అన్వేషించండి

Guppedantha Manasu March 6th Episode: కాలేజ్ గోడలపై కొత్త ప్రేమ జంట పోస్టర్స్ - అనుపమపై ప్రశ్నల వర్షం కురిపించిన ఏంజెల్ ,- గుప్పెడంతమనసు మార్చి 6 ఎపిసోడ్

Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu March 6th Episode:  (గుప్పెడంతమనసు  మార్చి 6th ఎపిసోడ్)

ఏంజెల్ ని కాలేజికి పిలిచిన వసుధార..మను గురించి ఆరా తీస్తుంది. కానీ ఏంజెల్ మాత్రం తన గురించి ఏమీ తెలియదని, కేవలం నువ్వు పరిచయం చేసినప్పుడే తెలిసిందని, తనని ఫస్ట్ టైమ్ చూసానని క్లారిటీ ఇస్తుంది. ఎందుకలా అనిపించిందని ఏంజెల్ అడిగితే.. అనుపమ మేడంకి మనుకి ఏదో బంధం ఉందనిపిస్తోందనే తన డౌట్ బయటపెడుతుంది. అనుపమ మేడంని అత్తయ్య అని ఎందుకు పిలిచారని అడిగిన విషయం చెబుతుంది ఏంజెల్...ఇంతలో మను ఎంట్రీ ఇస్తాడు. లోపలకు రమ్మని పిలుస్తుంది ఏంజెల్.  ఏం మాట్లాడుకుంటున్నారని అడిగితే వసుధార దాస్తుంది కానీ ఏంజెల్ మాత్రం అడిగేస్తే అయిపోతుంది కదా అని మా అత్తయ్య మీకెలా తెలుసు - మా అత్తయ్యకి మీరెలా తెలుసు అని అడుగుతుంది...
మను: ఎందుకు అలా అడుగుతున్నారు
ఏంజెల్: మా అత్తయ్య మీకు ముందే తెలుసేమో అని..మొన్న తన గురించి కూడా అడిగారు కదా 
మను: అలా అడిగినంత మాత్రాన ముందే తెలియడానికి ఏముంది...
ఇంతలో అక్కడకు వచ్చిన శైలేంద్ర...అందరకీ గుడ్ మార్నింగ్ చెబుతాడు వెటకారంగా...ఏంజెల్ ని చూసి...కాలేజీకి సంబంధం లేని మీరు కూడా వచ్చారా అని అవమానిస్తుంటాడు...దేనిగురించో తీవ్రంగా చర్చిస్తున్నట్టున్నారని ఏదేదో మాట్లాడుతాడు
వసు: విష్ చేశావ్ ఓకే..మళ్లీ ఏదేదో మాట్లాడుతావేంటి
శైలేంద్ర: బాగా ఆనందంగా ఉన్నట్టున్నారు..దేని గురించో డిస్కస్ చేస్తున్నట్టున్నారు..నాక్కూడా చెబితే నేనుకూడా పార్టిసిపేట్ చేస్తాను కదా
వసు: కానీ నీతో డిస్కస్ చేయడం మాకు ఇష్టం లేదు..ఇక మీరు వెళ్లొచ్చు..
నేను రాజీవ్ కలసి చేస్తున్న ప్లాన్ తో మీకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు....
ఇంకా ఉన్నారేంటి వెళ్లండి అన్న వసుధారతో..పరాయి వాళ్ల ముందు తక్కువ చేసి మాట్లాడడం సరికాదంటాడు... నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు వెళ్లు అని గట్టిగా చెబుతుంది...శైలేంద్ర వెళ్లిపోతాడు...

Also Read: రిషి రీ-ఎంట్రీకి టైమొచ్చేసింది , కాలేజ్ లో మను-వసు పోస్టర్స్ ,గుప్పెడంతమనసు మార్చి 5 ఎపిసోడ్

వసుధార తండ్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా రాజీవ్ ఎదురుపడతాడు...
రాజీవ్: వ‌సుధార‌ను నాతో పెళ్లికి ఒప్పించ‌ండి లేదంటే తన పరువు తీస్తానని బెదిరిస్తాడు.  
చక్రపాణి: నువ్వు ఏమీ చేయలేవు
రాజీవ్: నన్ను ఎంత ప్రేమగా చూసేవారు...ఇప్పుడు మీరే వెధవ అంటున్నారు..
చక్రపాణి: అల్లుడివి కాబట్టి సరిపోయింది లేదంటే నిన్ను ఏం చేస్తానో తెలియదు...మర్యాదగా వెళ్లిపో
రాజీవ్: జేబులోంచి తాళిబొట్టు తీసి చూపించి ఇది వసు మెడ‌లో క‌ట్టాల్సిన తాళి ఇది. త‌న మెడ‌లో తనే తాళి క‌ట్టుకుని ఇదివ‌ర‌కు త‌ప్పించుకుంది. ఇప్పుడు వ‌సుధార మెడ‌లో ఈ తాళి ప‌డే టైమ్ వ‌చ్చింది.  అలా జ‌ర‌గ‌క‌పోతే నా విశ్వ‌రూపం చూపిస్తాన‌ు.
చక్రపాణి: ఇలాంటి విశ్వ‌రూపాలు చాలా చూశాన‌ు ఇక్క‌డి నుంచి వెళ్లిపో అని రివర్సవుతాడు
రాజీవ్ వెళ్లిపోగానే వ‌సుధార‌కు ఫోన్ చేస్తాడు చ‌క్ర‌పాణి. మళ్లీ వెనక్కు వచ్చి ఫోన్ లాక్కుంటాడు
రాజీవ్: మీ నాన్న నా గురించి రాక్షసుడు, దుర్మార్గుడు అని చెబుతున్నాడు కదా...మళ్లీ  మంచివాడిలా మారిపోయి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడ‌ని అనుకుంటున్నాన‌ు అని చెప్పేసి ఫోన్ చక్రపాణికి ఇచ్చేసి వెళ్లిపోతాడు...

ALso Read:  'గుప్పెడంతమనసు' రిషి రీ-ఎంట్రీపై వసుధార క్లారిటీ ఇచ్చేసింది!

అనుపమ-ఏంజెల్-మను
ఏంజెల్ కార్ స్టార్ట‌వ్వ‌క‌పోవ‌డంతో ఇబ్బంది ప‌డుతుంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మను...నన్ను చూడమంటారా అని అడుగుతాడు
అనుపమ: నువ్వేమైనా మెకానిక్‌వా 
మను: నేను చిన్న చిన్న రిపేర్లు చేయగలను
అనుపమ: మ‌ను కార్ రిపేర్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ు..క్యాబ్‌లో వెళ‌దామ‌ం
ఏంజెల్: మ‌ను టాపిక్ రాగానే అనుప‌మ సీరియ‌స్‌గా మారిపోవ‌డం ఏంజెల్ గ‌మ‌నించి...ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతున్నావ్
అనుపమ: ఇందులో సీరియస్ ఏముంది..మామూలుగానే చెబుతున్నా
ఏంజెల్: మనుని చూసేసరికి నువ్వు సీరియస్ అయిపోతున్నావ్... మీ ఇద్ద‌రి మ‌ధ్య ఏదైనా రిలేష‌న్ ఉందా, ఇద్ద‌రికి గ‌తంలో ప‌రిచ‌యం ఉందా? గొడ‌వ‌ల వ‌ల్ల విడివిడిగా ఉంటున్నారా 
అనుపమ: ఏమైనా ఉంటే నేనే చెప్పేదానిని క‌దా అని అనుప‌మ టాపిక్ డైవ‌ర్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.
ఏంజెల్: మీ ఇద్ద‌రు ఏదో దాస్తున్నారు. అది మీ క‌ళ్ల‌ల్లో క‌నిపిస్తోంది . మీ గ‌తం ఏమిటో నాకు ఇప్పుడే తెలియాల‌ని ఏంజెల్ ప‌ట్టుప‌డుతుంది. 
నేను ఒంట‌రిదానిని, నాకు ఏం గ‌తం లేద‌ని అనుప‌మ కోపంగా బ‌దులిస్తుంది. ఆమె మాట‌ల‌తో మ‌ను బాధ‌ప‌డ‌తాడు. ఈ డిస్క‌ష‌న్ ఇక అవ‌స‌రం అని అనుప‌మ స‌మాధాన‌మిస్తుంది.  వారి మ‌ధ్య జ‌రుగుతోన్న డిస్క‌ష‌న్‌ను దూరం నుంచి వ‌సుధార చూస్తుంది.

Also Read:  మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!

కాలేజీలో పోస్టర్స్
వ‌సుధార‌, మ‌ను క్లోజ్‌గా దిగిన ఫొటోల‌ను సీక్రెట్‌గా కాలేజీ మొత్తం అంటిస్తాడు రాజీవ్‌. కొత్త ప్రేమ జంట అని ఫొటోల‌పై రాస్తాడు. చాలా పెద్ద తప్పు చేస్తున్నాను, తప్పు అని తెలిసి కూడా చేయకతప్పడం లేదు... నీ ప‌రువు బ‌జారులో పెడుతున్నందుకు చాలా బాధ‌గా ఉంది..కానీ నువ్వు నా మాట వినడం లేదు అందుకే వీడి అడ్డుతప్పించి  నిన్ను నా సొంతం చేసుకోవ‌డానికే ఇలా చేస్తున్నాన‌ని అనుకుంటాడు...తెల్లారేలోగా పోస్టర్స్ క్యాంపస్ మొత్తం అంటించాలని ఫిక్సవుతాడు రాజీవ్...

ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...గుప్పెడంతమనసు మార్చి 7 ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉండబోతోందన్నమాట...

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Embed widget