Intinti Gruhalakshmi December 26 Episode: 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్: లాస్యే తన కోడలంటున్న పరంధామయ్య, అత్తగారి అరాచకత్వానికి బలైపోతున్న దివ్య!
Intinti Gruhalakshmi Today Episode: నేను హత్య చేశాను నన్ను అరెస్టు చేయండి అని దివ్య పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.
Intinti Gruhalakshmi Telugu Serial Today Episode: దెయ్యాన్ని చూసి జడుచుకుని కళ్ళు మూసుకుంటారు బసవయ్య దంపతులు.
రాజ్యలక్ష్మి : కళ్ళు తెరవండి అంటుంది.
బసవయ్య భార్య : దెయ్యాలతో స్నేహం ఏమిటి వదిన.
రాజ్యలక్ష్మి : ఈమె దెయ్యం కాదు, దివ్యకి పిచ్చి అనే నాటకంలో శవం పాత్ర పోషిస్తుంది ఈ అమ్మాయే. మీరు చందన అని పరిచయం చేస్తుంది. ఇంతవరకు శవంలాగా నటించింది ఇప్పుడు దయ్యం లాగా నటించి దివ్యకి మరింత పిచ్చెక్కించబోతుంది అని చెప్తుంది.
బసవయ్య: తన అక్క ఒక దేవత లాగా కనిపిస్తుంది నీ ఆశీర్వచనం ఉంటే చాలు అంటూ అక్కకి దండం పెట్టుకుంటాడు.
రాజ్యలక్ష్మి: నవ్వుతూ చందనతో నువ్వు దివ్యకి తప్పితే వేరే ఎవరికీ కనిపించకూడదు అని చెప్తుంది. చందన సరే అనటంతో అందరూ నవ్వుకుంటారు.
మరోవైపు తనని చేయిపట్టి నడిపిస్తున్న తులసిని విదిలించుకుంటాడు పరంధామయ్య.
పరంధామయ్య: నువ్వెందుకు నా చెయ్యి పట్టుకుంటున్నావు అని తులసితో చెప్పి లాస్య నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావు నువ్వే కదా నన్ను నడిపించాలి అని అనటంతో లాస్య పరంధామయ్య ని తీసుకుని వెళ్లి పడుకోబెడుతుంది.
బయటికి వచ్చిన తర్వాత తననే దీక్షనంగా చూస్తూ ఉన్న నందు వాళ్ళకి నేనేమీ ఇదంతా కావాలని చేయలేదు అని చెప్తుంది.
నందు: నువ్వు చేసిన మంచి పని మా నాన్నగారిని ఒక మంచి డాక్టర్ కి చూపించడం
లాస్య: నా మీద ఇంకా నమ్మకం కుదరటం లేదా అని తులసిని అడుగుతుంది.
తులసి : ఇప్పుడు నా నమ్మకంతో ఏం పని, జరగవలసింది జరుగుతుంది కదా అని అంటుంది.
లాస్య: మీ అందరూ అడిగారు కదా అని కారెక్కి ఇక్కడ వరకు వచ్చాను మిమ్మల్ని డాక్టర్ని కలపడంతో నా పని అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనసులో మాత్రం మీరు వదిలించుకోవాలనుకున్న ఈ ముసలోడు ఊరుకోడు అనుకుంటుంది.
అనసూయ: లాస్యని ఆయన కోడలు అనుకోవటమేమిటి ఆయన గతంలోకి ఎందుకు వెళ్లారు అని బాధపడుతుంది.
నందు: ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉంటున్నారు కదా మెల్లగా చెబుదాం లే ఆయనే అర్థం చేసుకుంటారు. లాస్య సంగతి వదిలేయ్ అదేమంతా ఇంపార్టెంట్ విషయం కాదు నేను మేనేజ్ చేస్తాను.
మరవైపు నిద్రలో భయపడుతున్న భార్యకి ధైర్యం చెప్తాడు విక్రమ్.
విక్రమ్ : ఈమధ్య నీలో చాలా మార్పు కనిపిస్తుంది.
దివ్య :మార్పు అంటే పిచ్చిదాని లాగా కనిపిస్తున్నానా, నాలో వచ్చిన మార్పు ఏమిటి.
విక్రమ్ : నిన్ను పిచ్చివాళ్లు అన్న వాళ్ళు పిచ్చివాళ్లు. నీ మీద నువ్వు నమ్మకం కోల్పోవడం నీలో వచ్చిన మార్పు. భయం లేకుండా నిద్రపో అని భార్యకి ధైర్యం చెప్పి ఆమెని నిద్రపుచ్చుతాడు.
కాసేపటి తర్వాత యాక్సిడెంట్ అయిన విషయం గుర్తొచ్చి మెలకువ వచ్చేస్తుంది దివ్యకి అప్పుడే ఆమెకి దయ్యం కనిపిస్తుంది. నన్ను చంపి నువ్వు హాయిగా భర్త గుండెల మీద పడుకుంటావా అంటూ దివ్యని వెంబడిస్తుంది. భయంతో దివ్య ఇల్లు వదిలి పారిపోతుంది ప్లాన్ సక్సెస్ అయినందుకు అందరూ సంతోషపడతారు.
దివ్య సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.
దివ్య: నన్ను అరెస్టు చేయండి నేను యాక్సిడెంట్ చేశాను అంటుంది.
పోలీస్: ఎప్పుడు చేసావు ఎక్కడ చేశావు డెడ్ బాడీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు.
భయపడిపోతూ పొంతనలేని సమాధానాలు చెప్తుంది దివ్య.
ఎస్సై : చిరాకుపడుతూ కానిస్టేబుల్ తో దివ్య వాళ్ళ భర్త నెంబర్ తీసుకోమని చెప్పి సరదా పడుతుంది కదా అంతవరకు సెల్లో వేసెయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు తనని పలకరించిన కొడుకు మీద చిరాకు పడతాడు పరంధామయ్య.
పరంధామయ్య : నాకు ఏమైందని అందరూ ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతున్నారు అని చిరాకు పడుతూ తనేది అని అడుగుతాడు.
నందు: ఎవరి గురించి అడుగుతున్నారు.
పరంధామయ్య: నీ భార్య గురించి.
అనసూయ: వాడి భాగ్య సంగతి మీకెందుకు మీకు మీకు ఏం కావాలో అడగండి అంటుంది.
భార్య మీద నువ్వు అత్త వేనా అంటూ చిరాకుపడతాడు పరంధామయ్య
తులసి: టీ పెట్టే తీసుకు రమ్మంటారా మామయ్య.
పరంధామయ్య: నువ్వెందుకు టీ పెట్టడం ఇంటి కోడలు ఉంది కదా ఆమె కదా టీ పెట్టాలి అంటాడు. దాంతో ఇంట్లో అందరూ తెల్ల మొఖాలు వేస్తారు.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.