Guppedantha Manasu November 13th Today Episode: మహేంద్రను అనుపమ దగ్గరకు తీసుకెళ్తున్న రిషిధార!
Guppedantha Manasu Serial Today Episode: జగతి చనిపోయిందన్న విషయం అనుపమకు తెలియదని రిషికి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Guppedantha Manasu Serial November 13th Episode: వసు ఫోన్‌లో శైలేంద్ర, దేవయాణికి వార్నింగ్ ఇస్తుంది. ఇకపై ఇలా ఫోన్లు చేసి కూపీలు లాగే ప్రయత్నాలు చేయొద్దని మందలిస్తుంది. ఇలాంటి పిల్ల చేష్టలు మానుకోమని అంటుంది. ఇక దేవయాని ఈ వసుధార ఆడ సివంగిలా తయారైందని శైలేంద్రతో అంటుంది. మరో వైపు అనుపమ తన ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంది. తమ బ్యాచ్ అందరికీ గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నాని తప్పకుండా రావాలని పిలుస్తుంది. అందరికీ కాల్ చేసి పిలుస్తుంది.
రిషి, వసు కాలేజ్‌లో ఉండగా ముకుల్ నుంచి రిషికి ఫోన్ వస్తుంది. దీంతో రిషి బయటకు వెళ్లిపోతాడు. ఇంతలో శైలేంద్ర వసు దగ్గరకు వస్తాడు.
శైలేంద్ర: నిన్నేంటి చాలా పొగరుగా మాట్లాడావ్
వసు: నేను మీకు ఇంతకు ముందే చెప్పా మీ నోటి నుంచి నన్ను పొగరు అనే మాట వస్తే నాకు చాలా కంపరంగా ఉంటుందని. ఇంకా ఎప్పుడూ అలా అనకండి అయినా నా పొగరు నా ఇష్టం. అయినా పొగరు అనేది నా సిగ్నేచర్.
శైలేంద్ర: పిన్ని బతికున్నప్పుడు ఇలా మాట్లాడావంటే ఓకే. కానీ పిన్ని చనిపోయిన తర్వాత కూడా నా ముందు ఇలా మాట్లాడుతున్నావంటే నీకు చావు అంటే భయం లేదా..
వసు: భయం ఉంది. దాని వెంటే ధైర్యం కూడా ఉంది. దాని పేరు రిషి సార్. అయినా మీరు కాలేజ్‌కు ఎందుకు వచ్చారు. మీకు ఏం పని లేదు కదా. ఓ అటెండర్ లేరు అని ఆ పని చేయడానికి వచ్చారా అని అడుగుతుంది. దీంతో శైలేంద్ర వసుపై కోపడుతుండగా రిషి వస్తాడు. వసు మా అన్నయ్యని ఏం అన్నావ్ అని అడుగుతాడు. అయితే శైలేంద్రను వసు ఇరికించేస్తుంది.
రిషి: ఇంత చిన్న విషయానికి వసుని మాటలు జాగ్రత్త అంటావ్ ఏంటి అన్నయ్య. నిజమే వసుకు పొగరు ఎక్కువే. ఒకరకంగా ఆ పొగరు చూసి నేను ఇంప్రెస్ అయ్యా. పొగరుతోనే తను అన్నీ నెగ్గుకొస్తుంది. తన గెలుపు వెనక ఉంది మూడు వంతులు ఆ పొగరే అన్నయ్య. వసుకి అదే ప్లస్ పాయింట్.
వసు: విన్నారా శైలేంద్ర సార్.. రిషి సార్‌కి నా పొగరు చాలా ఇష్టం కానీ మీరే ఆ పొగరును నెగిటివ్‌గా చూస్తున్నారు.
ఇక శైలేంద్ర ఏంటి రిషి ఇంకా విశేషాలు ఏంటి ఎంక్వైరీ ఎంత వరకు వచ్చింది. అని అడిగుతాడు. రిషి చెప్పబోతే వసు వచ్చి అడ్డుకుంటుంది. మరోవైపు రిషి, ముకుల్‌ను కలుస్తాడు.
ముకుల్: కొంత సమాచారం దొరికింది సార్. షూటర్ చనిపోవడానికి కొంత సమయం ముందు ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అతను ఎవరో వచ్చి కలుస్తా అన్నారు. ఆ వచ్చిన అతనే షూటర్‌ను చంపుంటాడని మాకు అనుమానం. డేటా హిస్టరీ కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ విషయాలు అన్నీ తెలిస్తేనే మనకు కేసు ఈజీ అవుతుంది. అయితే వాడు చాలా తెలివైన వాడు సార్. మనకు ఏ ఆధారం లేకుండా తెలివిగా ప్లాన్ చేశాడు.
రిషి: వాడు ఎంత తెలివైనా వాడు అయినా సరే మనకు వాడు దొరకి తీరాలి. నాకు వాడి డిటైల్స్ కావాలి. పోయిన అమ్మ ఎటూ తిరిగి రాదు. కానీ డీబీఎస్‌టీ కాలేజ్ మళ్లీ మళ్లీ చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే వాడు దొరికి తీరాలి. డాడ్ మామూలు స్థితికి వచ్చేలోగా వాడిని పట్టుకొని అమ్మను చంపింది వీడే అని డాడ్ ముందు వాడిని పెట్టాలి. డాడ్ ముందే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు మహేంద్రకు వాళ్ల ఫ్రెండ్స్ ఫోన్ చేసి రమ్మంటే నేను రాను అని చెప్తాడు. ఇంతలో మహేంద్ర ఫోన్‌కు అనుపన ఫోన్ చేస్తుంది. రిషి అనుపమతో మాట్లాడుతాడు. మీరు ఎందుకు మా డాడీకి ఫోన్ చేశారని అడుగుతాడు.
రిషి: మీకు మా డాడీ ఎలా తెలుసు
అనుపమ: మీకు అవన్నీ తెలియాలి అంటే నేను చెప్పిన ప్లేస్‌కు నువ్ మీ నాన్నని తీసుకురా అని చెప్తుంది. అంతే కాకుండా మీ అమ్మను కూడా తీసుకురా అని అనుపమ చెప్తే రిషి షాక్ అవుతాడు.
వసు: ఎవరు సార్
రిషి: అనుపమ.. వాళ్లు గెట్ టూ గెదర్ చేస్తున్నారు. డాడీని కూడా తీసుకురమ్మాన్నారు. నాకు ఓ విషయం అర్ధం కావడం లేదు. ఆవిడ డాడ్‌తో పాటు మా అమ్మని కూడా తీసుకురమ్మన్నారు. అందుకే డాడ్‌ని అక్కడికి తీసుకెళ్తే మనకు వీళ్ల గురించి తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. డాడ్ ఎందుకు ఆవిడతో మాట్లాడటం లేదు. అదీ కాకుండా మా అమ్మ చనిపోయిన విషయం డాడ్ ఎందుకు ఆమెకు చెప్పలేదు. మనం వెళ్తే ఇవన్నీ మనకు తెలిసిపోతాయి వసుధారు. వసుధార మనం ఆ ఫంక్షన్‌కు వెళ్తామంటే డాడ్ వంద శాతం రారు. అందుకే చెప్పకుండా వెళ్దాం.
అనుపమ: మహేంద్ర, జగతి మీరిద్దరూ కచ్చితంగా ఈ ఫంక్షన్‌కు రావాలి. నేను మీ ఇద్దరినీ ఒక్కదగ్గరకు చేస్తాను. ఎంత కాలం అని మీరు విడివిడిగా ఉంటారు. ఇక అలా ఉండకూడదు. కచ్చితంగా నేను మీ ఇద్దరినీ కలుపుతాను.
మరోవైపు రిషి వాళ్ల డాడీని రెడీ చెస్తాడు. ఇంతలో వసు కూడా వస్తుంది. అందరం వెళ్దామా అంటారు. మహేంద్ర ఎంత అడిగినా చెప్పకుండా ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నమని చెప్పి రిషి మహేంద్రను అనుపమ ఏర్పాటు చేసిన గెట్ టూ గెదర్‌కు తీసుకెళ్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.