అన్వేషించండి

Guppedanta Manasu Serial Today July 20th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: ధనరాజ్ కు క్లారిటీ ఇచ్చిన రంగ – భయంతో వణికిపోయిన శైలేంద్ర, దేవయాని

Guppedanta Manasu Today Episode: తమ మధ్య బావ మరదళ్ల సంబంధమే ఉందని ధనరాజ్ కు రంగ క్లారిటీ ఇస్తాడు. రంగా మాటలకు దేవయాని, శైలేంద్ర భయపడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  బయట వెయిట్‌ చేస్తున్న వసుధార లోపల మాట్లాడుతున్న  దేవయాని గొంతు విని   ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది అనుకుని లోపలికి వెళ్తుంది. లోపలి నుంచి వసుధార రావడం గమనించిన సరోజ అమ్మో ఇది లోపలికి వస్తుంది. ఇది వస్తే ఇంకేం అనుకుంటూ బయటకు వెళ్లి వసుధారను పక్కకు లాక్కెళుతుంది. నువ్వు లోపలికి రావొద్దని వస్తే నా పెళ్లి సెట్‌ చేస్తావని సరోజ అనగానే నాకు లోపల ఎవరో తెలిసినట్లు అనిపిస్తే వస్తున్నానని చెప్తుంది. మరోవైపు ధన్‌రాజ్ రంగాను సరోజ ఎప్పటి నుంచి తెలుసని అడుగుతాడు.

రంగ: చిన్నప్పటి నుంచి తెలుసు.

ధనరాజ్: అంటే చిన్నప్పటి నుంచి తెలిస్తే మీరే సరోజను పెళ్లి చేసుకోవచ్చు కదా? మీ ఈడు జోడు కూడా బాగుంటుంది. ఏమంటావు అమ్మా

రంగ: చిన్నప్పటి నుంచి తెలుసు కానీ నాకెప్పుడు తన మీద ప్రేమ పెళ్లి అనే ఆలోచన రాలేదు. మా ఇద్దరి మధ్య ఉంది కేవలం బావ మరదళ్ల సంబంధమే

ధనరాజ్: మరి మీకు తన మీద ప్రేమ లేకపోతే తనకు మీ మీద ప్రేమ ఉండొచ్చు కదా

రంగ: అలాంటిదేం లేదండి.

ధనరాజ్‌: ఏమో తనని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది.

సంజీవ: తను మిమ్మల్ని టెస్ట్‌ చేయడానికి అలా ప్రవర్తించింది అంతే

ధనరాజ్‌: అవునా నిజమా?

రంగ: కావాలంటే ఇప్పుడే మీరే చూడండి. తనొచ్చి ఏం చెప్తుందో తెలుసా? మా బావంటే నాకిష్టం. బావ లేకుండా నేనుండలేను. అని ఏవేవో సినిమా డైలాగులు చెప్తుంది.

ధనరాజ్: ఎందుకు?

సంజీవ: మిమ్మల్ని టెస్ట్‌ చేయడానికి

సరోజ: నువ్వు కానీ ఇప్పుడు లోపలికి వచ్చావంటే నేను ఎంతకైనా తెగిస్తాను. ప్రాణాలు తీయడానికైనా ప్రాణం తీసుకోవడానికైనా

వసుధార: అంత అవసరం లేదులే కానీ వెళ్లు వెళ్లి రిషి సర్‌ ను త్వరగా రమ్మను.

   అనగానే సరోజ లోపలికి వెళ్తుంది. వెంటనే స్ట్రెయిట్‌గా చెప్తున్నాను. అంటూ రంగ ఇష్టమని రంగ లేకపోతే బతకలేనని అయినా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మీ ఇష్టం అని సరోజ చెప్పగానే ధనరాజ్‌ అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటాడు. దీంతో రంగ తాను వెళ్తానని చెప్పి వెళ్లిపోతుంటే శైలేంద్ర, దేవయాని భయంగా లేచి నిలబడతారు. సరోజ పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు ఎంజేల్‌, మనును కాలేజీ వదిలేయడం ఏంటని అడుగుతుంది.

మను: నాకు వదిలేయడం ఇష్టం లేదు. కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలేయాల్సి వస్తుంది. అందుకని నేను అయిష్టంగానే కాలేజీ నుంచి దూరం కావాల్సి వచ్చింది.  

ఎంజేల్‌: ఏంటి బావా ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు వదిలేశావు. మొన్న దేవయాని మాటలకు ఈ నిర్ణయం తీసుకున్నావా?

మను: అదేం లేదు. ఒకరికి భయపడో ఒకరు బ్లాక్‌ మెయిల్‌ చేశారనో నా నిర్ణయాలు మార్చుకోను

ఎంజేల్‌: ఏంటి అత్తయ్యా నువ్వైనా చెప్పొచ్చు కదా?

అనుపమ: తనని కాలేజీ నుంచి దూరం అవ్వమని చెప్పిందే నేను.

అని అనుపమ చెప్పగానే ఎంజేల్‌ షాక్‌ అవుతుంది. ఎందుకు వదిలేయమన్నావని అడుగుతుంది. అనుపమ పలకదు. నువ్వు చెప్పకపోతే బావ ఇదివరకు ఎండీ అయ్యేవాడు. పాపం నీవల్లే తను అన్ని వదులుకుంటున్నాడు. అనగానే నువ్వు నా మీద జాలి చూపించొద్దు నేను మా అమ్మ కోసం ఏమైనా చేస్తానని మను అంటాడు. మరోవైపు మహేంద్ర, వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ధరణి వచ్చి బాధపడొద్దని  మీకు మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్తుంది. మరోవైపు ఆటోలో వెళ్తున్న వసుధార, రంగను పెళ్లికొడుకు ఎలా ఉన్నాడని అడుగుతుంది. అదంతా నాకెలా తెలుస్తుందని నేను వాళ్లకు ఒక క్లారిటీ ఇవ్వడానికి అక్కడికి వెళ్లానని చెప్తాడు రంగ.   దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget