అన్వేషించండి

Guppedantha Manasu March 7th Episode: కొత్త జంట పోస్టర్స్ రచ్చ , దేవయానికి షాకిచ్చిన శైలేంద్ర - గుప్పెడంతమనసు మార్చి 7 ఎపిసోడ్!

Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu March 7th Episode:  (గుప్పెడంతమనసు  మార్చి 7th ఎపిసోడ్)

మ‌ను అడ్డు త‌ప్పించి వ‌సుధార‌ను త‌న సొంతం చేసుకోవ‌డానికి కొత్తజంట అంటూ పోస్టర్స్ కాలేజీ గోడలపై అతికిస్తాడు. ఈ విషయం శైలేంద్రకి చెబితే అయిపోతుంది అనుకుని కాల్ చేస్తాడు కానీ  శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయ‌డు. ఈ పోస్టర్స్ అన్నింటినీ వీడియో తీసి భయ్యా దగ్గరకు వెళ్లి చూపిస్తాను అంటూ మొత్తం వీడియో తీస్తాడు. రేప‌టితో నాకు ప‌ట్టిన శ‌ని వ‌ద‌ల‌బోతుంది. నువ్వు నా సొంతం కాబోతున్నావ‌ని వ‌సుధారను ఊహించుకుని ఆనందపడతాడు రాజీవ్.  అర్థరాత్రి శైలేంద్ర ఇంటికి దొంగచాటుగా వెళతాడు. ఆ టైమ్ లో రాజీవ్ ను చూసిన శైలేంద్ర అరుస్తాడు...ఆ అరుపు విని ధరణి నిద్ర లేస్తుంది..ఎవ‌రో ఇంట్లోకి వ‌చ్చిన‌ట్లుగా త‌న‌కు అనిపించింద‌ని  అనుమాన‌ప‌డుతుంది. ధ‌ర‌ణికి క‌నిపించ‌కుండా మంచం కింద దాక్కుంటాడు రాజీవ్‌. అనుకోకుండా రాజీవ్ చేతిని ధ‌ర‌ణి తొక్కేస్తుంది. బాధ‌తో రాజీవ్ అరుస్తాడు. ఆ అరుపు విని ధ‌ర‌ణి కంగారు మ‌రింత పెరుగుతుంది. మంచం కింద‌కు చూడ‌బోతుంటే ఆమెను శైలేంద్ర ఆపేస్తాడు. నిద్రమత్తులో నీకు అలా అనిపించింది అంతే అని చెప్పి..నువ్వెళ్లి ట్యాబ్లెట్స్ తీసుకురా అని చెప్పి పంపించేస్తాడు...

Also Read: కాలేజ్ గోడలపై కొత్త ప్రేమ జంట పోస్టర్స్ - అనుపమపై ప్రశ్నల వర్షం కురిపించిన ఏంజెల్ ,- గుప్పెడంతమనసు మార్చి 6 ఎపిసోడ్

ధరణి వెళ్లిపోగానే బ్రదర్ బయటకు రా అని పిలిచి బయటకు లాక్కెళతాడు...
శైలేంద్ర: ఈ టైమ్‌లో ఇంటికి ఎందుకొచ్చావ‌ని రాజీవ్‌పై  సీరియ‌స్ అవుతాడు.
రాజీవ్: కాలేజీలో నేను చేసిన ప‌ని గురించి నీకు చెప్పాల‌నే వ‌చ్చాన‌ంటూ...వ‌సుధార‌, మ‌ను పోస్ట‌ర్స్ కాలేజీలో అంటించిన వీడియోను శైలేంద్ర‌కు చూపిస్తాడు 
శైలేంద్ర: ఆ వీడియో చూసి  ఆనంద‌ప‌డ‌తాడు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం వేసిన ప్లాన్స్ ఓ ఎత్తు అయితే...ఈ ప్లాన్ మ‌రో ఎత్తు. ఈ ప్లాన్‌ ఫెయిల‌య్యే స‌మ‌స్యే లేద‌ు
రాజీవ్: రేపు వ‌సుధార నా సొంతం, ఎండీ సీట్ నీ సొంతం అంటూ రాజీవ్ ని పొగిడేసి ఇక నువ్వెళ్లు అని పంపించేస్తాడు...

ALso Read:  'గుప్పెడంతమనసు' రిషి రీ-ఎంట్రీపై వసుధార క్లారిటీ ఇచ్చేసింది!

స్టూడెంట్స్ అందరూ గుంపులుగా వెళ్లడం చూసి ఓ లెక్చరర్ పిలిచి ఏమైందని అడుగుతాడు...కాలేజీ గోడలపై ఎవో పోస్టర్స్ అంటించి ఉన్నాయని చెప్పడంతో అందరూ అటు వెళతారు....

మరోవైపు కాలేజీకి తొందరగా రెడీ అవమని చెప్పాను కదా అని అరుస్తుంటాడు శైలేంద్ర..ఇంతలో వచ్చిన దేవయాని ఏంటో చాలా హ్యాపీగా ఉన్నావ్ ఎందుకో చెబితే నేను కూడా హ్యాపీగా ఫీలవుతా అంటుంది దేవయాని. ఇంతలో ధరణి నేను రెడీ అంటూ వస్తుంది.  తనని కాలేజీకి తీసుకెళ్లడం నమ్మశక్యంగా లేదంటుంది దేవయాని. అలా అంటావేంటి ఇదేం బాలేదు...తనకి బయట ప్రపంచాన్ని చూపించాలి కదా అని రిప్లై ఇస్తాడు.  కాలేజీలో సెల‌బ్రేష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని, ఆ సెల‌బ్రేష‌న్స్ ఏమిటో మేము వ‌చ్చిన త‌ర్వాత నీకే అర్థ‌మ‌వుతాయ‌ని ఆశీర్వదించమని అడుగుతాడు. దేవయానితో శైలేంద్ర మాటతీరు చూసి ధరణి అలాగే చూస్తుంటే ఏంటి షాకయ్యావా అని అడుగుతాడు...

దేవయాని: నేను కూడా  వస్తాను
శైలేంద్ర :నీకెందుకు శ్రమ..నువ్వు ఇక్కడే ఉండు
దేవయాని: నేను రావాలి అనుకుంటున్నాను
శైలేంద్ర: ధరణి చూస్తే సరిపోతుంది..వచ్చాక పూసగుచ్చినట్టు నీకు చెబుతుంది
దేవయాని: వెళుతూ వెళుతూ చంకలో పిల్లెందుకు
శైలేంద్ర: తను నా పక్కన ఉండడం నాకు అవసరం
దేవయాని: అంటే తల్లిని దూరం పెడుతున్నావన్నమాట..నువ్వు మారిపోయావ్..అందుకే ఎప్పుడూ నా మాట కాదనని నువ్వు నా మాట లెక్కచేయడం లేదు
శైలేంద్ర: ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు..నిన్ను కాలేజీకి తీసుకెళ్లడం కుదరదు

Also Read: మహా శివరాత్రి రోజు మీ రాశిప్రకారం పఠించాల్సిన మంత్రం ఇదే!

రాజీవ్ అంటించిన పోస్ట‌ర్స్  పై కాలేజీలో పెద్ద రచ్చ జరుగుతుంది.  కొత్త ప్రేమ జంట అంటూ పోస్ట‌ర్స్‌పై శైలేంద్ర కామెంట్స్ చేస్తాడు.  అనుప‌మ ఫైర్ అవుతుంది. అప్పుడే కాలేజీకి వ‌చ్చిన వ‌సుధార ఆ పోస్ట‌ర్స్ చూసి షాక‌వుతుంది. కావాల‌నే మ‌న‌పై క‌క్ష గ‌ట్టి ఎవ‌రో ఈ పోస్ట‌ర్స్ అంటించార‌ని మ‌హేంద్ర ఆవేశ పడతాడు. పోస్ట‌ర్స్ చించ‌బోతుంటే శైలేంద్ర అడ్డుకుని... ఒక్క పోస్ట‌ర్ చించేయ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని, కాలేజీ మొత్తం ఈ పోస్ట‌ర్స్ అంటించార‌ని అంటాడు. అప్పుడే మ‌ను కాలేజీలోకి అడుగుపెడ‌తాడు. తను కూడా పోస్ట‌ర్స్ చూసి షాక‌వుతాడు. ఈ పోస్ట‌ర్స్ మ‌నునే అంటించాడ‌ని స్టూడెంట్స్‌, లెక్చ‌ర‌ర్స్‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తాడు శైలేంద్ర‌. అంద‌రూ అదే నిజమని నమ్ముతారు...తాను అంటించలేదని చెప్పినా ఎవ్వరూ వినరు...

ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది... గుప్పెడంతమనసు మార్చి 8 ఎపిసోడ్ లో అసలు విషయం తెలుస్తుంది...ఆ పని మను చేయలేదని వసుధార నమ్ముతుందో లేదో మరి...

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Embed widget