Gunde Ninda Gudi Gantalu June 06 Episode: ప్రభావతి పరువు తీసేసిన శ్రుతి, పూల మాలలు ఎత్తికెళ్లిపోయిన గుణ - గుండె నిండా గుడి గంటలు జూన్ 06 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: మనసులో ప్రేమ దాచుకుని బయటపడకుండా కవర్ చేస్తున్నారు మీనా బాలు. గుండెనిండా గుడిగంటలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 06 ఎపిసోడ్
గుణ దగ్గరకు వెళతాడు శివ. ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. టైంపాస్ అవడం లేదు అందరూ మా అక్క వాళ్ల ఇంటికి వెళ్లారని చెబుతాడు శివ. ఎందుకు అని ఆరా తీస్తే పూలదండల ఆర్డర్ సంగతి తెలుస్తుంది. దీంతో అది పెద్ద ఆర్డర్..ఆ మాలలు మండపానికి చేరకుండా అడ్డుకోవాలని తన మనుషులను పిలిచి చెబుతాడు గుణ.
రోహిణి, మనోజ్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో బాలు సెటైర్స్ వేస్తాడు. ఇక్కడ తినేవాళ్లంతా మనిషి కాదా.. ఈ ప్రభావతమ్మ, కామాక్షమ్మ మనిషి కాదా అని సెటైర్స్ వేస్తాడు. మనం మనుషులం కదా మనుషులు తినేదే తింటాం అంటాడు బాలు. రవి కిచిడి అద్భుతంగా చేశాడు బాక్సులో పెట్టి ఇవ్వు మావయ్యకి తీసుకెళ్తాను అంటుంది. కిచిడి చాలా బాగా చేశావ్ అంటూ అంతా మెచ్చుకుంటారు. కమ్మగా వండిపెట్టే మొగుడు దొరికాడు నువ్వు అదృష్టవంతురాలివి అంటుంది కామాక్షి.
ఇంట్లో అంతా సందడి గా ఉండడంతో సత్యం ఆనందంగా ఉంటాడు. ఈ సమయంలో తన కూతురు మౌనిక కూడా ఉంటే బావుండేది అంటాడు. మౌనికా ఎలా ఉందో అని తలుచుకుంటాడు. మౌనిక బాగానే ఉంటుంది..ఆ ఇంట్లో అందరూ బాగా చూసుకుంటారు మీరేం దిగులుపడకండి అంటుంది. పూలు అమ్ముకునే పనా అది ఏమైనా కోట్లలో వ్యాపారం అందుకే మౌనికకు కుదరదు అంటుంది. ఎంతుంటే ఏం వదినా వాళ్లు నిన్ను పూచిక పుల్లని తీసిపడేసినట్టు పడేస్తారు..మీనా వాళ్ల అమ్మ అయితే నీకు గౌరవం ఇస్తుంది అంటుంది కామాక్షి.
మౌనికకు కాల్ చేస్తాడు బాలు..నీకు మేం పరాయివాళ్లం అయిపోయామా, గుడిలో కనబడి అంతా గుర్తుకువస్తున్నాం అని చెప్పావంట కదా. మీ వదిన చెప్పింది అంటుంది మౌనిక. మీ ఆయన ఉన్నాడా ఇంట్లో అంటే లేదు ఒక్కదాన్నే ఉన్నాను అంటుంది. ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బావున్నాను అంటుంది. నిన్ను అక్కడంతా బాగానే చూసుకుంటున్నారా అంటే ఆయన చూపించే ప్రేమ తట్టుకోలకేపోతున్నా అంటుంది. ఇక్కడ అంతా సంతోషంగా ఉన్నాం అంటూ..బాలు తీసుకొచ్చిన ఆర్డర్ గురించి చెబుతాడు. అందరం సంతోషంగా ఉన్నాం..నువ్వు ఒక్కదానివే లేవని తల్చుకుంటున్నాం అంటాడుసత్యం. ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది ప్రభావతి. బాగా బిజీగా ఉన్నట్టున్నావ్...పూలకొట్టు పెట్టుకున్నవాళ్లే బిజీగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు, నువ్వు బిజినెస్ కదా బాగానే ఉండి ఉంటావులే అంటుంది. ఓ తల్లి కూతురితో మాట్లాడినట్టు మాట్లాడు అమ్మా అంటాడు బాలు. ఆ తర్వాత ఇంట్లో అందరితో మాట్లాడుతుంది మౌనిక.
మనోజ్ దొంగతనంగా తింటుంటాడు.. ఆ పక్కనే రోహిణి కూడా అదే పని చేస్తుంది. కిచిడి బలే చేశావురా అని రవిని మనసులోనే మెచ్చుకుంటారు. ఇద్దరూ దొంగతనంగా తింటూ టేస్ట్ బావుందని మాట్లాడుకుంటారు.ఇంతలో బాలు వంటగదిలోకి వస్తాడు. ఇద్దరూ ఓ పక్కన కూర్చుని తినడం చూస్తాడు. పోయిపోయి బాలు కంట్లోనే పడ్డాం అనుకుంటారు. భోజనానికి వచ్చినవారంతా రవి కిచిడినీ మెచ్చుకుంటారు. ఇంతబాగా చేశావ్ సొంతంగా హోటల్ పెట్టుకోవచ్చు కదా అంటారు. మాలలు కట్టేపనిలేదా అని సుమతిపై ఫైర్ అవుతుంది ప్రభావతి.
శ్రుతిని పక్కకు పిలిచి లేనిపోనివి నూరిపోస్తుంది ప్రభావతి. రవి-సుమతి క్లోజ్ గా ఉంటున్నారు నువ్వు పట్టించుకోవడం లేదా.. సుమతి తీరు బాలేదంటూ గొడవ చేసేలా చెబుతుంది. కష్టపడి రవి వంట చేసినందుకు ఆ అమ్మాయి మెచ్చుకుంది అంటుంది శ్రుతి. ఆ సుమతి బుద్ధి మంచిదికాదు అదో పెద్ద కిలాడీ నువ్వు జాగ్రత్తగా ఉండు అంటుంది. వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అంటుంది శ్రుతి. కానీ ప్రభావతి ఆగకపోవడంతో శ్రుతి హాల్లోకి వచ్చి..అందర్నీ అడుగుతుంది. డౌట్ నాకు కాదు మీ అమ్మకి అని బయటపెట్టేసి..సుమతి గురించి ఆమె అన్న మాటలు చెప్పేస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయి-అబ్బాయిలు మాట్లాడుకోవడం సహజం అని ఇచ్చిపడేస్తుంది. మా చెల్లెలి గురించి తప్పుగా మాట్లాడొద్దు తనకి ఎవరితో ఎలా ఉండాలో తెలుసు అంటుంది మీనా. నువ్వు కూల్ మీనా అంటూ శ్రుతి సపోర్ట్ చేస్తుంది. మీ అబ్బాయి గురించి మీకు తెలియదేమో నా భర్త గురించి నాకు తెలుసు అంటుంది శ్రుతి. ఈ అమ్మాయి ఒక్కర్తీ చాలు మా వదినను కంట్రోల్ చేయడానికి అనుకుంటుంది కామాక్షి. సత్యం ప్రభావతిని తీసుకెళ్లి క్లాస్ వేస్తాడు.
గుండెనిండా గుడిగంటలు జూన్ 09 సోమవారం పూలమాలల ట్రక్ పంపిస్తారు బాలు మీనా. మధ్యలో డ్రైవర్ ని దింపేసి గుణ మనుషులు ఆ పూలదండలు తీసుకెళ్లిపోతారు. మరోవైపు రాజకీయనాయకుడు మాలలు ఎక్కడ అని హడావుడి చేస్తుంటాడు




















