అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని ఉతికి ఆరేసిన వేదవతి! బల్లక్కాయ్‌కి సినిమా చూపించిన తోటికోడళ్లు..!

Illu Illalu Pillalu Serial Today Episode March 23rd | వల్లీని నర్మద, ప్రేమలు కాల్ రికార్డ్ పెట్టి వాయించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode అమూల్య విశ్వక్‌ని ప్రేమించేలా చేసింది.. పెళ్లి కూతురిలా ఉన్న అమూల్యని విశ్వక్‌ని అప్పగించింది కూడా శ్రీవల్లినే అని తెలిసి వేదవతి షాక్‌ అయిపోతుంది. శ్రీవల్లి చేసిన పనికి ఆ చెంపా ఈ చెంపా వాయించి ఇంట్లో నుంచి పంపేయాలి అనుకుంటుంది. ఇంతోల వేదవతి అంతరాత్మ వేదవతిని ఆపి అలా చేస్తే చందు ఊరుకుంటాడా.. తన తండ్రి పరువు తీసిన.. ఇంట్లో ఇంత జరగడానికి కారణమైన వల్లీని చంపేసి జైలుకి వెళ్లిపోతాడు.. మరోవైపు రామరాజు కూడా ఏరి కోరి తెచ్చుకున్న కోడలు ఇలాంటిది అని తెలిసి గుండె పగిలి చచ్చిపోతాడు అని వేదవతితో చెప్తుంది. ఇంట్లో విషయం తెలిస్తే మరో సంగ్రామం జరుగుతుంది. నీకు నిజం తెలిసిందా లేదా అని తనకి తెలీక ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చెయ్ అని అంతరాత్మ వేదవతికి చెప్తుంది. 

వల్లీ చిందులు వేసుకుంటూ వచ్చి అత్తయ్యాగారండీ కాఫీ కానీ టీ కానీ తీసుకురమ్మని అంటారా.. ఏంటి అత్తయ్యా గారు అంత సీరియస్‌గా ఉన్నారు.. నర్మద, ప్రేమల గురించా.. నర్మద ఓవైపు,, ప్రేమ మరోవైపు మిమల్ని బాధ పెట్టారు దాని గురించి బాధ పడుతున్నారా.. అని అడుగుతుంది. దాంతో వేదవతి లాగిపెట్టి కొడుతుంది. ఏమైంది అని వల్లీ అడిగితే చేసింది అంతా చేసి వాళ్ల గురించి నా దగ్గర ఎందుకు మాట్లాడుతావ్ అని అంటుంది. తప్పయిపోయింది క్షమించండి అని వల్లీ అంటే మళ్లీ లాగి పెట్టి కొడుతుంది. మళ్లీ ఏమైంది అత్తయ్యగారు అంటే వాళ్లని నమ్మాను.. నమ్మక ద్రోహం చేశారు.. నిన్ను చంపినా పర్లేదు అని మళ్లీ శ్రీవల్లిని వాయించేస్తుంది. వాళ్ల మీద కోపంతో నన్ను వాయించేస్తున్నారు ఏంటి అత్తయ్యా అని వల్లీ అంటుంది. అవునే వాళ్లని తలచుకుంటుంటే కోపం ఆగడం లేదే.. నీది ఒక బతుకేనా.. నిన్ను చూస్తే చంపేయాలి అని అనిపిస్తుందే అని వాయించేస్తుంది. అత్తయ్యా ప్రేమనే కదా అని వల్లీ అంటుంది. దానికి వేదవతి వాళ్లు కాకపోతే నువ్వు నన్ను మోసం చేశావా అని అడిగితే దేవత లాంటి మిమల్ని నేను ఎందుకు మోసం చేస్తాను అత్తయ్యా అని వల్లీ అంటుంది. 

సాగర్ ఆఫీస్‌ నుంచి ఇంటికి లేటుగా వస్తాడు. చిరాకుగా ఉంటాడు. నర్మద సాగర్‌తో మాట్లాడితే సాగర్ చిరాకు పడతాడు. నువ్వు అన్నీ నాకు చెప్తున్నావా నేను నీకు చెప్పడానికి అని అడుగుతాడు. నేను అమూల్య జీవితం కాపాడాలని చూశా నీలా వేరే వాళ్ల డబ్బు వాడుకొని ఉద్యోగం తెచ్చుకోలేదు అని అంటుంది. దాంతో సాగర్ నువ్వు తప్పు చేసినా నన్నే అంటావ్.. నేను చేసినా నన్నే అంటావ్.. ఇంట్లో వాళ్లు అర్థం చేసుకోరు.. నువ్వు అర్థం చేసుకోవు.. ఎప్పుడూ ఇంట్లో వాళ్లకి సపోర్ట్ చేయకు భర్తని అర్థం చేసుకో అని అంటాడు. ఇలా ఎలా మాట్లాడుతావ్ సాగర్ ఏదో రోజు నువ్వే అర్థం చేసుకుంటావ్ అని నర్మద అంటుంది. 

వల్లీ రాత్రి పూట కూడా గంతులేస్తూ నర్మద, ప్రేమ కోరలు పీకేశాను.. ఇక నాకు తిరుగు లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ, నర్మద శ్రీవల్లికి కనిపించకుండా కాల్ రికార్డ్ వల్లీ వినేలా చేస్తారు. శ్రీవల్లి షాక్ అయిపోతుంది. మధ్యలో నర్మద వాళ్లు ఆపేస్తే ఏం లేదు అనుకుంటుంది. మళ్లీ వల్లీ హ్యాపీగా ఫీలైనప్పుడు మళ్లీ రికార్డ్ ప్లే చేస్తారు. శ్రీవల్లి పరుగులు పెడుతుంటే కింద పడేలా.. కిటికీ తగిలేలా.. కాలి కింద గోలీలు వేసి పడేలా చేసి శ్రీవల్లికి చిత్ర హింసలు పెడతారు. ఆ మాటలు మామయ్య గారు వింటే నా కాపురం కొల్లేరైపోతుందని వల్లీ పరుగులు పెడుతూ ఉంటుంది. సెల్యూట్‌ మూవీలో నయనతారకి పిల్లలు చిత్ర హింసలు చేసినట్లు వల్లీకి చేస్తారు. తర్వాత ఇద్దరూ వల్లీ ముందుకు వస్తారు. ఇదంతా మీ పనా అని వల్లీ అంటే తెలిసిపోయిందా బల్లి అక్కాయ్ అని అంటారు. ఈ వాయిస్ రికార్డ్‌తో నీకు మామూలు చుక్కలు చూపిస్తాం అని అంటారు. ఇలా చేయడం ఏంటి మనం అంతా ఒక్కటే కదా ఆ రికార్డ్ డిలీట్ చేసేయండి అని అంటుంది. అంత సీన్ లేదు అని ప్రేమ అంటుంది. 

వల్లీని కిచెన్లో పిండి పడిన ముఖంతో వేదవతి చూసి దెయ్యం అనుకొని ఏడుస్తుంది. ఏమైందే ఏం చేయాలి అనుకున్నావే ఆ పిండి ఏంటే అని వేదవతి అడుగుతుంది. ప్రేమ, నర్మద కూడా వచ్చి ఏంటి అక్క ఇలా అయిపోయావ్.. కొంపతీసి దెయ్యం పట్టిందా ఏంటి., ఇవన్నీ ఆ లక్షణాలే అని ప్రేమ అంటుంది. వేదవతి కావాలనే ప్రేమ పుల్లల చీపురు అందుకో అని వల్లీని చితక్కొట్టేస్తుంది. నర్మద, ప్రేమలు తెగ నవ్వుకుంటారు. మిడతకి అసలు కథ శ్రీరామనవమి రోజు ఉంటుందని నర్మద అంటుంది. అన్నీ గుర్తు చేసుకొని గుక్కపట్టి ఏడుస్తుందని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Embed widget