అన్వేషించండి

Guppedantha Manasu Serial Today July 5th: గుప్పెడంత మనసు సీరియల్: నీ తల్లిలానే పెళ్లి కాకుండానే సంసారం చేస్తావా: మనుతో దేవయాని, సరోజా వర్సెస్ వసు, బుక్కైపోయిన రంగ!

Guppedantha Manasu Serial Today Episode మను, ఏంజెల్ దగ్గరకు వచ్చిన దేవయాని అనుపమలా పెళ్లి కాకుండానే మను కాపురం చేసి మోసం చేస్తాడని చెప్పి అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Guppedantha Manasu Today Episode వసుధార స్కూల్ దగ్గర రంగతో త్వరలోనే మీరే మీ నోటితో రిషి అని ఒప్పుకునేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. రంగ వసు పడిపోతుంటే పట్టుకోవడం, వసు ఛాలెంజ్ చేయడం దూరం నుంచి చూసిన సరోజా బుజ్జితో వసు అన్నంత పని చేస్తుందని, తన బావని రిషిసార్‌లా మర్చేసేలా ఉందని టెన్షన్ పడుతుంది. ఇక బుజ్జి సరోజాతో ఎప్పుడు అన్న వెంట ఎందుకు పడతావ్ అని తనని సెట్ చేసుకోమని అంటాడు. దీంతో సరోజా బుజ్జిని చితక్కొడుతుంది. 

మను, ఏంజెల్ వసు గురించి ఆలోచిస్తారు. మహేంద్ర బా చూస్తే ఎలా ఓదార్చాలో తెలీడం లేదు అని మను అంటాడు. ఇక రిషి విషయంలో అందరూ వసుని నమ్ముంటే బాగుండేది అని ఏంజెల్ అంటుంది. కాలేజ్ ఎలాంటి పరిస్థితుల్లో శైలేంద్ర చేతుల్లోకి వెళ్లకూడదు అని అంటుంది. నేను దాని కోసమే ప్రయత్నిస్తున్నాను అని అంటాడు. ఇంతలో దేవయాని, శైలేంద్ర అక్కడికి వస్తారు. దేవయాని మను, ఏంజెల్‌లను ఉద్దేశించి కాలేజ్ లవర్స్ అడ్డా అయిపోయిందని ఎగతాళిగా మాట్లాడుతుంది. 

దేవయాని: కాలేజ్ పరువు పోతుంది. రోజు రోజుకు దిగజారిపోతుంది. నీకు ఏ పదవి లేకపోయినా నువ్వు కాలేజ్ కోసం తపన పడుతున్నావు నాన్న. కానీ తండ్రి ఎవరో తెలీని వాళ్లకి కాలేజీ బాధ్యతలు అప్పగిస్తే ఏం చేస్తారు. ఇలానే సోది మచ్చట్లు పెడతారు.
ఏంజెల్: కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. తప్పుడు పనుు చేసేది అడ్డదారులు తొక్కేది మీరు.  మేం కాదు.
దేవయాని: అవునవును తెలిస్తూనే ఉంది. ఏం మను నువ్వు కూడా మీ అమ్మలా పెళ్లి కాకుండానే కాపురం చేసేలా ఉన్నావే.
ఏంజెల్: స్టాపిట్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా కొంచెం కూడా ఆలోచించరా. మర్యాద లేకుండా మాట్లాడుతున్నారేంటి.
దేవయాని: ఏంటి మీకు మర్యాద ఇచ్చేది. మర్యాద ఇవ్వాలి అన్నా ఓ అర్హత ఉండాలి. అసలు మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు. ఇది మీ ఇళ్లు అనుకున్నారా. గెస్ట్‌ హౌస్ అనుకున్నారా. 
శైలేంద్ర: ఈ కాలేజీనే పెద్ద గెస్ట్‌ హౌస్‌లా మార్చేశారు. 
దేవయాని: అసలు నువ్వు ఏ పని మీద ఇక్కడికి వస్తున్నావ్. మీ కాలేజ్ మీకు ఉంది కదా దాన్ని చూసుకోకుండా ఏ హక్కుతో ఇక్కడికి వస్తున్నావ్.
ఏంజెల్: మా బావ దగ్గరకు రావాలి అంటే నాకు హక్కు ఉండాలా.  
దేవయాని: భలే బావ.. తండ్రి ఎవరో చెప్పుకోలేని బావ. భర్త ఎవరో చెప్పకోలేని అత్త.. అన్నీ మీకే చెల్లుతున్నాయి.
మను: మేడం గారు మౌనంగా ఉన్నాను అని మాటలు జారొద్దు. 
దేవయాని: మను నీకు ఇప్పటి వరకు తండ్రి ఎవరో తెలీదు. తెలుస్తుంది అని గ్యారెంటీ లేదు. ఏంజెల్ నువ్వు ఈ మనుతో జాగ్రత్త. నిన్ను కూడా మోసం చేస్తాడు. ఎంతైనా తండ్రి బుద్ధులు వచ్చుంటాయి కదా. 
ఏంజెల్: మీరు ఇన్ని మాటలు అంటున్నారు కదా. నేను మా అత్తయ్యకి చెప్తాను. బావ పద..

సరోజా: అమ్మమ్మ బావకి మంచి చెడు చెప్పవా. బావ ఆ పిల్ల చేయి పట్టుకున్నాడు. బావని ఎవరైనా కనెత్తి చూస్తే నాకు నచ్చడం లేదు. అలాంటిది చేయి పట్టుకుంటే నేను ఎలా ఊరుకుంటాను. బావ కూడా ఈ మధ్య మారినట్లు అన్నట్లు ఉంది. ఇంకెందుకు ఆలస్యం బావకి రిషిసార్ అని పేరు పెట్టేయండి. పేరు మార్చితే చాలు పెళ్లి కూడా అయిపోయినట్లే. రేషన్ కార్డు చేయిస్తే చాలు ఊరిలో వాళ్లు కూడా నమ్ముతారు. ఇక ఇద్దరూ కలిసి కొత్త కాపురం పెట్టేస్తే అయిపోతుంది.
రంగ: ఇక ఆపుతావా. ఏం మాట్లాడుతున్నావ్ సరోజా నోటికి ఏం వస్తే అది మాట్లాడటమేనా. అసలు నీకు ఈ మధ్య ఏమైంది. 
సరోజా: తను ఏవేవో ఊహించుకొని నీ వెంట పడుతుంది. 
రంగ: నువ్వే అంటున్నావ్ కదా తను ఊహించుకుంటుంది అని మరి ఈ రాద్దాంతం ఎందుకు.
సరోజా: నువ్వెందుకు ఆ అమ్మాయి కోసం అంత ఆరాటపడుతున్నావ్. ఎందుకు రాసుకొని పూసుకొని తిరుగుతున్నావ్. ఎందుకు తనకి అంత ఛాన్స్ ఇస్తున్నావ్. తనని చూస్తే ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉంది. నువ్వు తన మీద ప్రేమ చూపిస్తున్నావ్ బావ.
రంగ: నీకు నా మీద నమ్మకం లేదా.
సరోజా: తను నిన్ను మభ్యపెట్టేస్తుంది. నాకు కాకుండా చేసేస్తుంది. 
వసు: నీకు కాకుండా చేయడం ఏంటి తను నా భర్త నా రిషి సార్. 
రంగ: మేడం గారు మీరు ఆపుతారా మీ వల్లే అసలు ఇదంతా. 
వసు: మనిద్దరం భార్య భర్తలం మన మధ్యలో తనెవరు.
సరోజా: అసలు నువ్వు ఎవరే.. నా బావని ఎత్తుకుపోవాలి అని చూస్తున్నావా. 
వసు: తనే నా రిషి సార్. తను ఎందుకో నటిస్తున్నారు. అది మీకు ముందు ముందు తెలుస్తుంది. 
సరోజా: ఏంటే తెలిసేది అసలు నువ్వు ముందు ఇక్కడినుంచి పో.
రంగ: సరోజా నువ్వు అసలు మనిషేనా. మేడం గారు మీరు నా మాట విని ముందు గదిలోకి వెళ్లిపోండి. చూడు సరోజా మేడం గారిని పంపేయాలి అంటే ఒక్క నిమిషం చాలు కానీ నీకు ఇంతకు ముందు కారణం చెప్పాను కాదా. తన కోసం రౌడీలు తిరుగుతున్నారు. తనకి ఏమైనా అయితే మనదే ఆ బాధ్యత. పాపం. తను నన్ను రిషి సార్ అంటుంటే నాకు కోపం వస్తుంది. గట్టిగా తన మీద అరవాలి అనిపిస్తుంది. కానీ ఆ డాక్టర్ మాటలు గుర్తు చేసుకొని ఏం అనలేకపోతున్నాను. ఇంకొన్నాళ్లు చూద్దాం. లేదంటే నేనే గట్టిగా చెప్పేస్తా. నేను తన భర్త కాదు అని.. 

త్వరలో మనం పెళ్లి చేసుకుందామని సరోజా అంటే రంగ తనకు ఇష్టం లేదు అనేస్తాడు. సరోజా చిన్నప్పటి నుంచి ఊహించుకుంటున్నాను అని తన అమ్మమ్మకి కంప్లైంట్ ఇస్తుంది. మా ఇద్దరికీ పెళ్లి చేయాలి అని నీకు లేదా అని అడుగుతుంది. దాంతో రంగ మనసు కాదు అని ఏం అనలేను అని అంటుంది. దీంతో ఇవాళ్ట ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ మిస్టరీని జాను కనిపెట్టేస్తుందా.. తనతో పాటు కలిసున్నది లక్ష్మి అని మిత్రకు తెలిసిపోతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget