Guppedantha Manasu September 3 Today Episode 546: రిషిధార చుట్టూ మరో కుట్ర, అసలు విషయం రిషి దగ్గర దాచిన వసు, మరోవైపు జగతి అండ్ కో పెళ్లి ఏర్పాట్లు
Guppedantha Manasu September 3 Today Episode 546: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( శనివారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 3 Today Episode 546)
వసుధారని కిడ్నాప్ చేసేటప్పుడు ఇచ్చిన మత్తుమందు ప్రభావంతో కళ్లు మూసుకుపోతుంటాయి. అయినప్పటికీ రిషి మాటలు గుర్తుచేసుకుని పరీక్ష రాస్తుంది వసుధార. అది చూసి జగతి-రిషి ఇద్దరూ సంతోషిస్తారు...దటీజ్ వసుధార అనుకుంటారు.. ఆ వెనుకే వచ్చిన మహేంద్ర టెన్షన్ పడొద్దు..ఎగ్జామ్ బాగా రాయగలుగుతుందని చెబుతాడు.
జగతి-మహేంద్ర-గౌతమ్... ముగ్గురూ రెస్టారెంట్ కి వెళతారు. ఇంతలో గౌతమ్ కి కాల్ రావడంతో అక్కడి నుంచి వెళతాడు.
మహేంద్ర: నాకిప్పటికీ వసుధార ఎగ్జామ్ రాస్తుందో రాయదో అనే టెన్షనే కళ్లముందు ఉంది..అసలు వసుధారకి ఏమై ఉంటుంది
అసలేం జరిగింది, రిషిని అడిగావా
జగతి: రిషిని అడగడం బావోదు..వసు చెబితేనే బావుంటుంది..అసలేం జరిగిందో మనకు తెలియదు..
మహేంద్ర: వసుధార వెనుక ఏదో జరుగుతోందని నాకు డౌట్ గా ఉంది..
జగతి: సాక్షి ఉంగరం విసిరేసి వెళ్లినప్పటి నుంచీ అక్కయ్యలో చాలా మార్పులొచ్చాయి..మొత్తానికి ఏదో జరుగుతోందన్న విషయం నాక్కూడా అర్థమవుతోంది..రిషిని అంతగా కావాలనుకున్న సాక్షి..రిషిని అంత తేలిగ్గా మరిచిపోతుందని నేను అనుకోవడం లేదు.
మహేంద్ర: సాక్షి ఇంకా రిషిని వెంబడిస్తోందేమో అనే అనుమానం ప్రారంభమైంది..ఏదేమైనా వసు-రిషి విషయంలో తొందరపడాలి..ఇద్దరికీ తొందరగా పెళ్లిచేసేయాలి. ఇద్దరితో మాట్లాడి దూకుడుగా ముందడుగు వేయకపోతే ప్రయోజనం లేదు
జగతి: తమరు వాళ్ల పెళ్లికి చాలా తొందర పడుతున్నట్టున్నారు
ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్..అంకుల్ నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది..రిషి-వసుకి పెళ్లిచేసేద్దాం అంటాడు..
మహేంద్ర-జగతి ఇద్దరూ ముఖాలు చూసి నవ్వుకుంటారు...
మహేంద్ర: భలేవాడివయ్యా గౌతమ్..మేం కూడా అదే మాట్లాడుకుంటున్నాం. వసు వాళ్లింటికి వెళ్లి మాట్లాడి లగ్నపత్రిక రాయించేద్దాం అంటాడు
ఏం ఆర్డర్ చేశారని గౌతమ్ అడిగితే..ఇంకా వసు రాలేదంటాడు మహేంద్ర. రెస్టారెంట్లో కనుక్కుంటే వసు ఈ రోజు డ్యూటీకి రానందని చెబుతారు. పరీక్షలు అయ్యాయి, వసు రెస్టారెంట్లో లేదు..రిషి ఎక్కడున్నాడో తెలియదు..దీని భావం ఏంటి అని ముగ్గురూ ముసిముసినవ్వులు నవ్వుకుంటారు.
Also Read: మోనితకు వాంతులు - దీపపై రివర్సైన కార్తీక్, మళ్లీ మొదటికొచ్చిన 'కార్తీకదీపం' కథ
పరీక్షలు అయిపోయాయంటూ వసుధార పిల్లలతో ఆడుకుంటుంది. ఇంతలో రిషి అక్కడకు రావడంతో చేయిపట్టుకుని ఒప్పులకుప్ప వయ్యారి భామ అంటూ తిరుగుతూ ఉంటుంది.
రిషి: ఏమైంది నీకు..ఏంటీతిరగడం..
వసు: పరీక్షలు అయిపోయాయన్న ఆనందంలో మేం ఆడుకుంటున్నాం.. మీరేంటి సడెన్ గా వచ్చారు
రిషి: అంత జరిగింది...నీకు ఏమైందో..ఎలా ఉన్నావో అని నేను వస్తే పాటలు పాడుకుంటున్నావా..
వసు: పరీక్షలు రాసేశాను కదా ఇక టెన్షన్ ఎందుకు
రిషి: రిజల్ట్ వచ్చాక ఎగ్జామ్ సంగతి తెలుస్తుంది..అసలు ఆ స్టోర్ రూమ్ లో నువ్వు ఎలా పడిపోయావ్, అంత మత్తులో ఎందుకున్నావ్, వచ్చిందెవరు వాళ్లని చూశావా..గుర్తు పట్టగలవా
వసు: ఇది సాక్షి పనే అయిఉంటుందని రిషి సార్ కి చెప్పకూడదు..వాళ్ల సంగతి నేనే చూసుకుంటాను అని మనసులో అనుకుంటుంది..వాళ్లని గుర్తుపట్టలేనని చెప్పేస్తుంది
రిషి: బాగా గుర్తుచేసుకో..ఇది ఈజీగా తీసుకునే విషయం కాదు...అలా ఎలా చేస్తారు..
వసు: ఈ విషయాన్ని మనసులోంచి తీసేయ్యడానికి ప్రయత్నిస్తున్నాను..
రిషి: జరిగినదేంటో తెలుసుకోవాలనే కానీ గుర్తుచేసి నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు అన్న రిషి.. ఎక్కడికి, ఏంటి అని అడగొద్దు పద వెళదాం అంటాడు..
Also Read: గుప్పెడంతమనసులో ఉప్పెనంత ప్రేమ, ఏడిపించేసిన రిషి - ఇక దేవయాని,సాక్షి పనైపోయినట్టేనా!
అటు మహేంద్ర ఫోన్లో..రిషి-వసు ఫొటోస్ చూస్తూ మురిసిపోతాడు.గౌతమ్-ధరణి కూడా వీళ్లకు తోడవుతారు. ఈ శుభ సందర్భంలో వదినను కూడా తీసుకుని అందరం రెస్టారెంట్ కి వెళదాం అంటాడు గౌతమ్. వాళ్లు అక్కడ లేరుకదా అని మహేంద్ర అంటే..రప్పిద్దాం అంకుల్ అంటాడు గౌతమ్. ఇదే మంచి అవకాశం అంటుంది ధరణి. తొందరపడకండి వాళ్లు సంతోషంగా ఉండటమే ముఖ్యం అని చెబుతుంది జగతి. ప్రతీసారీ వేదాంతం చెప్పొద్దు జగతి..కొన్నింటికి దూకుడుగా ఉంటేనే పనులవుతాయని మహేంద్ర అంటే..కరెక్ట్ చెప్పారు అంకుల్ అని గౌతమ్ అంటారు. దేవయాని అక్కయ్య ఎలా ఉన్నారని జగతి అడిగితే...సాక్షి- రిషి బంధం విడిపోయినందుకు వదినగారు కడుపుమంటని ఎవరిపై చూపించాలో తెలియక ఆవిడ చాలా కష్టపడుతూ ఉంటారు. మనం ఆవిడను ఓదార్చాలంటే.. మహేంద్ర అలా మాట్లాడొద్దు అంటుంది జగతి. ఇదంతా రూమ్ బయటే ఉండి వింటుంది దేవయాని.
Also Read:
దేవయాని: మీ నవ్వులన్నీ ఎలా మాయం చేయాలో నాకు తెలుసు అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.సాక్షి ప్లాన్ మొత్తం నాశనం చేసింది..సాక్షికి ఏ పని చెప్పినా కరెక్టుగా చేయదు..ఆవేశంలో కోపంలో ఉంగరం విసిరికొట్టి వెళ్లిపోయింది.. ఇప్పుడేమో చెప్పిన పని చేయడం లేదు అనుకుంటుంది..ఇంతలో సాక్షి ఫోన్ చేస్తుంది. చెప్పిన పని చేయడం సరిగ్గా రాదు, నీకసలు బుద్ధేలేదు..
సాక్షి: నేను చేయాల్సింది చేశాను, ఎలా కనిపెట్టారో తెలియదు
దేవయాని: పనులు అందరూ చేస్తారు..పర్ ఫెక్ట్ గా కొందరే చేస్తారు..నీకు తెలివితేటలు ఉండి ఉంటే యంగేజ్ మెంట్ అయ్యాక రిషి ఎందుకు వదులుకుంటాడు..రెండో అవకాసం వచ్చినప్పుడు నువ్వు రిషిని వదులుకున్నావ్..నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను అనుకోవాలి.. పరీక్షలు అయ్యాయి వాళ్లిద్దరూ తిరిగుతూ ఉంటారు..మనం ఒకరి కడుపుమంట మరొకరికి చెప్పుకుందాం. పరిస్థితులున్నీ మన చేయి దాటిపోతున్నాయి.
సాక్షి: ఓ అవకాశం చేయి దాటిపోయింది అంతే..రిషి మంచితనమే మనకు ఆయుధం.. రిషి వసుధారని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమే విషంగా మారుతుంది.. చిన్న అవకాశం చాలు రిషి-వసుని చేయడానికి. రిషిని డిస్టబ్ చేసే అవకాశం మీరు వెతకండి, వసుని వెళ్లగొట్టే దారి నేను వెతుకుతాను
నాకు చిరాగ్గా ఉంది మళ్లీ మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తుంది... నాకుండే ప్లాన్స్ నాకున్నాయ్ అనుకుంటుంది సాక్షి.. రిషిని ఎవ్వరికీ దక్కకుండా చేస్తాను...
ఎపిసోడ్ ముగిసింది....