Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: నర్మద రహస్యం ఛేదిస్తుందా? ఆనందరావు, భాగ్యంల పారిపోయే ప్రయత్నం.. కామెడీ!
Illu Illalu Pillalu Serial Today Episode August 11th వేదవతికి రామరాజు ప్రేమ విషయంలో జరిగిన పొరపాటునకు సారీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ఆనంద్‌రావు గాయాలకు శ్రీవల్లి మందు పెడుతుంది. నర్మద, ప్రేమలు ప్రశ్నల మీద ప్రశ్నలు బాణాల్లా సందిస్తారు. భర్త దొరికిపోయేలా ఉన్నారని భాగ్యం అనుకుంటుంది..
నర్మద: బాబాయ్ గారు మీరు నిజంగా విష్ చేయడానికే వచ్చారా.. అలా అయితే కేక్, గిఫ్ట్ ఏం తీసుకురాకుండా వచ్చారేంటి.
భాగ్యం: మనసులో ఇలా ఇరికించేసింది ఏంటి.
ఆనంద్రావు: కేక్ తీసుకొచ్చాను కంగారులో ఎక్కడో పడిపోయింది.
నర్మద: అది కాదు బాబాయ్..
వల్లి: నర్మద ఆపు ఇంక.. ఇప్పటికే మా నాన్నకి ఇంత అవమానం జరిగింది. మీరు ఇంక దొంగని ప్రశ్నించినట్లు ఎందుకు అన్ని అడుగుతారు. అయిపోయింది కదా వదిలేయండి.
అందరూ వల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తారు. నర్మద వల్లిని హగ్ చేసుకొని ఈ రోజు నీ పట్టిన రోజు కాదని నాకు తెలుసు. ఈ దొంగ పుట్టిన రోజు వెనక మీ నాన్న ఆ ఇంట్లో దొరికిపోవడం వెనక ఏదో కారణం ఉందని నాకు తెలుసు. అదేంటో త్వరలోనే తేల్చుతా. ఏది ఏమైనా నీ దొంగ పుట్టిన రోజుకి శుభాకాంక్షలు అని చెప్పి వల్లిని భయపెడుతుంది నర్మద.
ధీరజ్ ప్రేమతో గొడవ పడతాడు. మీ వాళ్లకి బుద్ధి బుర్రా ఏం లేదు.. అతను ఇళ్లు కన్ఫ్యూజ్ అయి వెళ్లానని చెప్పినా రాత్రంతా కట్టేస్తారా.. దొంగ అని చితక్కొడతారా అని అంటాడు. ఏం జరిగిందో తెలీదు కదా మా వాళ్ల గురించి మాట్లాడకు అని ప్రేమ అంటుంది. ఇన్నాళ్లు మా మీద పడ్డారు ఇప్పుడు మా బంధువులు మీద పడ్డారు మీ వాళ్లు రాక్షసులు అని అంటాడు. మా వాళ్లని అంటే ఊరుకోను అని ప్రేమ అంటుంది. ఇద్దరూ గొడవ పడతారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు కొట్టుకొని ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇద్దరూ సైలెంట్ అయిపోతారు.
భాగ్యం తిప్పుకుంటూ బయటకు వెళ్లి ఎవరూ లేకపోవడంతో భర్తని పిలుస్తుంది. ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు లాగించేద్దాం అని అనుకొని గేట్ తీస్తారు. ఇంతలో నర్మద చూసి వాళ్లని చూడనట్లు ఫోన్ మాట్లాడటం చూసి మనల్ని చూసి కూడా చూడనట్లు నటిస్తుందని అనుకుంటారు. ఇద్దరూ తమ ఇంటికి ఇలాంటి గేట్ బాగుంటుందా ఎదురింటిలాంటి గేటు బాగుంటుందా అని అనుకుంటూ జలకాలాట్లో అని పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తారు. నర్మద వాళ్లు వెళ్లినప్పుడు ఫాలో అవ్వకుండా ఉండాలి అంటే ఇంటి వెనక గోడ దూకి పారిపోదాం అని అనుకుంటారు. గోడ దూకడానికి ఆనంద్‌రావు గోడ ఎక్కుతాడు. మధ్యలో కాలి నరం పట్టేస్తుంది. ఆనంద్ రావు ఎక్స్‌ప్రెషన్స్ నవ్వులు పూయిస్తాయి. ఆనంద్‌రావు గోడ దూకేస్తాడు. భాగ్యం దూకే టైంకి ప్రేమ చూసేస్తుంది. దాంతో నాటకం మొదలు పెడతారు. బావగారు మంచిగా గోడ కట్టించలేదు.. మనం ఆ బాధ్యత తీసుకొని చైనా గోడ కట్టించేయాలి అని అనుకుంటారు. ఈ సారి చిలుకా క్షేమమా అని పాడుతారు. ముందు నుంచి వెళ్లలేం వెనక నుంచి వెళ్లలేం.. ముందు చిరుత పులి.. వెనక పెద్ద పులి అని అనుకుంటారు. ఈ ఇంట్లో ఉంటే ఏ ప్రమాదం ఎలా వస్తుందో తెలీదు అని ఆనంద్ రావు అంటాడు.
రామరాజు ఇంటికి డెకరేషన్ చేస్తారు. అందరూ ట్రెడీషనల్‌గా రెడీ అయింటారు. తొలి పంటధాన్యం ట్రాక్టర్‌లో ఇంటికి వస్తుంది. రామరాజు బుజ్జమ్మా అని వేదవతిని పిలిచి తలి పంట ధాన్యం తీసుకోని దేవుడి దగ్గర పెట్టమని అంటాడు. నేనేం తీయను మీరు తీసుకోండి అని వేదవతి అలిగి వెళ్లిపోతుంది.రామరాజు వేదవతి దగ్గరకు వెళ్లి నాకు ఈ సిరి సంపద, పిల్లలు అన్నీ నీవల్లే వచ్చాయి.. రామరాజు గాడు దగ్గర నుంచి రామరాజు గారు వరకు మొత్తం నీవల్లే. నువ్వు నా అదృష్టం బుబ్జమ్మా ఇదంతా నీ వల్లే నవ్వు నా జీవితాన్ని కూడా మార్చేశావు. నువ్వు నా లక్ష్మీ దేవివి కూడా బుజ్జమ్మా. నువ్వు నన్ను ప్రేమించినంతగా నిన్ను అర్థం చేసుకోలేకపోయా చిన్న పొరపాటు వల్ల నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నన్ను క్షమించు బుజ్జమ్మా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















