అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 6th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రిషి కోసం పేపర్​లో యాడ్ ఇచ్చిన వసు – డమ్మీ కాల్ చేయించి వసుతో ఆడుకున్న శైలేంద్ర

Guppedanta Manasu Today Episode: రిషి కోసం పేపర్ లో వసుధార యాడ్ ఇవ్వడంతో శైలేంద్ర డమ్మీ కాల్ చేయించి వసుధారతో ఆలాడుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: కాలేజీలో రిషి గురించి మహేంద్ర, వసుధార ఆలోచిస్తుంటారు. రిషి సార్‌ చనిపోయాడంటే నేను నమ్మడం లేదని వసుధార అంటుంది. కానీ రిషిని తీసుకొస్తానని చెప్పిన గడువు దగ్గరపడుతుందని ఎలాగైనా గడువులోపు రిషిని తీసుకురావాలని అంటుంది. దీంతో మహేంద్ర కూడా నీ నమ్మకం నిజమవ్వాలని అంటాడు ఇంతలో అక్కడికి వచ్చిన శైలేంద్ర అది భ్రమ బాబాయ్‌ అంటాడు. వసుధార నేను ముందు నుంచే చెప్తున్నాను రిషి రాడు లేడు అని అనగానే వసుధార కోపంగా రిషి సర్‌ ఉన్నాడు.. వస్తారు అంటుంది.

మహేంద్ర: శైలేంద్ర ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావా? నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నాటకాలు ఆడకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు.

శైలేంద్ర: నాటకాలు ఆడేది నేను కాదు. మీరు నేను మోసగాణ్ని అయితే మీరు నన్ను మించిన మోసగాళ్లు..

మహేంద్ర: మేము మోసగాళ్లమేం కాదు.

 వసుధార నువ్వు ఏండీ సీటు కోసమే రిషి బతికి ఉన్నాడని నాటకాలు ఆడుతున్నావు అంటాడు శైలేంద్ర. ఇంతలో మను అక్కడికి వస్తాడు. దీంతో మను నువ్వైనా చెప్పు రిషి ఇక రాడని లేడని వీళ్లు నమ్మటం లేదు. అనగానే రిషి సార్‌ వస్తాడని మను చెప్తాడు. ఎలా చెప్తున్నావు అంటే నమ్మకం అంటాడు మను. దీంతో వెటకారంగా నవ్వుతూ సరే రిషిని తీసుకురావడానికి ఇంకొన్ని రోజులే అప్పుడు నువ్వు మాటమీద నిలబడాలి అని అడగ్గానే మహేంద్ర ఎందుకు నిలబడాలిరా అని శైలేంద్రను వెళ్లిపోమంటాడు. మరోవైపు ఇంట్లో పేపరు చూస్తున్న దేవయాని రిషి కనిపించడం లేదని ఉన్న యాడ్‌ చూసి గట్టిగా అరుస్తుంది.

ఫణీంద్ర:  ఏంటి దేవయాని ఎందుకలా అరిచావు.

ధరణి: అత్తయ్యా ఏం జరిగింది ఎందుకలా ఉన్నారు.

దేవయాని: నేను ఈ విడ్డూరం ఎక్కడా చూడలేదండి? రిషి కనిపించడం లేదని వసుధార పేపర్‌లో ప్రకటన ఇచ్చిందండి. ఇదిగోండి మీరే చూడండి నేను చెబితే వినరు కదా?

దేవయాని: చూశారా అండి వాళ్లు ఎలాంటి పని చేశారో. రిషి ఉన్నాడని ఆ వసుధార  మూడు నెలల్లో తీసుకొస్తానని చాలెంజ్‌  చేసింది. ఇప్పుడేంటి ఇలా పేపర్‌లో ప్రకటన ఇచ్చింది.

శైలేంద్ర: ఆ వసుధార ఏంటి మామ్‌ రిషి పోయాడంటే ఎందుకు నమ్మడం లేదు. మనమందరం ఎన్నో రకాలుగా వెతుకుతున్నా కూడా రిషి దొరకటం లేదంటే తను లేడనే కదా అర్థం .

దేవయాని: ఆ విషయం మనకు అర్థం అయితే ఏం లాభం. రిషికి కర్మకాండలు జరగకుండా చేసి ఆ వసుధర భూషణ్‌ ఫ్యామిలీ పరువు ఎప్పుడో తీసింది.

 అంటూ ఆ ఎండీ సీటు కోసమే వసుధార ఇదంతా చేస్తుందని దేవయాని అనగానే ఫణీంద్ర, దేవయానిని తిడతాడు. భూషణ్‌ ఫ్యామిలీకి పట్టిన పెద్ద భూతానివి నువ్వే అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు పేపర్‌లో యాడ్‌ చూసి ఆలోచిస్తుంది వసు. ఇంతలో మను వచ్చి ఎవరైనా ఫోన్‌ చేశారా అని అడుగుతాడు.

వసుధార: లేదు మను గారు ఎవరూ ఫోన్‌ చేయలేదు.

మను: ఒకవేళ రిషి సార్ ను చూసిన వాళ్లు ఈ యాడ్‌ చూసి ఉండకపోవచ్చు. ఈ యాడ్‌ను చూసిన వాళ్లు రిషి సార్‌ను చూసి ఉండకపోవచ్చు. అందుకే ఇప్పటి వరకు ఏ ఫోన్‌  రాలేదు.

ఇంతలో ఎవరో పుల్లయ్యా అంటూ ఫోన్‌ చేసి రిషి సార్‌ లాగే ఉన్న  వ్యక్తిని తాను చూశానని అడ్రస్‌ చెప్తాడు. దీంతో వసు, మను ఆ పుల్లయ్య చెప్పిన అడ్రస్‌ వెళ్తారు. పుల్లయ్యకు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడు. ఇంతలో అక్కడ శైలేంద్ర ఉంటాడు. దీంతో పుల్లయ్య పేరుతో ఫోన్‌ చేసింది శైలేంద్రే అనుకుని కోపంగా దగ్గరకు వెళ్తారు. వసు, శైలేంద్రను తిడుతుంది దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మూసి ఉన్న గుడిని తెరిపించిన యంగ్‌ హీరో నిఖిల్‌ - పూలతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు, వీడియో వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Embed widget