అన్వేషించండి

Jagadhatri Serial Today April 27th: ‘జగధాత్రి’ సీరియల్‌: చరణ్‌ను ఇంటరాగేషన్‌ చేసిన ధాత్రి – నిజం బయటపెడతానన్న పిన్ని

Jagadhatri Today Episode: గుడిలో తీసిన వీడియో తీసుకొచ్చి ధాత్రి అసలు నిజం బయటపెడతానని పిన్ని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: ధాత్రి, కేదార్‌ మీద ఒట్టు వేసి నిజం చెప్పలేక.. అలా అని నిజం తెలిస్తే జరిగే పరిణామాలను తలుచుకుని బాధపడుతుంది. కౌషికి నిజం చెప్పమని లేదంటే మీరు నిజంగానే మోసం చేసినట్టు అవుతుందని చెప్తుంది. దీంతో ధాత్రి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇంతలో కేదార్‌ తన తల మీద ఉన్న ధాత్రి చేయ్యి తీస్తాడు.

కౌషికి: కేదార్‌ ఎందుకు చెయ్యి తీశావు. ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని భయమా? అనుకున్నది జరగక ముందే ఎక్కడ మీ నాటకానికి తెర పడిపోతుందేమోనని భయమా?

నిషిక: నీకు ఇప్పకైనా మనవాళ్లు ఎవరు? మంచివాళ్లు ఎవరు? అర్థమైందా వదిన. దీన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న. ఇది ఎంత మాయలాడో.. టెక్కులాడో.. నాకు బాగా తెలుసు. లోపల ఇంత పెట్టుకుని బయటకు నాలుగు మంచి మాటలు చెప్పగానే ఇంత నమ్ముతారా?

కేదార్‌: ఏంటి అప్పుడే సైలెంట్‌ అయిపోయారు. ఇంకా మమ్మల్ని అనాల్సిన మాటలు, వేయాల్సిన నిందలు లేవా? జగధాత్రి నేను తాళి కట్టిన నా భార్య. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. చచ్చేదాకా కలిసే ఉంటామని ప్రమాణం చేసుకున్నాం. ఒట్టు వేసైనా వేయకుండానైనా ఇదే చెప్తా.. చెప్పు అక్కా మేము మీ అందరికీ అబద్దం చెప్పి ఈ ఇంట్లో అడుగుపెట్టడం వల్ల మాకేంటి?

ధాత్రి: అవును వదిన మాకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు.

బూచి: మరి నాన్నమ్మ గారు అలా ఎందుకు చెప్తారు సిస్టర్‌.

కాచి: అవును అమ్మమ్మ అంత కచ్చితంగా చెప్తుంది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. కదా?

ధాత్రి: ఆవిడ ఎందుకు చెప్పిందో నాకు తెలియదు కానీ మేము మాత్రం బార్యాభర్తలమే..

 అని చెప్పగానే నిషిక లేదు మీరు అబద్దం చెప్తున్నారు అంటూ కోప్పడుతుంది. ఇంతలో నువ్వు తాళి మెడలో వేసుకోవడం నేను చూశాను అంటూ పిన్ని కరాకండిగా చెప్పడంతో మీరు ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నారో మేము అలా చేయలేదని కేదార్‌ చెప్తాడు. అయితే ఆ రోజు స్వామి వారి కళ్యాణం జరిగిందని అది మాకు తెలిసిన పిల్లొడే వీడియో తీశాడని ఆ వీడియో తీసుకొచ్చి చూపిస్తానని పిన్ని చెప్పగానే మీరు ఏదైనా తీసుకురండి కానీ మేము బార్యాభర్తలం అంటూ ధాత్రిని తీసుకుని పైకి వెళ్తాడు కేదార్‌.  పైకి వెళ్లిన కేదార్‌ కింద చాలా ధైర్యంగా మాట్లాడాను కానీ ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటూ భయపడతాడు. నిజం తెలిస్తే నేను ఈ ఇంటికి శాశ్వతంగా దూరమవ్వాల్సి వస్తుంది. అని ఇకపై మనం ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్‌ అవుతారు. మరోవైపు ఇంట్లో వాళ్లందరూ ధాత్రి కేదార్‌ ల గురించి మాట్లాడుకుంటుంటారు. పిన్ని వీడియో తీసుకొచ్చి అసలైన నిజం అందరికి తెలిసేలా చేస్తానని చెప్తుంది. దీంతో వాళ్ల నిజం తెలిసి వెంటనే బయటకు పంపిచేస్తానని కౌషికి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు పోలీస్‌ స్టేషన్‌లో చరణ్‌ను ఇన్‌స్పెక్టర్‌ ఇంటరాగేషన్‌ పేరుతో కొట్టబోతుంటే కేదార్‌, ధాత్రి వస్తారు.

ధాత్రి: ఇన్వెస్టిగేషన్‌కు ముద్దాయిని ఇలా కూర్చోబెట్టి అసభ్యకరంగా ఇలా మాట్లాడమని చట్టం మీకు చెప్పలేదు.

ఇన్‌స్పెక్టర్‌: నా స్టేషన్‌ కు వచ్చి నాకే ఇన్వెస్టిగేషన్‌ గురించి నేర్పిస్తారా?

ధాత్రి: ఇన్‌స్పెక్టర్‌ గారు మీరు తప్పు ప్రశ్న వేస్తున్నారు కాబట్టి మీకు తప్పు సమాధానమే వస్తుంది. పది నిమిషాల టైం ఇవ్వండి అసలు నిజం నేను నిరూపిస్తాను.

అనగానే ఇన్‌స్పెక్టర్‌ సరేనని చెప్పడంతో ధాత్రి, కేదార్‌లు ఇద్దరూ చరణ్‌ను ఇన్వెస్టిగేషన్‌ చేస్తారు. దీంతో అసలు నిజం చెప్తాడు చరణ్‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: భార్యతో థాయ్‌లాండ్‌ వెకేషన్‌లో ఆది పినిశెట్టి - ఫోటోలు వైరల్‌

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కొత్త అంబిక కొత్త డ్రామా! ఆస్తి మొత్తం రాసిచ్చేస్తానని మాటిచ్చిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కొత్త అంబిక కొత్త డ్రామా! ఆస్తి మొత్తం రాసిచ్చేస్తానని మాటిచ్చిన విహారి!
Nindu Manasulu Serial Today November 23rd: నిండు మనసులు: ఒక్కటైపోయిన ప్రేరణ, సిద్ధూ! కోడల్ని ఇంటికి తీసుకెళ్లడానికి మంజుల ప్రయత్నాలు!
నిండు మనసులు: ఒక్కటైపోయిన ప్రేరణ, సిద్ధూ! కోడల్ని ఇంటికి తీసుకెళ్లడానికి మంజుల ప్రయత్నాలు!
Godavari Serial Today November 23rd: 'గోదావరి' సీరియల్: నల్లపూసల వేడుకకు అంతా సిద్ధం! జాను మెడతో తన సూత్రాలు పడకుండా నందు ఆపుతుందా!
'గోదావరి' సీరియల్: నల్లపూసల వేడుకకు అంతా సిద్ధం! జాను మెడతో తన సూత్రాలు పడకుండా నందు ఆపుతుందా!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 23:ప్రేమించి వాడితో అనసూయ పెళ్లి జరిపించాలన్న రాధ..కుటుంబం ఆనందమే ముఖ్యమని తేల్చి చెప్పిన విక్కీ
నువ్వులేక నేను లేను: ప్రేమించి వాడితో అనసూయ పెళ్లి జరిపించాలన్న రాధ..కుటుంబం ఆనందమే ముఖ్యమని తేల్చి చెప్పిన విక్కీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
Embed widget