అన్వేషించండి

Guppedanta Manasu Serial Today July 2nd: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: వసుధారకు బట్టలు కొనిచ్చిన రంగ – అలిగిపోయిన సరోజ

Guppedanta Manasu Today Episode: వసుధార అడగ్గానే అప్పు చేసి మరీ బట్టలు కొనిచ్చాడని తనకు మాత్రం కొనివ్వడం లేదని సరోజ వాళ్ల నాన్నతో చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: రంగ ఆటో తీసుకుని బయటకు వెళ్తుంటే వసుధార వచ్చి తనకు కొన్ని బట్టలు కావాలని షాపింగ్‌ చేద్దామని అడుగుతుంది. షాపింగ్‌ ఎందుకు నేను వెళ్లి తీసుకొస్తానని రంగ చెప్పి బుజ్జిని తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత వసుధార, రాధమ్మ కూరగాయలు కట్‌ చేస్తుంటారు. ఇంతలో సరోజ  వస్తుంది. రంగను పెళ్లి చేసుకున్నాక మేమిద్దరం ఒక్కటే కదా అంటుంది. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావు రేపు పెళ్లాయ్యాక ఇంకేమన్నా ఉందా? అంటుంది రాధమ్మ. ఇంతలో బావ ఎక్కడున్నాడు అని సరోజ అడగ్గానే నాకు బట్టలు తీసుకురావడానికి వెళ్లాడని వసుధార చెప్తుంది. దీంతో సరోజ, రాధమ్మ మీద కోప్పడుతుంది. బావ బట్టలే కాదు ఏం తీసుకొచ్చినా నాకే తేవాలి. ఏం చేసినా నా కోసమే చేయాలి అంటుంది. తర్వాత వసుధారను తిడుతుంది. మరోవైపు శైలేంద్ర ఏడుస్తూ దేవయానితో మను ఇచ్చిన వార్నింగ్‌ గురించి చెప్తాడు.

శైలేంద్ర: ఈ అవమాన భారం తట్టుకోలేకపోతున్నాను మామ్‌. వాడు నా కింద బచ్చాగాడు. ఈరోజు నన్ను భయపెట్టాడు. నాకు ముచ్చెమలు పట్టించాడు. నేను వాణ్ని వదలను మామ్‌. ఇంతకు రెండితలు పగ తీర్చుకుంటాను.

దేవయాని: వద్దు నాన్న వాడి పాపాన వాడే పోతాడు. ఈ విషయం ఇంతటితో వదిలేసేయ్‌.

శైలేంద్ర: అలా అంటావేంటి మామ్‌ . వాడు నా చేత గుంజీలు తీయించాడు. అందుకే భయం అంటే ఏంటో వాడికి పరిచయం చేయాలని కంకణం కట్టుకున్నాను. నేను ఈ విషయం అంత తేలిగ్గా తీసుకోను మామ్‌.

దేవయాని: నాన్నా నీకంటే నాకు వాడి మీద పదింతలు పగ తీర్చుకోవాలని ఉంది. నువ్వు అందరి ముందు హూందాగా తిరగాలనుకున్నాను. నీ కాలికి మట్టి అంటకుండా పెంచాను. అలాంటిది వాడు నిన్ను బెదిరించాడు. అయినా నేను ఎందుకు కూల్‌గా ఉన్నానో తెలుసా? మీ నాన్న కోసం

శైలేంద్ర: వాడు ఇంటికి వచ్చాడు అదే టైంకు డాడీ ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది. కానీ ఇప్పుడు వాణ్ని డాడీకి తెలియకుండా దెబ్బ కొడతాను.

 అనగానే తొందరపడకు మరోసారి మిస్‌ అయితే వాడు మళ్ళీ నిన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తాడు. మనకంటూ ఓ టైం వస్తుంది. అప్పుటి వరకు ఓపిక పట్టు మనకు కావాల్సింది ఎండీ సీటు. దాని మీద నీ ఫోకస్‌ పెట్టు అని దేవయాని చెప్తుంది. మరోవైపు సరోజ కోపంగా రంగ కోసం ఎదురుచూస్తుంది. ఇంతలో బట్టలు తీసుకుని రంగ, బుజ్జి వస్తారు.

ALSO READ: అదేంటీ అలా ఉన్నారు.. నాగ్ అశ్విన్, విజయ్ దేవ‌ర‌కొండ ఫొటో వైరల్

సరోజ: బావ ఏంటి నువ్వు చేస్తున్న పని అసలు నీకు మతి ఉండే చేస్తున్నావా?

రంగ: ఏయ్‌ నేనేం చేశాను.

సరోజ: తనకు బట్టలు తీసుకురావడానికి నువ్వెందుకు వెళ్లావు.

రంగ: అదేంటి సరోజ అలా అంటావు తనకు లేవు కదా?

సరోజ: లేకపోతే నా బట్టలు ఇచ్చాను కదా అవి వేసుకుంటుంది కదా?

రంగ: అవి కరెక్టుగా లేవనుకుంటా?

సరోజ: తనకు కరెక్టుగా లేవని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు.

రంగ: తనే చెప్పారు.

సరోజ: ఆవిడ గారికి అన్ని అనుకూలంగా అనుగుణంగా ఉండాలా? నాలుగు రోజులు ఉండి పోయే దానికి కొత్త బట్టలు కావాలా?

  అని సరోజ కోప్పడుతుంటే ఇంతలో రాధమ్మ, వసుధార లోపలి నుంచి వస్తారు. రంగ తెచ్చిన బట్టలు చూసి ఇది నాకు నచ్చిన కలర్‌, ఇది నాకు నచ్చిన డిజైన్‌ అని చెప్తుంది వసుధార. ఇన్ని బట్టలకు డబ్బులు ఎలా వచ్చాయని రాధమ్మ అడగ్గానే అప్పు చేసి తీసుకొచ్చానని రంగ చెప్పడంతో రాధమ్మ బాధపడుతుంది. సరోజ మాత్రం నాకు కూడా బట్టలు తీసుకురమ్మని అడుగుతుంది. దీంతో రంగ నేను తీసుకురానని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత సరోజ వాళ్ల నాన్నతో రంగ గురించి చెప్తుంది. బావతో పెళ్లి చేయమని అలిగి భోజనం చేయకుండా వెళ్లిపోతుంది. మరోవైపు రంగాకు ఉన్న బట్టలు చూసి వసుధార బాధపడుతుంది. ఎలా ఉండేవారు ఎలా ఉంటున్నారు అని అడుగుతుంది. దీంతో రంగ మేడం గారు మీరు ఇంకా కలలోనే ఉన్నట్టున్నారు అంటాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget