అన్వేషించండి

Guppedantha Manasu మే 16 ఎపిసోడ్: వసుధార బుక్‌లో ప్రేమ లేఖ చూసి రిషి సీరియస్‌- ఇంట్లో పంచాయితీ పెట్టిన సాక్షి

కాలేజీలో జరిగిన అవమానంతో రగిలిపోయిన సాక్షి.. వసుధార, రిషి మధ్య రిలేషన్‌పై పంచాయితి పెడుతుంది.

ఇద్దరి మధ్య బొమ్మ కోసం డిస్కషన్ జరుగుతుంది. ఈ బొమ్మ గీసింది రిషి కాదని తేల్చేస్తుంది వసుధార. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో మీకు తెలుసని.. కానీ చెప్పడం లేదంటుంది. నేను కాదని ఎలా చెప్పగలవని ప్రశ్నిస్తాడు రిషి. స్వచ్ఛమైన వ్యక్తులు మాత్రమే గీయలగలరని మీకు అంత ఖాళీ లేదని తేల్చేస్తుంది వసుధార. మొత్తానికి ఆ డిస్కషన్ ఆపి ఇద్దరూ కారులో తిరుగు పయనమవుతారు. 

కారులో కూర్చున్న వసుధార ఏదో మల్లె పూల స్మెల్ వస్తుందని గుర్తిస్తుంది. వెనుక సీట్లో ఉన్న మల్లె పూలు చూస్తుంది. వాటిని చేతిలోకి తీసుకున్న వసుధార... అసలు వాటిని ఎందుకు కొన్నారు అని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పే ముందు బొమ్మ గురించి చెప్పేస్తాడు రిషి. ఆ బొమ్మ గీసింది తనేనని చెప్పేస్తాడు. ఇంతలో వసుధార సార్‌ సార్‌ అని పిలుస్తూ ఉంటుంది. వెంటనే డ్రీమ్‌ నుంచి ప్రెజెంట్‌లోకి వస్తాడు. పూలు ఎందుకు కొన్నాడో చెప్తాడు. ఆ బామ్మ చెప్పినట్టుగానే వసుధార మల్లెపూల గురించి చెబుతుంది. ఇంతలో కారు దిగిన వసుధార పూలు తీసుకుంటానని చెప్పి వెళ్లిపోతుంది. పూలు ఎవరికి చేరాలో వాళ్లకే చేరుతాయని బామ్మ చెప్పిన విషయం రిషికి గుర్తుకు వస్తుంది. 

బెడ్‌రూమ్‌లో కూర్చొని వసుధార కోసం ఆలోచిస్తుంటాడు రిషి. బొమ్మ తను గీసిన సంగతి చెప్పకుండా తప్పు చేశానని అనుకుంటాడు. 

ఇక్కడ వసుధార కూడా బొమ్మ, ప్రేమ లేఖ గురించి ఆలోచిస్తుంది. మల్లె పూలు రిషి సార్‌ ఇచ్చారని... ఈ రెండూ రిషి సారే  చేసి ఉంటారా అని అనుకుంటుంది. ప్రేమ లేఖ రాసిన వారి హ్యాండ్‌ రైటింగ్ చెక్ చేయాలని అనుకుంటుంది. బొమ్మ గీసిందెవరో రిషి సార్‌కు తెలుసని అయినా చెప్పడం లేదంటుంది. ఇదే విషయాన్ని రిషికి వాయిస్ మెసేజ్‌ పంపిస్తుంది. బొమ్మ గీసిందెవరో కనుక్కోవడమే నా శపథమని చెబుతుంది.
తీసుకొచ్చిన మల్లె పూలతో హార్ట్‌ సింబల్‌ క్రియేట్ చేసి బొమ్మ వేసిన వ్యక్తికి పంపించమని రిషికి సెండ్ చేస్తుంది. భరత్‌ అనే నేను రేంజ్‌లో శపథం చేస్తుంది వసుధార. 

జగతి, మహేంద్ర కాలేజీకి వస్తారు... రిషిలో మార్పు వచ్చిందని అందుకే దేవయానికి గట్టిగా సమాధానం చెప్తున్నాడని మహేంద్ర అంటాడు. ఆ బలమేంటో ఇద్దరికీ తెలుసని అంటుంది జగతి. ఇంతలో రిషి పిలిచాడని జగతి తన రూమ్‌కి వెళ్తుంది. 

స్కాలర్‌షిప్‌ టెస్టు కోసం వసుధారను బాగా ప్రిపేర్ చేయాలని జగతికి రిషి చెప్తాడు. తను చదువుతుంది కానీ... మీరు గైడ్‌ చేస్తా ఇంకా బాగా చదువుతుందని అంటాడు. ఇంతలో అక్కడికి సాక్షి వస్తుంది. ఆమెను చూసి షాక్ అవుతాడు రిషి. రిషీ పద వెళ్దామంటూ సాక్షి అడుగుతుంది. ఎప్పుడూ పనేనా... కాస్త ఫన్ ఉండాలని చెబుతుంది. సినిమాకు వెళ్దామని అడుగుతుంది. ఆ మాటతో క్లాస్‌ తీసుకుంటాడు రిషి. అంత టైం లేదు.. తీరిక లేదని చెప్పేస్తాడు. కాలేజీకి వచ్చి సినిమాకు వెళ్దామని అడగటం కరెక్ట్‌ కాదని చెప్పేస్తాడు. ఎవరు ఎక్కడ ఉండాలో తెలుసుకోమంటాడు రిషి. ఆఫీస్‌ అసిస్టెంట్‌ను పిలిచి ఎవర్ని పడితే వాళ్లను లోపలికి ఎందుకు రానిస్తున్నావని మందలిస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. 

రేపటి ఎపిసోడ్...
హ్యాండ్ రైటింగ్ చెక్‌ చేసుకోవాడనికి ప్రేమ లేఖను బుక్స్‌లో పెట్టుకొని తిరుగుతుంటుంది వసుధార. దాన్ని చూసి సీరియస్ అవుతాడు రిషి. వసుధారను తీసుకొని ఇంటికి వస్తాడు రిషి. ఇంతలో సాక్షి పంచాయితీ పెడుతుంది. నా కంటే వసుధార ఎక్కువైపోయిందని అంటుంది. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget