దొరకపోయే సరికి కాచి, బూచి నిరాశగా బయటకు వస్తుంటే.. ధాత్రి, కేదార్‌కు దగ్గరకు వెళ్లి మనం వెతికే వీలునామా పేపర్‌ ఇంట్లో లేదంట.. కౌషికి వదిన బ్యాంకు లాకర్‌ లో పెట్టిందట అని చెప్తుంది. అది విన్న కాచి, బూచి బాధపడతారు. తర్వాత నిషికకు దివ్యాంక ఫోన్‌ చేసి నేను పార్టీకి రావడం లేదని ఆ జగధాత్రి కళ్లు కప్పి కౌషికికి మందు తాగించు. మందు తాగిన కౌషికి నన్ను సురేష్‌ను తిట్టేలా చేయ్‌ అదంతా వీడియో తీసి నాకు పంపించు అని చెప్తుంది సరే అంటుంది నిషిక. అదే ప్లాన్‌ మొత్తం యువరాజ్, కాచి, బూచికి చెప్తుంది నిషిక.

బూచి: అబ్బా ఇలాంటి ప్లాన్లు నా మీద ఎవరూ ఎందుకు వేయరు.

యువరాజ్: నిషి అక్క డ్రింక్ లో మందు కలిపే బాధ్యత నువ్వు తీసుకో.. కాచి నువ్వు దివ్యాంకకు ఫోన్‌ చేయ్‌. బావ వీడియో నువ్వు తీయ్‌

 అని చెప్పగానే సరే అని అందరూ లోపలికి వెళ్తారు. నిషిక డ్రింక్‌లో మందు కలుపుతుంది. అది తీసుకెళ్లి ఇవ్వబోతుంటే ధాత్రి వచ్చి కూల్‌ డ్రింక్స్ నేను ఇస్తాను అంటూ చెప్పగానే అవసరం లేదని నేనే ఇస్తానని నిషిక తీసుకుని వెళ్తుంది. ధాత్రి అనుమానిస్తుంది.

నిషిక: వదిన కూల్ డ్రింక్స్ తీసుకోండి..

కౌషికి: వద్దు నిషి నేను కూల్‌ డ్రింక్స్‌ తాగను  కదా..

నిషిక:అందుకోసమే నీ కోసం స్పెషల్‌ గా మ్యాంగో జ్యూస్‌ తీసుకొచ్చాను

అని ఇవ్వగానే కౌషికి జ్యూస్‌ తాగుతుంది. కౌషికికి ఎదురుగా కూర్చున్న కాచి వీడియో తీస్తుంది. మరోవైపు కేదార్‌ జ్యూస్‌ తీసుకొచ్చి ధాత్రికి ఇస్తాడు. కేదార్‌ జ్యూస్‌ నాకు ఇవ్వు అని అడగ్గానే ధాత్రి ఇవ్వకుండా అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ గార్డెన్‌లోకి వెళ్తుంది. అక్కడ కౌషికి మత్తుగా కూర్చుని ఉండటం చూసి ధాత్రి అనుమానిస్తుంది.

ధాత్రి: వదిన ఎందుకు అలా ఊగిపోతున్నారు..

నిషిక: ఎందుకంటే.. అది నేనిచ్చిన మందు తాగింది కాబట్టి ( అని మనసులో అనుకుంటుంది)

కౌషికి: ఏయ్‌ నేను అడతాను..

కేదార్‌: అక్కా మనం పక్కకు వెళ్లి ఆడుకుందాం..

కౌషికి: ఏయ్‌ పక్కకా నేను పక్కకు ఎందుకు వస్తాను ఇది మన ఇల్లు. ఏయ్‌ అందరూ పోండి..

నిషిక: వదిన చేసిన రచ్చ చాలు.. పోయిన పరువు చాలు.. అయినా కొత్తగా ఈ తాగుడు అలవాటు ఏంటి..? నలుగురిలో ఇలా అల్లరి చేయడం ఏంటి..? ఈ విషయం పది మందికి తెలిస్తే ఏమవుతుంది.

యువరాజ్‌: పరువు గురించి ఆలోచిస్తే ఇలా ఎందుకు చేస్తుంది నిషి.

నిషి: ఈ తాగుడు గురించి తెలిసి సురేష్‌ అన్నయ్యా వదినను వదిలేసి వెళ్లిపోయి విడిపించుకోవాలనుకుంటున్నాడు.

ధాత్రి: నిషి తప్పు తప్పుగా మాట్లాడకు..

నిషి: తప్పుగా మాట్లాడుతుంది. తప్పు చేస్తుంది ఆవిడ.

కేదార్: ఎక్కడో ఏదో తప్పు జరిగింది నిషి. లేకుంటే అక్క ఇలా ఎప్పుడూ చేయదు.

నిషి: నేను కూడా వదిన ఇలా దిగజారి పోయి ప్రవర్తిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.

అనగానే కౌషికి కోపంగా వెళ్లి నిషికను కొడుతుంది. వీడియో కాల్‌ చూస్తున్న దివ్యాంక ఇది కదా నాకు కావాల్సింది అనుకుంటుంది. ఇంతలో యువరాజ్‌ అడ్డుగా వెళితే యువరాజ్‌ను పక్కకు తోసేసిన కౌషికి ఈ మాత్రం ఫ్రూప్‌ సరిపోతుందా..? నిషిక. సరిపోలేదంటే చెప్పండి ఇంకొంచెం ఎక్కువ యాక్ట్‌ చేస్తాను అంటుంది. దీంతో యువరాజ్‌, నిషిక షాక్ అవుతారు. అందరూ షాక్‌ అయ్యారేంటి..? నేను ఇలా చేస్తే మీరు రికార్డ్‌ చేసి దివ్యాంకకు పంపిస్తే అది కోర్టులో చూపించి నాకు సురేష్‌కు డైవర్స్‌ వచ్చేలా చేస్తుంది అదే మీకు కావాల్సింది అనగానే ధాత్రి, నిషిక దగ్గరకు వెళ్లి మీ ప్లాన్‌ మాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా..? అంటూ నిజం చెప్తుంది. తాము కౌషికితో కలిసి ఆడిన నాటకం గురించి చెప్తుంది. నువ్వు తీసుకొచ్చిన మందు బాటిల్‌ లో మందు తీసేసి నీళ్లు నింపేసి పెట్టాము అని ధాత్రి చెప్పగానే నిషిక షాక్‌ అవుతుంది. కౌషికి అందరినీ తిట్టి వెళ్లిపోతుంది. దీంతో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today April 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని శాశ్వతంగా విహారికి దూరం చేసిన అజ్ఞాతవ్యక్తి ఎవరు? సహస్రకు ఇక మంచిరోజులేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని శాశ్వతంగా విహారికి దూరం చేసిన అజ్ఞాతవ్యక్తి ఎవరు? సహస్రకు ఇక మంచిరోజులేనా!
Meghasandesam Serial Today April 14th:  ‘మేఘసందేశం’ సీరియల్‌: పూరిని తిట్టిన శారద – శివ, బిందుల మీద బూడిద పోసిన పూరి
 ‘మేఘసందేశం’ సీరియల్‌: పూరిని తిట్టిన శారద – శివ, బిందుల మీద బూడిద పోసిన పూరి
Nindu Manasulu Serial Today April 14th: నిండు మనసులు: వంటింట్లో కొత్త కోడలు! పిచ్చెక్కించేస్తున్న ప్రేరణ.. వంటతోనా.. మంటతోనా!
నిండు మనసులు: వంటింట్లో కొత్త కోడలు! పిచ్చెక్కించేస్తున్న ప్రేరణ.. వంటతోనా.. మంటతోనా!
Brahmamudi Serial Today April 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, రాజులను చూసిన ఇందు – రాజును పట్టుకోవడానికి నందు స్కెచ్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, రాజులను చూసిన ఇందు – రాజును పట్టుకోవడానికి నందు స్కెచ్‌

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth letter to Modi: నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
Nashik BPO Scandal: TCSలో పనివాళ్లుగా పోలీసులు.. అండర్ కవర్ ఆపరేషన్..'కార్పోరేట్ జిహాద్'లో కొత్త కోణం..!
TCSలో పనివాళ్లుగా పోలీసులు.. అండర్ కవర్ ఆపరేషన్..'కార్పోరేట్ జిహాద్'లో కొత్త కోణం..!
Stalin Warning: దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
Andhra CCTV360: నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
Bihar CM Update: బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
Dacoit Review : డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
Chandrababu letter: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
Indian Parliament: భారత్‌లో ఎంపీగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? జీతభత్యాలు, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
భారత్‌లో ఎంపీగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? జీతభత్యాలు, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
Embed widget