Illu Illalu Pillalu Serial Today July 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: రామరాజు షాకింగ్ నిర్ణయం.. ఇంటి పెత్తనం కొట్టేసిన గయ్యాలి వల్లి.. బులెట్ రాణి ఇక తగ్గేదేలే!
Illu Illalu Pillalu Today Episode వేదవతి ఇంటి పెత్తనాన్ని రామరాజు శ్రీవల్లికి ఇవ్వడం వల్లి ఆస్తి కొట్టేసి తోడికోడళ్లతో ఓ ఆట ఆడుకుంటానని తల్లితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు ఉదయం రైస్ మిల్లుకి వెళ్లడానికి రెడీ అవుతాడు. తిరుపతి వచ్చి బావ నేను లేకుండా నువ్వు రైస్ మిల్లుకే వెళ్లలేవు బావ అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది బావ నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావో అని అంటాడు. దానికి రామరాజు ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతానురా అంటాడు. ఇంతలో వేదవతి చకచకా వస్తుంది.
వేదవతి: ఏవండీ అంటే అన్నాను అంటారు కానీ ఈ మధ్య మీకు మతి మరపు వచ్చేసిందండీ. రైస్ మిల్లుకి బయల్దేరేముందు బుజ్జమ్మా బుజ్జమ్మా అని నన్ను పిలుస్తారు. బ్యాగు రైస్ మిల్లు తాళాలు బ్యాగ్ నాకు ఇవ్వమని అడుగుతారు కదా. ఇది మీకు నాకు ఓ సెంటిమెంట్‌గా పాతికేళ్లగా అలవాటు అయిపోయింది. అయినా మీరు మర్చిపోయిన నేను ఇస్తాను. ఉండండీ తీసుకొస్తా.
రామరాజు: అమ్మా వల్లీ.. అమ్మా వల్లీ..
వేదవతి: వల్లీని ఎందుకు పిలుస్తున్నారండీ.
వల్లి: చెప్పండి మామయ్యగారండీ..
రామరాజు: అమ్మా వల్లీ దేవుడి గదిలో నా బ్యాగు తాళాలు ఉంటాయి వెళ్లి తీసుకురామ్మా. వెళ్లి తీసుకురా తల్లీ.
వేదవతి: అదేంటి అండీ కొత్తగా తనని తీసుకురమ్మని అంటున్నారు.
రామరాజు: అమ్మా వల్లీ నువ్వు తీసుకొస్తావా నన్నే తెచ్చుకోమంటావా.
వల్లి: నేనే తీసుకొస్తా మామయ్యగారండీ.
రామరాజు: అమ్మా వల్లీ ఇక నుంచి ప్రతీ రోజు నీ చేతితో నువ్వే తీసుకొచ్చి ఇవ్వమ్మా.
చందు: అది కాదు నాన్న ఇది మీకు అమ్మకి సెంటిమెంట్ కదా వల్లీని అడగటం ఏంటి.
రామరాజు: మనుషులు మారిపోయారురా ఇంక సెంటిమెంట్‌లు ఏంటి.
వేదవతి: ఏవండీ ఇళ్లు అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. దానికి ఇలా నా సెంటి మెంట్ మార్చేయడం ఏంటి అండీ.
రామరాజు: ఇళ్లు అన్నాక అన్నీ ఇంటి పెద్దగా నాకు తెలియాలి. ఈ ఇంటికి సంబంధించి ముఖ్యమైన విషయం నాకు తెలియకుండా చేయడం అంటేనే నాకు అన్నీ దూరం చేయడం. అమ్మా వల్లీ నిన్ను నీ మాటలు విన్నాక నాకు ఒక మాట అర్థమైంది. నా తర్వాత ఈ ఇంటి పరువు బాధ్యతలు పట్టించుకునేది కేవలం నువ్వు మాత్రమే. పాతికేళ్లగా నేను ఈ ఇంటిని ఎలా కాపాడుకున్నానో నువ్వు అలా కాపాడుకుంటావమ్మా ఆ లక్షణాలు అన్నీ నువ్వు చేయగలవు అందుకే ఈ ఇంటికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయంలో నేనో నిర్ణయం తీసుకున్నా అని వల్లికి ఇంటి తాళాలు ఇస్తారు.
అందరూ షాక్ అయిపోతారు. నర్మద, ప్రేమ రామరాజుని ఆపుతారు. ఇంటి బాధ్యత అత్తయ్యకు దూరం చేయొద్దని పాతికేళ్లగా అత్తయ్య ఇంటిని పిల్లల్ని ప్రాణంగా ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఈ బంధాన్ని తనకి దూరం చేయొద్దని బతిమాలుతారు. నర్మద, ప్రేమ ఎంత చెప్పినా రామరాజు కోడళ్ల మాట వినరు. ఇక నుంచి ఇంట్లో ఎవరు తనకు ఏం చెప్పాలి అన్నా వల్లికే చెప్పాలి వల్లి తనకు చెప్తుందని చెప్పి వల్లికి తాళాలు ఇస్తారు. వల్లి కావాలనే తను అత్తయ్య తాళాలు తీసుకోవడం ఇష్టం లేకపోయినా మీరు చెప్తున్నారు అని తీసుకుంటున్నా అని తీసుకుంటుంది. తాళాలు తీసుకొని వల్లి మురిసిపోతుంది.
వేదవతి ఏడ్వడం చూసిన ధీరజ్ మనసులో మా అమ్మ ఇంత బాధ పడటానికి ఈ ఇళ్లు ఇలా అవ్వడానికి నువ్వే కారణం ప్రేమ అని అనుకుంటాడు. ఇక శ్రీవల్లి తాళాలు వచ్చిన సంతోషంలో పట్టు చీర కట్టుకొని నగలు వేసుకొని కళ్లజోడు పెట్టుకొని బులెట్ మీద తన పుట్టింటికి వెళ్తుంది. వల్లి తల్లిదండ్రులు దగ్గరకు వెళ్లి తన దర్జా చూపిస్తుంది. ఇంటి పెత్తనం తనకు వచ్చేసిందని చెప్తుంది. వల్లి తల్లిదండ్రులు ఎగిరి గంతేస్తారు. వల్లి తండ్రి వల్లితో సైకిల్ మీద ఇడ్లీ అమ్మలేకపోతున్నా ఒక ఇడ్లీ బండి కొన్నివ్వమని అంటాడు. వల్లి తల్లి అతన్ని తిట్టి ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంటే ఇంకా ఇడ్లీ బండీ దోసె పెనం అంటావేంటి బుద్ధి లేకుండా అని తిడుతుంది. కూతురితో నిన్ను ఏ ఉద్దేశంతో ఆ ఇంటికి కోడల్ని చేశానో ఆ అవకాశం మనకి దక్కింది. ఆ ఇంటిని ఆస్తిని నువ్వు గుప్పెట్లో పెట్టుకోవాలి ఆ ఇంట్లో నువ్వు ఎదురు లేని మనిషిలా ఉండాలని అంటుంది. శ్రీవల్లి సరే అని ఇక నుంచి నా తోడి కోడళ్లకి నా సత్తా ఏంటో చూపిస్తా అని అంటుంది.
నర్మద, ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇద్దరూ వల్లికి ఇంటి తాళాలు ఇవ్వడం గురించి మాట్లాడుకుంటారు. వల్లి పుట్టింటి గురించి కనిపెట్టేసుంటే ఈ ప్రాబ్లమ్ వచ్చేదే కాదని కానీ ప్రేమ డ్యాన్స్ క్లాస్ వల్లీ అన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయని అనుకుంటారు. ఇక వాళ్ల ముందు నుంచి ధీరజ్ వెళ్తే నర్మద చూసి ప్రేమకి చెప్తుంది. ప్రేమ ధీరజ్‌ని పిలిస్తే పట్టించుకోడు. దాంతో నర్మద నువ్వు ధీరజ్ మాట్లాడుకుంటున్నారా లేదా అని అడిగితే ప్రేమ నిజం దాచేసి కొంచెం కోప్పడ్డాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడని అంటుంది. నర్మద ప్రేమ మాటలు నమ్మి పోనీలే మీరు మాట్లాడుకుంటున్నారు అదే చాలు అంటుంది. ఇక ప్రేమ సాగర్ బావ నీతో మాట్లాడుతున్నారా అక్క అని అడుగుతుంది. సాగర్ తనతో మాట్లాడకుండా ఉండలేడని వెంటనే మాట్లాడేశాడని చెప్తుంది. దానికి ప్రేమ నా వల్ల మీరు మాట్లాడుకోవట్లేదని బాధ పడ్డాను అక్క ఇప్పుడు హ్యాపీ అని అంటుంది. ఇంతలో సాగర్ వచ్చి నర్మద ముందు బండి ఆపుతాడు. నర్మద సాగర్ అని పిలవగానే వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!





















