Guppedanta Manasu August 31st: ఉప్పెనంత ప్రేమతో గుప్పెడంత గుండెలో రిషిధార యుద్ధం, పెళ్లి విషయంలో అస్సలు తగ్గని ఏంజెల్!
Guppedantha Manasu August 31st: గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త లవ్ ట్రాక్ నడుస్తోంది. వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్.
గుప్పెడంతమనసు ఆగష్టు 31st ఎపిసోడ్ (Guppedanta Manasu August 31st Written Update)
ఏంజెల్ ప్రేమను అంగీకరించమని వసుధార రిషికి చెబుతుంది. మీ మనసులో ఎవరూ లేనప్పుడు తనని అంగీకరించవచ్చుకదా.. ఓ ఆడపిల్ల సిగ్గువిడిచి మీపై ప్రేమను చెప్పింది, మీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతోంది,ఒప్పుకోవచ్చు కదా సార్ అంటుంది వసుధార. ఏంజెల్ మాత్రం ఇంకా అడుగు అంటుంది..మాట్లాడండి సార్ అని వసుధార ఇబ్బందిగా అడుగుతుంది. పోనీ మీ మనసులో ఎవరైనా ఉన్నారా ఉంటే అదైనా చెప్పండి అంటుంది.
రిషి: ఎంత తెలివిగా మాట్లాడుతున్నావ్..ఏంజెల్ కి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు సీన్ క్రియేట్ చేసి నా మనసు చెక్ చేస్తున్నావు కదా అనుకుంటాడు మనసులో
వసు: మాట్లాడండి సార్
ఏంజెల్: నేను అడిగితే ఎలాగూ చెప్పవు తను అడిగినప్పుడైనా చెప్పు
రిషి: ఇదంతా ఏంటి..నువ్వు నన్ను అడిగావు నేను క్లియర్ గా చెప్పాను కదా..మూడో మనిషి దగ్గర ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తావ్. మనకు సంబంధం లేని మనిషిని బయట మనిషిని ఇందులో జోక్యం చేయించావ్
ఏంజెల్: బయట మనిషి ఎందుకవుతుంది
రిషి: మన ఇంట్లో మనిషా..
ఏంజెల్: అలానే మనితో మెలిగింది కదా
రిషి: నీకు తనకు ఫ్రెండ్షిప్ ఉంది...తనకు నాకు ప్రెండ్షిప్ ఉంది..కానీ మన వ్యక్తిగత విషయంలో తనని ఇన్వాల్వ్ చేయడం నచ్చలేదని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు
ఆగండి సార్ అని చేయి పట్టుకుంటుంది వసుధార... వదులు అని రిషి అంటే..మన బంధాన్ని ఎలా వదులుకుంటారు సార్ అంటుంది.. ఏంజెల్ షాక్ అవుతుంది..
వసు: ఏంజెల్ తో నాకు స్నేహబంధం ఉంది..తనకు ఏదో విషయం తెలియాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పండి సార్ అని కవర్ చేస్తుంది..
విసురుగా చేయి విసిరికొట్టిన రిషి...తనకి చెబుతున్నా అర్థంకావడం లేదు, కారణాలు అడుగుతోంది, ఇంతకన్నా మించి చెప్పడానికి ఏమీ లేదని కరాఖండిగా చెప్పేసి వెళ్లిపోతాడు.. కొంచెం ఓపికపట్టు ఏంజెల్ నీకు కావాల్సిన సమాధానం వస్తుందని వసుధార అంటే పెళ్లి విషయంలో క్లారిటీ ఇస్తాడా అని అడుగుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతారు..
Also Read: ఏంజెల్ ని పెళ్లిచేసుకోమని చెప్పేసిన వసు - రిషి సమాధానం ఇదే!
ఏ సంబంధం లేని తనని మన విషయంలో ఇన్వాల్వ్ చేయడం నచ్చలేదని రిషి మాట్లాడిన మాటలు వసు తల్చుకుని బాధపడుతుంది..
అటు రిషి కూడా... మీ మనుసులో ఎవరైనా ఉంటే తేల్చి చెప్పండి అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. తెలిసి ఎందుకు బాధపెడుతున్నారని రిషి అనుకుంటే.. న్యాయం అన్యాయాల గురించి ఆలోచించడం లేదు నాకు రిషి సార్ కావాలి తన మనసులో నేనున్నానని అందరి ముందూ చెప్పాలి అని వసు అనుకుంటుంది. మీరెన్ని చేసినా అది జరగదు మేడం , నా నమ్మకాన్ని చంపేశారు, నా ప్రేమను చిదిమేశారని బాధపడతాడు. తన ప్రాణాలు కాపాడ్డం కోసం అలా చేశాం అని వసు..నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు మేడం అని ఎవరికి వారే మనసులో మాట్లాడుకుంటారు. ఏంజెల్ కి చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అందుకే విశ్వనాధం సార్ కే చెప్పాలని ఫిక్సవుతాడు. అటు వసుధారని తండ్రి చక్రపాణి త్వరలోనే అల్లుడుగారు మారుతారని ఓదార్చుతాడు...తన మనసులో నీపై ఉన్న ప్రేమ చెక్కుచేదర్లేదు నువ్వు నిరాశ చెందవద్దని చెబుతాడు.
Also Read: శ్రీవారి సేవలో వసుధార, రిషిని అడిగేద్దామని డిసైడైన ఏంజెల్!
విశ్వనాథం దగ్గరకు వెళ్లిన రిషి.. ఏంజెల్ పెళ్లి గురించి మాట్లాడతాడు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే చూడండని రిషి చెబితే.. ఏంజెల్ కి అన్నీ తెలుసు తను తీసుకునే నిర్ణయం కరెక్టుగా ఉంటుంది, తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లి జరిపిస్తాను అంటాడు విశ్వం. ఇంతలో ఏంజెల్ వస్తుంది..
విశ్వనాథం: రిషి నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు, నీకు మంచి సంబంధం చూడమంటున్నాడు, కానీ నీ మనసులో ఎవరో ఉన్నారని చెప్పావుకదా తనతోనే నీ పెళ్లి జరిపిస్తానని చెబుతున్నాను...ఇంతకీ నీ మనసులో ఎవరున్నారు
ఏంజెల్: రిషి...అని కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి అందరూ షాక్ అవుతారు... నువ్వు పెళ్లి పెద్ద అయ్యావా..నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్ అంటుంది. నువ్వు పడుతో విశ్వం అనేసి..రిషి నువ్వు నాతో రా అంటుంది
విశ్వనాథం: తన మనసులో ఎవరున్నారో నాకు చెప్పడం లేదు కనీసం నీకైనా చెబుతుందేమో తెలుసుకో అని పంపిస్తాడు విశ్వం
ఏంజెల్: ఎందుకు పెళ్లి సంబంధాలు చూడమంటున్నావ్..నా ఇష్టా ఇష్టాలతో పనిలేకుండా సంబంధాలు చూడడం ఏంటి..
రిషి: త్వరగా చేసుకుంటే ఆయన కోర్కె తీర్చి ఆయుష్షు పెంచిన దానివి అవుతావు
ఏంజెల్: నువ్వు ఒప్పుకుంటే డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవచ్చు..నేను నీకు నచ్చలేదా..కారణం చెప్పు..
రిషి: నాకు పెళ్లి మీద ధ్యాస లేదు
ఏంజెల్: ఇది అబద్ధం..అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల లిస్టులో చేరిపోదాం అనుకుంటున్నావా
రిషి: నేను ఒంటరిగా బతకాలి అనుకుంటున్నాను..
ఏంజెల్: నీలాంటి ప్రెండ్ భర్తగా వస్తేనే విశ్వం కోరిక తీరుతుంది..నువ్వు ఆలోచించు రిషి..నేను నిన్ను బలవంతం పెట్టను..రోజూ వెంటపడను, నాకే చిరాగ్గా ఉంది
రిషి: ఏంత సమయం తీసుకున్నా నాది ఒకటే సమాధానం.. అర్థం చేసుకో..ఇక విశ్వనాథం సార్ కోరిక అంటావా నేను మాత్రమే కాదు నువ్వు ఏ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా ఆయన కోరిక తీర్చినదానివి అవుతాయని చెప్పేసి వెళ్లిపోతాడు...
అటు కాలేజీలో జగతి-మహేంద్ర ఫైల్స్ చెక్ చేస్తారు...ఈ నెల జీతం ఇంకా రాలేదని కాలేజీలో పనిచేసే వ్యక్తి చెబుతాడు. షాక్ అవుతారు జగతి మహేంద్ర .ఓసారి మేనేజర్ ని రమ్మని చెప్పండని పంపించేస్తుంది జగతి. మీరు కాన్సన్ ట్రేషన్ తోనే వర్క్ చేస్తున్నారా, ఈనెల జీతాలు ట్రాన్ఫర్ అయ్యాయా అని అడిగితే పడలేదని రిప్లై ఇస్తాడు. ( అకౌంట్స్ బ్లాక్ చేయాలన్న శైలేంద్ర ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట).