Gruhalakshmi September 6th: సామ్రాట్ గురించి షాకింగ్ న్యూస్- బాధలో తులసి, ఒంటరైన హనీ
నందు తులసితో మళ్ళీ ఒక్కటి అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు తన ప్రేమ సంగతి తులసికి చెప్పాడని పరంధామయ్య వాళ్ళు తెగ మురిసిపోతారు. కాసేపు సోది డిస్కషన్ తర్వాత తులసి అసలు విషయం చెప్తుంది. కేఫ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ సంగతి తనకి చెప్పారని అంటుంది. ఇప్పటికైనా ఆ లెటర్ ఇవ్వమని తులసి అనేసరికి నందు తన చేతిలో కవర్ ఇస్తాడు. అది తులసి తీసి చూసి షాక్ అవుతుంది. అయితే తను షాక్ అయ్యింది లెటర్ చూసి కాదు పేపర్లో పడిన వార్త చూసి గట్టిగా మావయ్య అని అరుస్తుంది. ఘోర విమాన ప్రమాదం అందులో సామ్రాట్ చనిపోయాడని రాసి ఉంటుంది. అది చూసి తులసి కుప్పకూలిపోతుంది. పేపర్లో పడిన సామ్రాట్ మన సామ్రాట్ ఒకటి అవాలని లేదు కదా అని పరంధామయ్య అంటాడు. వెంటనే నందు టీవీ ఆన్ చేస్తే అందులో సామ్రాట్ ఫోటో చూపిస్తారు. అది చూసి తులసి కళ్ళు తిరిగిపడిపోతుంది. వెంటనే ఏడుస్తూ సామ్రాట్ ఇంటికి వెళ్లాలని బయల్దేరుతుంది.
హనీ సామ్రాట్ ఫోటో ముందు కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తులసిని చూడగానే హనీ ఏడుస్తూ వెళ్ళి కౌగలించుకుంటుంది. హనీ మాటలు విని తులసి ఎమోషనల్ అవుతుంది. డాడీ ఎక్కడని తాతయ్యని అడిగితే దేవుడు దగ్గరకి వెళ్లాడని చెప్తున్నాడని ఏడుస్తుంది.
Also Read: కోడలి తుప్పు వదిలించిన భవానీ- మురారీ దక్కకపోతే చచ్చిపోతానన్న ముకుంద
హనీ: డాడీ ఏమో అమెరికా వెళ్తున్నా అని చెప్పారు తాతయ్య ఏమో ఇలా చెప్తున్నారు. డాడీకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆంటీ తాతయ్య మాటలు ఏం అర్థం కావడం లేదు
తులసి: అర్థం కాకపోవడం నీ అదృష్టం. దేవుడు మాకు కూడా అలాంటి అదృష్టం ఇస్తే బాగుండేది
హనీ: ఒక్కసారి డాడీతో మాట్లాడించవా? చూడాలని ఉంది
తులసి: చూడాలని అనిపిస్తే కళ్ళు మూసుకుని పడుకో కనిపిస్తారు
హనీ: నాకు ఎందుకో భయంగా ఉంది. అప్పుడు మమ్మీ ఎక్కడని అడిగితే దేవుడి దగ్గరకి వెళ్ళిందని అన్నారు. ఇప్పుడు కూడా డాడీ దేవుడి దగ్గరకి వెళ్లిపోయాడని అంటున్నారు. డాడీ ఇక రాడా? అని ఏడుస్తుంది. నేను కూడ దేవుడి దగ్గరకి వెళ్తాను నాకు డాడీ కావాలి ఆంటీ
సామ్రాట్ బాబాయ్: దేవుడు దుర్మార్గుడు సామ్రాట్ ఆఖరి చూపు కూడా దక్కుకుండా బూడిద చేశాడు
ఇంటి దగ్గర అనసూయ సామ్రాట్ గురించి తలుచుకుని బాధపడుతుంది. కాసేపు సామ్రాట్ మంచితనాన్ని పొగుడుతారు. తులసి జీవితాన్ని మార్చాడు. తనకి కొత్త జీవితాన్ని ఇచ్చాడని అనుకుంటారు. హనీ తండ్రి కోసం ఏడుస్తూ ఉంటే తులసి ఓదార్చి నిద్రపుచ్చుతుంది.
సామ్రాట్ బాబాయ్: నా చివరి రోజుల్లో వాడు తోడుగా ఉంటాడని అనుకుంటే మోయలేని భారం నా మీద వేసి పారిపోయాడు. నాకు నేనే బరువైన ఈ వయసులో హనీ బాధ్యత ఎలా మోయను. నా తర్వాత హనీ పరిస్థితి ఏంటమ్మా?
నందు: అనుకోని కష్టం మీద పడినప్పుడు ఇలాగే ఉంటుంది. ఏమి తోచదు మనసు కుదుటపడనివ్వండి
Also Read: కళావతి మీద రాజ్ దొంగ ప్రేమ - స్వప్న, రాహుల్ ఎక్కడికి వెళ్ళినట్టు!
సామ్రాట్ బాబాయ్: ఇప్పుడంటే నువ్వు ఉండి ఓదార్చి అన్నం తినిపించి నిద్రపుచ్చావ్. లేచిందంటే ప్రశ్నలు వేస్తుంది తనకి ఏం చెప్పి ఓదార్చాలి. ఇక్కడితో ఈ కష్టం తీరదు. సామ్రాట్ లేకుండా అతని బిజినెస్ నడవదు. వేల మంది బతుకుతున్నారు.. హనీతో పాటు వాళ్ళు కూడా అనాథలు అయ్యారు
తులసి: ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. నా జీవతాన్ని సామ్రాట్ ఒక దారిన పెట్టాడు. దేవుడిని నమ్ముకోవాలి అంతక మించి మార్గం లేదు. మీకు మేం తోడుగా ఉన్నాం మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలేస్తాం. సామ్రాట్ ఉండగా సుఖాన్ని పంచుకున్నాం మనకి ఎలాంటి కష్టాలు రాకుండా ఆయన చూసుకున్నారు. ఆయన రుణం తీర్చుకుందాం